నిర్మల ధ్యానాలు - ఓషో - 44
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 44 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నేను సమస్తంలో భాగాన్ని. అనంతంలో ఒక అల్ప భాగాన్ని. కానీ వేరుగా లేను! అని గ్రహించాలి. అపుడు సమస్త ఆకాశం నీదవుతుంది. 🍀
ఇక్కడున్న మనమందరం అపరిచితులం. ఇది మన యిల్లు కాదు, మన యిల్లు మరెక్కడో వుంది. మనమొక విదేశీ నేలపై వున్నాం. పరదేశంలో వున్నాం. వేరే చోట వున్నామంటే యిల్లు లేనట్లే. ఇక్కడికి రావడమంటే మనం తిరిగి వెనక్కి వెళ్ళాల్సిన వాళ్ళమే. మతమున్న మనిషి నిరహంకారంగా జీవించాలి. నేను సమస్తంలో భాగాన్ని అనంతంలో ఒక అల్ప భాగాన్ని. కానీ వేరుగా లేను! అని గ్రహించాలి. అట్లా గ్రహిస్తే గొప్ప స్వేచ్ఛ కలుగుతుంది. గొప్ప విస్తృతి ఏర్పడుతుంది. అపుడు సమస్త ఆకాశం నీదవుతుంది.
మనం విశాలమైన వాళ్ళం. కానీ అల్పమయిన స్థలంలో బంధిపబడ్డాం. అందుకనే అనంత దు:ఖం. యిది సముద్రాన్ని నీటి బిందువులో యిరికించడం లాంటిది. మనం రెక్కలున్న పక్షులం. మన విహారానికి విశాలాకాశం కావాలి. కానీ పంజరంలో బంధింపబడ్డాం. ఎవరు మనల్ని బంధించలేదు. మనల్ని మనమే బంధించుకున్నాం. జైలు మనమే, ఖైదీలూ మనమే, జైలరూ మనమే. అందుకనే మార్మికులు దీన్ని 'మాయ' అన్నారు. 'కల' అన్నారు. ఇది కలే!
ఒకసారి నువ్వు మేలుకుంటే 'సింహం నన్ను తరుముతోంది', ఆ తరిమే సిహం కూడా నేనే. ఆ విషయాన్ని చూస్తున్నది నేనే. అన్నిటికీ సాక్షీభూతంగా నేనే! జీవితమిట్లా వుంటుంది! పిల్లల అల్లరి చిల్లర ఆటల్ని క్షమించవచ్చు. వాళ్ళు మరిన్ని తప్పులు చేస్తారు. క్షమిస్తాం. నువ్వు పెరిగి పెద్దయ్యాకా నిన్ను క్షమించరు.
ఆహం ఎంత తెలివిలేనిదంటే అది యధార్థానికి వ్యతిరేకమైంది. అది అస్తిత్వానికి శత్రువు. మన వూహలగుండా, కోరికల గుండా, జ్ఞాపకాల గుండా, అత్యాశల గుండా అసూయల గుండా మన సొంత జైళ్ళు కట్టుకుంటాం. అవి మన చుట్టూ వలలల్లుతాయి. మనసు చేసే పనుల సారాంశం అహం. ఈ క్షణమే మనసు గురించి స్పృహతో వుండు. మెల్ల మెల్లగా దాన్నించి బయటపడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment