శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 289 / Sri Lalitha Chaitanya Vijnanam - 289
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 289 / Sri Lalitha Chaitanya Vijnanam - 289 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 68. శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా ।
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68 ॥ 🍀
🌻 289. 'శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్దధూళికా'🌻
శ్రుతి సీమన్తములనెడి సిందూర ధూళిచే కప్పబడిన పాదములు కలది శ్రీదేవి అని అర్థము.
యజ్ఞార్థ కర్మకు ఫలశ్రుతి బ్రహ్మజ్ఞానమును పొందు అర్హత. బ్రహ్మ జ్ఞానమునకు వేదములు, కర్మజ్ఞానమునకు శాస్త్రములు ఏర్పడినవి. రహస్యమగు వేద మంత్రములకు ఉపనిషత్తులు దిక్సూచిగ ఏర్పడినవి. ఇట్లు శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, వేదము - ఈ మొత్తమును శ్రుతులనిరి. ఈ శ్రుతులు దేవీ తత్త్వమును ప్రకటించుటలో పారము చేరినవి. అనగా సీమాన్తము చేరినవి. అనగాఒక పరిమితి వరకు చేరినవి.
అంతేగాని శ్రీదేవిని పరిపూర్ణముగ వర్ణించుటలో విఫలమైనవి. వేద వాజ్మయమును మించిన వాజ్మయము సృష్టిలో లేదు. అట్టి వాజ్మయము కూడ శ్రీదేవిని వర్ణించుటలో కేవలము సిందూర ధూళివలె (కుంకుమ ధూళివలె) పాదముల నంటినట్లు హయగ్రీవుడు అగస్త్య మహర్షికి తెలుపుచున్నాడు. దైవమును నిర్వచించుట అసాధ్యము. భాషకు, భావమునకు అందని విషయము. భావన, భాషలు అందుండి పుట్టినవే. అందు లోనికి జీవుడు లయమగుటయే యుండును గాని, దైవమును తెలుసుకొనజాలడు. అనుభూతి కలిగిననూ వర్ణింపజాలడు.
దైవము వర్ణనాతీతము గనుక ఎంత వర్ణించిననూ, వివరించిననూ అది కేవలము పాదధూళి పరిమాణమే కలిగి యుండునని అంతకు మించిన స్థానము వేద వాజ్మయమునకు సహితము లేదని శ్రీదేవి మహత్తును యిచ్చట ఆవిష్కరించు చున్నారు. అన్నిటికి అతీతమైన తత్త్వమును పేర్కొనలేక “నేతి నేతి” “ఇది కాదు, ఇది కాదు” అనుచూ శ్రుతులీ తత్త్వమును పేర్కొనినవి. దేవీ
మహత్తును వర్ణించుటలో ఇంతకు మించిన నామము మరియొకటి యున్నదా? అనిపించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 289 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 68. śruti-sīmanta-sindūrī-kṛta-pādābja-dhūlikā |
sakalāgama-sandoha-śukti-sampuṭa-mauktikā || 68 || 🍀
🌻 Śruti-sīmanta-sindūrī-kṛta-pādābja-dhūlikā श्रुति-सीमन्त-सिन्दूरी-कृत-पादाब्ज-धूलिका (289)🌻
This nāma describes Her as the Supreme Brahman, the Absolute. Veda-s are considered as the most sacred texts of all. In this nāma the four Veda-s are personified as goddesses. When these goddesses pay respects to Her by bending and placing their heads at Her feet, the reflection of red colour radiating from the ‘dust’ of Her feet make marks on the parting hair on the heads of these goddesses and appear like vermilion placed on the forehead of married women.
The word ‘dust’ is symbolically mentioned here. The meaning of dust in this context is as follows: Upaniṣads are considered as the head of all Veda-s as they teach ways and means to realize the Brahman. Even these Upaniṣads are not able to describe the Brahman in His original form. Such descriptions are made only by negations and affirmations. It is the case with Veda-s as well. Veda-s never make a perfect description of the Brahman.
This is because the real form of Brahman is beyond comprehension for the normal human mind. Since the Veda-s are represented by these goddesses, they feel ashamed in their inability to describe Her in words. They are satisfied by wearing the dust in Her feet in their parting hair and get satisfied that they are at least able to wear the dust that gives them some knowledge (the knowledge of the Brahman) about Her.
Saundarya Laharī (verses 2 and 3) describes Her feet. “Collecting microscopic particles of the dust falling from your lotus feet, Brahma, Viṣṇu and Śiva carry out their actions.” The next verse says. “The particles of dust of your lotus feet serve to remove the internal darkness of the ignorant.”
Nāmas 287 and 288 dealt with the karma kāṇḍa of the Veda-s and this nāma deals with jñāna kāṇḍa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jul 21
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment