శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 30 / Sri Devi Mahatyam - Durga Saptasati - 30



🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 30 / Sri Devi Mahatyam - Durga Saptasati - 30 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 8

🌻. రక్తబీజ వధ - 4
🌻

44. అతని శరీరం నుండి ఎన్ని రక్తబిందువులు నేలపై పడ్డాయో అంతమంది బలసాహస పరాక్రమాలలో అతని వంటివారు పుట్టారు.

45. అతని రక్తం నుండి ఉత్పత్తియైన వీరులు కూడ మాతృకలతో సమానంగా, అతిభీషణంగా, అత్యుగ్రశస్త్రాలు ప్రయోగిస్తూ పోరాడారు.

46. మళ్ళీ ఆమె వజ్రాయుధపు తాకిడికి అతని శిరస్సుగాయపడి అతని రక్తం ప్రవహించగా, ఆ రక్తం నుండి వేలకొద్ది వీరులు పుట్టారు.

47. ఆ అసురేశ్వరుణ్ణి వైష్ణవి తన చక్రంతో, ఐంద్రి తన గదతో, యుద్ధంలో కొట్టారు.

48. వైష్ణవియొక్క చక్రంచే చీల్చబడినప్పుడు కారిన రక్తం నుండి పుట్టిన అతని ప్రమాణాలు గల మహాసురసాహస్రంతో జగత్తు నిండిపోయింది.

49. కౌమారి బల్లెంతో, వారాహి ఖడ్గంతో, మాహేశ్వరి త్రిశూలంతో రక్తబీజమహాసురుణ్ణి కొట్టారు.

50. రక్తబీజుడు కూడా కోపావేశంతో ఆ మాతృకల నందరినీ తన గదతో గట్టిగా కొట్టాడు.

51. శక్తి శూలాది ఆయుధాల వల్ల అతనికి కలిగిన పెక్కుగాయాల నుండి భూమిపై పడ్డ రక్తసమూహం నుండి వందల కొద్దీ అసురులు ఉద్భవించారు.

52. ఆ రక్కసుని రక్తం నుండి ఉద్భవించిన ఆసురులు జగత్తునంతా వ్యాపించారు. అందుచే దేవతలు మహాభీతి చెందారు.

53. విషాదమొందిన దేవతలను చూసి చండిక నవ్వి, కాళితో ఇలా పలికెను : ఓ చాముండా ! నీనోటిని విస్తీర్ణంగా తెరువు!

54. నా బాణాలు తగలడంతో కలిగే రక్తాన్ని, ఆ రక్తబిందువుల నుండి ఉత్పత్తైన మహాసురులను ఆ నోటితో వెంటనే మ్రింగివేయి.

55. “అతని వల్ల పుట్టే మహాసురులను భక్షిస్తూ యుద్ధంలో సంచరించు. ఈ దైత్యుడు అట్లు రక్త క్షయం వల్ల మరణిస్తాడు.

56. "నీవు ఇలా వారిని భక్షిస్తే క్రొత్త ఉగ్రరాక్షసులు ఉత్పత్తి కారు.” ఆమెకు ఇలా చెప్పి దేవి అతణ్ణి అంతట శూలంతో పొడిచింది.

57. అంతట కాళి రక్తబీజుని నెత్తుటిని తన నోటితో త్రాగేసింది. అతడు అంతట చండికను తన గదతో కొట్టాడు.

58. ఆ గద దెబ్బవల్ల ఆమెకు అత్యల్పవేదన కూడా కలుగలేదు. కాని, గాయపడిన అతని శరీరం నుండి రక్తం మిక్కుటంగా కారింది.

59-60. అలా కారిన రక్తాన్ని ఎప్పటికప్పుడు చాముండ తన నోటితో మ్రింగుతుండెను. తన నోట్లోని రక్తం వల్ల పుట్టిన మహాసురులను చాముండ మ్రింగుతూ, రక్తబీజుని నెత్తుటిని సైతం త్రాగివేసింది.

61. దేవి శూలంతో, వజ్రాయుధంతో, బాణాలతో, ఖడ్గంతో ఈటెలతో రక్తబీజుణ్ణి కొట్టింది. చాముండ అతని రక్తాన్ని త్రాగివేసింది.

62. రాజా! ఆ రక్తబీజమహాసురుడు అనేక శస్త్రాలతో మిక్కిలి గాయబడి రక్తహీనుడై భూమిపై కూలాడు.

63. రాజా! అంతట దేవతలు మిక్కిలి హర్షం పొందారు, వారి నుండి పుట్టిన మాతృకాగణం రక్తపానోన్మత్తతతో నృత్యం చేసారు.

శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “రక్తబీజవద" అనే అష్టమాధ్యాయము సమాప్తం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 30 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 8:

🌻 The Slaying of Raktabija - 4
🌻

44. As many drops of blood fell from his body, so may persons came into being, with his courage, strength and valour.

45. And those persons also sprung up from his blood fought there with the Matrs in a more dreadful manner hurling the very formidable weapons.

46. And again when his head was wounded by the fall of her thunder-bolt, his blood flowed and there from were born persons in thousands.

47. Vaisnavi struck him with her discus in the battle, Aindri beat that lord of asuras with her club.

48. The world was pervaded by thousands of great asuras who were of his stature and who rose up from the blood that flowed from him when cloven by the discus of Vaisnavi.

49. Kaumari struck the great asura Raktabija with her spear, Varahi with her sword, and Mahesvari with her trident.

50. And Raktabija, that great asura also, filled with wrath, struck everyone of the Matrs severally with his club.

51. From the stream of blood which fell on the earth from him when he received multiple wounds by the spears, darts and other weapons, hundreds of asuras came into being.

52. And those asuras that were born from the blood of Raktabija pervaded the whole world; the devas got intensely alarmed at this.

53-54. Seeing the devas dejected, Chandika laughed and said to Kali, 'O Chamunda, open out your mouth wide; with this mouth quickly take in the drops of blood generated by the blow of my weapon and (also) the great asuras born of the drops of blood of Raktabija.

55. 'Roam about in the battle-field, devouring the great asuras that spring from him. So shall this daitya, with his blood emptied, perish.

56. 'As you go on devouring these, other fierce (asuras) will not be born.' Having enjoined her thus, the Devi next smote him (Raktabija) with her dart.

57. Then Kali drank Raktabija's blood with her mouth. Then and there he struck Chandika with his club.

58-60. The blow of his club caused her not even the slightest pain. And from his stricken body wherever blood flowed copiously, there Chamunda swallowed it with her mouth. The Chamunda devoured those great asuras who sprang up from the flow of blood in her mouth, and drank his (Raktabija's ) blood.

61. The Devi (Kausiki) smote Raktabija with her dart, thunderbolt, arrows, swords, and spears, when Chamunda went on drinking his book.

62. Stricken with a multitude of weapons and bloodless, the great asura (Raktabija) fell on the ground, O King.

63. Thereupon the devas attained great joy, O King. The band of Matrs who sprang from them dance, being intoxicated with blood. Here ends the eighth chapter called 'The Slaying of Raktabija' of Devi-mahatmya in Markandeya-purana, during the period of Savarni, the Manu.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹




10 Nov 2020

No comments:

Post a Comment