మైత్రేయ మహర్షి బోధనలు - 61
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 61 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 47. వస్తు సంపద - 2 🌻
విపరీతమైన వస్తు ఉత్పత్తి యున్నను, వాని పంపిణీ అధ్వాన్నముగ నున్నది. కొన్ని దేశములు వస్తువులతో మ్రగ్గి యున్నవి. మరికొన్ని దేశములు కనీసపు వస్తువులు లేక బాధపడుచున్నవి. అతివృష్టి, అనావృష్టిగ ఆర్థిక వ్యవస్థలు సమస్యలలో చిక్కుకొని యున్నవి. ఇట్టి సమయమున విచక్షణాపూరితమైన విద్యను అందించుటయే ప్రధానము.
వస్తుసామగ్రిని అనాలోచితముగ పోగు వేసు కొనుటలో గల అజ్ఞానమును చిన్నతనము నుండి పోగొట్టినచో ముందు తరములు బాగుండును. విద్యాలయములలో తగు విధముగ ఇట్టి విద్యలను ప్రోత్సహించవలెను. మిక్కుటముగ పోగువేసుకొనుట ఆధ్యాత్మిక మార్గమున నేరముగ గుర్తింపబడును. అప్రయత్నముగ సంపద పోగు అయినచో సద్వినియోగము చేయుచు జీవించుము. లేనిచో సంపద నిన్ను మానవత్వము నుండి పశుత్వములోనికి దిగ జార్చగలదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
21 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment