🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 103 / Sri Gajanan Maharaj Life History - 103 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 19వ అధ్యాయము - 11 🌻
ఆ ఎర్రగుళకరాయిని రోజూ భక్తితో పూజిస్తూ దానిముందు యోగాసనాలు చెయ్యమని నిమోన్కరుకు ఆయన ఉపదేశించాడు. ఆ విధంగా శ్రీమహారాజు కృపవల్ల శ్రీనిమోన్కరు యోగాసనాలు నేర్చుకున్నాడు.
షేగాం వాసిఅయిన తుకారాం కొకాటేకు పిల్లలు చిన్నతనంలోనే చనిపోవడం అనేదురదృష్టం ఉండేది.అందుకు తనపిల్లలు బతికితే ఒక పిల్లవాడిని శ్రీమహారాజుకు ఇస్తానని అతను మొక్కుకున్నాడు. అటు పిదప కొకాటేకు ముగ్గురు పిల్లలు పుట్టి అందరూ బతికారు, కానీ అతను తనమొక్కు మరిచి, వాగ్దానం ప్రకారం ఒక పిల్లవాడిని శ్రీమహారాజుకు ఇవ్వలేదు. అతని పెద్దకుమారుడు నారాయణ జబ్బుపడి ఏవిధమయిన ఔషదానికి తేరుకోలేదు. రోజురోజుకు అతని పరిస్థితి క్షీణించి పోతోంది. తుకారాంకు అకస్మత్తుగా తనమొక్కు గుర్తువచ్చి, నారాయణకు నయం అవగానే అతనిని శ్రీమహారాజుకు ఇచ్చవేస్తానని అనుకున్నాడు.
నారాయణ నిజంగా నయమయి, తరువాత అతనిని మొక్కుప్రకారం శ్రీమహారాజు సేవ కొరకు ఇచ్చారు, నారాయణ ఇంకా షేగాంలో ఉన్నాడు మరియు శ్రీమహారాజుకు ఒకసారి మొక్కుకున్నాక అది నిభాయించాలని భక్తులకు ఉపదేశిస్తూ ఉంటాడు. శ్రీగజానన్ మహారాజు హరిపాటిల్తో కలసి చిట్టచివరికి చేరవలసిన లక్ష్యంఅయిన, కల్పతరువు, కమలనాభుడు, యోగులకు సర్వస్వం అయిన విఠల భగవానుని కలిసేందుకు పండరపూరు వెళ్ళారు.
వేదాలన్నీ గుణగానం చేసిన, పూర్తి బ్రహ్మాండానికి ఈయనే ఆధారం. రుక్మిణికి అధిపతి, మరియు యోగులందరి హృదయాలలో నివసించేవాడు. ఈయన పూర్తి కరుణామయుడు మరియు భక్తుల ఎడల దయకలవాడు. శ్రీమహారాజు పండరపూరు చేరి పవిత్ర చంద్రభాగనదిలో స్నానంచేసి, శ్రీపాండురంగని దర్శనానికి మందిరానికి వెళ్ళారు.
ఓభగవంతుడా, పండరినాధా, భక్తులను రక్షించువాడా, సహాయం చేసేవాడా మరియు అత్యంతశక్తివంతమైన రుక్మిణీకాంతా నాఅర్ధింపు వినండి . మీఆజ్ఞ ప్రకారం ఈభూప్రపంచంలో జీవించి, పవిత్రులయినవారి కోరోకలు తీర్చాను. నాఈ భూప్రపంచంమీద పని అయిందని మీకు తెలుసు. ఓపాండురంగా ఇక నాకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వండి. నేను వైకుంఠం చేరి మీపాదాలవద్ద స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఇలా అంటూ సమర్ధ చేతులు కట్టుకున్నారు.
హరిపాటిల్ నుండి వేరు అవుతాననే ఆలోచనతో కళ్ళు నీళ్ళతో నిండాయి. ఓగురుదేవా మీ ఈకళ్ళలో నీళ్ళు ఎందుకు ? నేను ఏవిధంగానయినా మిమ్మల్ని నొప్పించానా ? దయచేసి వెంటనే చెప్పండి అని హరిపాటిల్ చేతులు కట్టుకుని అన్నాడు. నేను దీనికి కారణం చెప్పినా నువ్వు బహుశ అర్ధం చేసుకోలేవు. ఇది చాలాగూఢమయిన జ్ఞానం. దానిగురించి తెలుసుకుందుకు నువ్వు ఇప్పుడు చితించనవసరంలేదు.
మన సాంగత్యం ఇక పూర్తి అవవచ్చింది అన్నది ఒక్కటే నేను చెప్పగలను, పద మనం షేగాం వెనక్కి వెళదాం, నీకు నీతరువాత కుటుంబీకులకి ఎప్పటికీ ఏవస్తువుకి కొరతరాదు అని శ్రీమహారాజు జవాబు ఇచ్చారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 103 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 19 - part 11 🌻
He advised Nimonkar to worship that red pebble devotedly every day and perform yogasanas before it. Thus Shri Nimonkar learnt yogasanas by the grace of Shri Gajanan Maharaj. Tukaram Kokate of Shegaon had the misfortune of his children dying in infancy.
So he vowed that he would give away one child to Shri Gajanan Maharaj if his children survived. Thereupon Kokate got three children and all of them survived, but he had forgotten his vow, and one child, as promised, was not given to Shri Gajanan Maharaj . His elder child Narayan got ill and did not respond to any medication.
His condition was getting grave everyday. Tukaram, then, suddenly remembered his vow, and said that as soon as Narayan was cured he would be given away to Shri Gajanan Maharaj . Narayan really recovered soon, and then he was given to Shri Gajanan Maharaj , to serve Him, as per the vow.
Narayan is still there at Shegaon, and advises the devotees, that any vow once made to Shri Gajanan Maharaj must be honoured. Shri Gajanan Maharaj, along with Hari Patil, went to Pandharpur to meet God Vithal, who is the ultimate goal to reach, a Kalpataru, a Kamalnabh and all in all with the saints.
He is the supporter of this universe, the virtues of whom are praised by all Vedas, Lord of Rukmini, and the One residing in the hearts of all Saints. He is full of compassion and kindness to the devotees. Shri Gajanan Maharaj reached Pandharpur, took a bath in the Holy Chandrabhaga River, and went to the temple for the Darshan of Shri Panduranga.
Shri Gajanan Maharaj said, O God Pandharinatha, benefactor and protector of devotees, and all powerful Rukmini Kanta, listen to my request. As per your command, I have so far lived on this earth and fulfilled the desires of all pious people. You know that my mission on the earth is now over.
O Panduranga, permit me to go now. God, I wish to reach Vaikunth for a permanent stay at your feet, in the ensuing month of Bhadrapada. Saying so, Shri Samarth folded his hands. Tears brimmed in his eyes at the thought of separation from Hari Patil. Hari Patil, with folded hands, said, O Gurudeo, why these tears in Your eyes? Have I hurt You in any way? Kindly tell me immediately.
Shri Gajanan Maharaj replied, You may not understand it even if I tell you the reason. It is very deep knowledge, and you need not bother to know it at present I can only say that our association is coming to an end. Come on, let us go back to Shegaon. You and your descendants will never fall short of anything.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 Nov 2020
No comments:
Post a Comment