నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -2
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -2 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి మరింత మరింత నిశ్శబ్దంగా, శాంతిగా, చురుగ్గా, సున్నితంగా మారితే జీవితం ధగధగలాడుతుంది. జీవితం గొప్ప బహుమానం. మనం ఆ అవకాశాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అట్లాంటి జీవితాన్ని అందుకున్నందుకు కృతజ్ఞత ప్రకటించ లేకున్నాం.🍀
మన చైతన్యం మీద పేరుకున్న దుమ్ము పొరలాంటిది మనసు. అందువల్ల మనం దేన్నీ చూడలేం. ప్రతిఫలించలే. దుమ్మును మాత్రమే చూస్తాం. ఆలోచనల్ని చూస్తాం. కోరికల్ని చూస్తాం. జ్ఞాపకాల్ని, కలల్ని చూస్తాం. అవి యధార్థాలు కావు. దుమ్ము వదిలించుకున్నపుడే వాస్తవాల్ని దర్శించగలం.
వ్యక్తి మరింత మరింత నిశ్శబ్దంగా, శాంతిగా, చురుగ్గా, సున్నితంగా మారితే జీవితం ధగధగలాడుతుంది. సౌందర్యభరిత మవుతుంది. పరవశంతో పరిమళిస్తుంది. జీవితం గొప్ప బహుమానం. మనం ఆ అవకాశాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. మనం అందుకున్న దానిని అభినందించలేకున్నాం. పైగా అందుకు మనం అర్హులం కాం. అట్లాంటి జీవితాన్ని అందుకున్నందుకు కృతజ్ఞత ప్రకటించలేకున్నాం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment