21-JANUARY-2022 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 21, జనవరి 2022 శుక్రవారం, భృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 147 / Bhagavad-Gita - 147 - 3-28 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 544 / Vishnu Sahasranama Contemplation - 544 🌹
4) 🌹 DAILY WISDOM - 222🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 127🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 61🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*బృగు వాసరే, 21, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 6 🍀*

*11. శరణ్యే త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే |*
*త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే*
*12. పాండిత్యం శోభతే నైవ న శోభంతి గుణా నరే |*
*శీలత్వం నైవ శోభేత మహాలక్ష్మి త్వయా వినా*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ తదియ 08:53:22 వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: మఘ 09:43:40 వరకు తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: సౌభాగ్య 15:05:10 వరకు తదుపరి శోభన
కరణం: విష్టి 08:51:22 వరకు
సూర్యోదయం: 06:49:30
సూర్యాస్తమయం: 18:05:09
వైదిక సూర్యోదయం: 06:53:17
వైదిక సూర్యాస్తమయం: 18:01:21
చంద్రోదయం: 21:05:41
చంద్రాస్తమయం: 09:14:20
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: సింహం
వర్జ్యం: 18:01:20 - 19:41:00
దుర్ముహూర్తం: 09:04:37 - 09:49:40
మరియు 12:49:51 - 13:34:53
రాహు కాలం: 11:02:52 - 12:27:19
గుళిక కాలం: 08:13:57 - 09:38:24
యమ గండం: 15:16:14 - 16:40:42
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49
అమృత కాలం: 07:11:18 - 08:52:26
మరియు 27:59:20 - 29:39:00
కాల యోగం - అవమానం 09:43:40 వరకు
తదుపరి సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
పండుగలు : సంకష్ట చతుర్థి, 
Sankashti Chaturthi, Sakat Chauth
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 147 / Bhagavad-Gita - 147 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 28 🌴*

*28. తత్వవిత్తు మాహాబాహో గుణకర్మవిభాగయో: |*
*గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ||*

🌷. తాత్పర్యం :
*ఓ మాహాబాహో! పరతత్త్వజ్ఞానము కలిగినవాడు భక్తియుతకర్మము మరియు కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి, ఇంద్రియములందును మరియు ఇంద్రియభోగములందును ఆసక్తుడు గాకుండును.*

🌷. భాష్యము :
భాష్యము పరతత్త్వము నెరిగినవాడు భౌతిక సంపర్కములో తన హేయస్థితిని గుర్తింపగలుగును. తాను పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణుని అంశననియు మరియు తానూ భౌతికజగమునందు ఉండరాదనియు అతడెరుగును. నిత్యానంద జ్ఞానపూర్ణుడైన భగవానుని అంశగా తన నిజస్థితిని అతడు తెలిసికొనగలిగి ఏదియోనొక కారణము చేత జీవితపు భౌతికభావన యందు చిక్కుబడితినని అవగతము చేసికొనగలుగును. 

వాస్తవమునకు పరిశుద్ధస్థితి యందు అతడు తన కర్మములు నన్నింటిని శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవతో ముడివేయవలసియున్నది. కావున అతడు కృష్ణపరకర్మల యందు నియుక్తుడై సమయానుగుణములు మరియు తాత్కాలికములు అయిన ఇంద్రియకర్మల యెడ సహజముగా అసంగుడగును. 

అట్టివాడు భౌతికజీవనస్థితి భగవానుని ఆధీనమున ఉన్నటువంటిదని తెలిసి ఎట్టి కర్మఫలముల చేతను కలతనొందకుండును. పైగా వాటిని అతడు భగవత్కరుణగా భావించును. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనెడి మూడు తత్త్వములుగా పరతత్త్వము నెరిగినవాడు శ్రీమద్భాగవతము ననుసరించి “తత్త్వవిత్” యని పిలువబడును
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 147 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 28 🌴*

*28. tattva-vit tu mahā-bāho guṇa-karma-vibhāgayoḥ*
*guṇā guṇeṣu vartanta iti matvā na sajjate*

🌷 Translation : 
*One who is in knowledge of the Absolute Truth, O mighty-armed, does not engage himself in the senses and sense gratification, knowing well the differences between work in devotion and work for fruitive results.*

🌷 Purport :
The knower of the Absolute Truth is convinced of his awkward position in material association. He knows that he is part and parcel of the Supreme Personality of Godhead, Kṛṣṇa, and that his position should not be in the material creation. He knows his real identity as part and parcel of the Supreme, who is eternal bliss and knowledge, and he realizes that somehow or other he is entrapped in the material conception of life. In his pure state of existence he is meant to dovetail his activities in devotional service to the Supreme Personality of Godhead, Kṛṣṇa. He therefore engages himself in the activities of Kṛṣṇa consciousness and becomes naturally unattached to the activities of the material senses, which are all circumstantial and temporary. 

He knows that his material condition of life is under the supreme control of the Lord; consequently he is not disturbed by all kinds of material reactions, which he considers to be the mercy of the Lord. According to Śrīmad-Bhāgavatam, one who knows the Absolute Truth in three different features – namely Brahman, Paramātmā and the Supreme Personality of Godhead – is called tattva-vit, for he knows also his own factual position in relationship with the Supreme.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 544 / Vishnu Sahasranama Contemplation - 544 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 544. గహనః, गहनः, Gahanaḥ 🌻*

*ఓం గహనాయ నమః | ॐ गहनाय नमः | OM Gahanāya namaḥ*

*గహనః, गहनः, Gahanaḥ*

*శ్రీ విష్ణుః దుష్ప్రవేశ్యత్వాదవస్థాత్రితయస్య వా ।*
*సాక్షిభావావయోర్వా గహనః పరికీర్త్యతే ॥*

*అభేద్యుడు. ఈతని తత్త్వమును ఎరుగుట అంత సులభము కానివాడు గహనుడు. జాగృత్‍, స్వప్న, సుషుప్తి అను మూడు దశలలో భావాఽభావములకు - అవి అనుభవములోనుండు స్థితులకూ, అనుభవములోనుండని స్థితులకును కూడ సాక్షిగానుండువాడు కావున ప్రత్యగాత్మస్వరూపుడుగా తురీయావస్థ యందున్న ఈతని తత్త్వమును ఎరుగుట అంత సులభము కానివాడు.*

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
వ. మఱియుఁ జిత్తం బహంకార మమకార రూపాభిమాన జాతంబులగు కామలోభాది కలుషవ్రాతంబుల చేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు నప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు నేకరూపంబునై ప్రకృతికంటెఁ బరుండును బరమపురుషుండును నిర్భేదనుండును స్వయంజ్యోతియు సూక్ష్మస్వరూపుండను నితరవస్త్వంత రాపరిచ్ఛిన్నుండును నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబునైన ప్రపంచంబును ఙ్ఞాన వైరాగ్య భక్తి యుక్తంబగు మనంబుచేఁ బొడగాంచి యోగిజనులు పరతత్త్వ సిద్ధి కొఱకు నిఖిలాత్మకుండైన నారాయణునందు సంయుజ్య మానంబయిన భక్తిభావంబు వలన నుదయించిన మార్గంబునకు నితరమార్గంబులు సరిగావండ్రు... (874)

"నేను నాది" అనే అహంకార మమకార రూపమైన అభిమానం వల్ల కామమూ, క్రోధమూ, లోభము మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వానికి లోనుగాకుండా వానినుండి విడివడినప్పుడు పరిశుద్ధమవుతుంది. చిత్తము పరిశుద్ధమైనప్పుడు సుఖమూ, దుఃఖమూ అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు.

ఆ పరమాత్మ ప్రకృతికంటే అతీతుడు; అభేద్యుడు; స్వయంప్రకాశుడు; సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు. ఉదాసీనుడు. అటువంటి పరమాత్మనూ, ఆ పరమాత్మ తేజస్సువల్ల నిస్తేజమైన ప్రపంచాన్నీ యోగివరేణ్యులు భక్తిజ్ఞాన వైరాగ్యయుక్తమైన చిత్తంతో దర్శించినవారై మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమ మైనదనీ, తక్కిన మార్గాలు దానికి సాటిరావనీ చాటిచెప్పారు...

:: శ్రీమద్భాగవతే చతుర్థ స్కన్ధే త్రింశోఽధ్యాయః ::
నమో నమః క్లేశవినాశనాయ నిరూపితోదారగుణాహ్వయాయ ।
మనోవచోవేగపురోజవాయ సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః ॥ 22 ॥

382. గహనః, गहनः, Gahanaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 544🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻544. Gahanaḥ🌻*

*OM Gahanāya namaḥ*

श्री विष्णुः दुष्प्रवेश्यत्वादवस्थात्रितयस्य वा ।
साक्षिभावावयोर्वा गहनः परिकीर्त्यते ॥ 

*Śrī viṣṇuḥ duṣpraveśyatvādavasthātritayasya vā,*
*Sākṣibhāvāvayorvā gahanaḥ parikīrtyate.*

*One who is impenetrable to the unqualified. In other words, the One who cannot easily be comprehended. He is witness to the three states of consciousness being free of them viz., being awake, sleeping and the state of deep sleep.*

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे त्रिंशोऽध्यायः ::
नमो नमः क्लेशविनाशनाय निरूपितोदारगुणाह्वयाय ।
मनोवचोवेगपुरोजवाय सर्वाक्षमार्गैरगताध्वने नमः ॥ २२ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 30
Namo namaḥ kleśavināśanāya nirūpitodāraguṇāhvayāya,
Manovacovegapurojavāya sarvākṣamārgairagatādhvane namaḥ. 22.

Dear Lord, You relieve all kinds of material distress. Your magnanimous transcendental qualities and holy name are all auspicious. This is established. You can go faster than the speed of mind and words. You cannot be perceived by material senses. We therefore offer You respectful obeisances again and again.

382. గహనః, गहनः, Gahanaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 222 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 9. The Recognition of a Supreme Value in Life 🌻*

*This world is not in a position to satisfy the desires of even one person, finally. If the whole world is given to you with all its gold and silver, rice and paddy, wheat and whatever it is, you will not find it satisfying. “The whole world is with me.” All right. Are you perfectly satisfied? You will be unhappy even then, for two reasons.*

*One of them is: “After all, there is something above this world. Why not have that also?” A person who has a village wants another village also. If you have all the villages, you would like the entire state. If the state is under you, you want the entire country. If the country is under you, you would like the whole Earth. But why not have something above the Earth? So there is a dissatisfaction. “What is above? No, this is no good; there is something above me which I cannot control, which I cannot understand.”*

*The presence of something above the world, outside the world, will make you unhappy again. The second point is: “How long will I be in possession of this whole world, sir? Is there any guarantee?” Nobody knows. The next moment you may not be here. “Oh, I see. So, what is the good of possessing the whole world, if tomorrow I am going to be dispossessed of it?” Thus, the recognition of a supreme value in life, and the need to adore it as the objective and the goal of one's endeavour in life, became the Devata, or the Divinity of the Vedas.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -2 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. వ్యక్తి మరింత మరింత నిశ్శబ్దంగా, శాంతిగా, చురుగ్గా, సున్నితంగా మారితే జీవితం ధగధగలాడుతుంది. జీవితం గొప్ప బహుమానం. మనం ఆ అవకాశాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అట్లాంటి జీవితాన్ని అందుకున్నందుకు కృతజ్ఞత ప్రకటించ లేకున్నాం.🍀*

*మన చైతన్యం మీద పేరుకున్న దుమ్ము పొరలాంటిది మనసు. అందువల్ల మనం దేన్నీ చూడలేం. ప్రతిఫలించలే. దుమ్మును మాత్రమే చూస్తాం. ఆలోచనల్ని చూస్తాం. కోరికల్ని చూస్తాం. జ్ఞాపకాల్ని, కలల్ని చూస్తాం. అవి యధార్థాలు కావు. దుమ్ము వదిలించుకున్నపుడే వాస్తవాల్ని దర్శించగలం.*

*వ్యక్తి మరింత మరింత నిశ్శబ్దంగా, శాంతిగా, చురుగ్గా, సున్నితంగా మారితే జీవితం ధగధగలాడుతుంది. సౌందర్యభరిత మవుతుంది. పరవశంతో పరిమళిస్తుంది. జీవితం గొప్ప బహుమానం. మనం ఆ అవకాశాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. మనం అందుకున్న దానిని అభినందించలేకున్నాం. పైగా అందుకు మనం అర్హులం కాం. అట్లాంటి జీవితాన్ని అందుకున్నందుకు కృతజ్ఞత ప్రకటించలేకున్నాం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 61 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 47. వస్తు సంపద - 2 🌻*

*విపరీతమైన వస్తు ఉత్పత్తి యున్నను, వాని పంపిణీ అధ్వాన్నముగ నున్నది. కొన్ని దేశములు వస్తువులతో మ్రగ్గి యున్నవి. మరికొన్ని దేశములు కనీసపు వస్తువులు లేక బాధపడుచున్నవి. అతివృష్టి, అనావృష్టిగ ఆర్థిక వ్యవస్థలు సమస్యలలో చిక్కుకొని యున్నవి. ఇట్టి సమయమున విచక్షణాపూరితమైన విద్యను అందించుటయే ప్రధానము.*

*వస్తుసామగ్రిని అనాలోచితముగ పోగు వేసు కొనుటలో గల అజ్ఞానమును చిన్నతనము నుండి పోగొట్టినచో ముందు తరములు బాగుండును. విద్యాలయములలో తగు విధముగ ఇట్టి విద్యలను ప్రోత్సహించవలెను. మిక్కుటముగ పోగువేసుకొనుట ఆధ్యాత్మిక మార్గమున నేరముగ గుర్తింపబడును. అప్రయత్నముగ సంపద పోగు అయినచో సద్వినియోగము చేయుచు జీవించుము. లేనిచో సంపద నిన్ను మానవత్వము నుండి పశుత్వములోనికి దిగ జార్చగలదు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment