ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 117, 118 / Sri Lalitha Chaitanya Vijnanam - 117, 118 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖
🌻 117. 'భక్త సౌభాగ్యదాయినీ' 🌻
భాగ్య మనగా సంపద, కామము, మహాత్మ్యము, వీర్యము, కీర్తి అని అర్థములు చెప్పబడినవి. శుభము, శోభనము అను సంపద, కామము, మమత్తు, వీర్యము, కీర్తి సౌభాగ్యమగుచున్నది. అట్టి సౌభాగ్యమును భక్తులకిచ్చునది శ్రీలలిత అని అర్థము.
పై తెలిపిన భాగ్యము లన్నియు శుభమగునవి కానిచో, దుఃఖమును, నష్టమును కలిగించును. సంపద ఉండవచ్చును కాని దాని నుండి పొందవలసిన సుఖముండకపోవచ్చును. అట్లే సుఖము నిచ్చు కోరికలు కాక, ఇతరములగు కోరిక లుండవచ్చును. అట్లే, మహాత్మ్యము, వీర్యము, కీర్తి. రావణునికి భాగ్యమున్నది. రాముడికి భాగ్యమున్నది. రాముని భాగ్యము సౌభాగ్యము.
ధర్మపరులకు, భక్తులకు కలుగు భాగ్యము ఆనందము నిచ్చునదై యుండును. ఇతరుల భాగ్యము దుఃఖమునకు కారణమై యుండును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 117 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bhakta-saubhāgya-dāyinī भक्त-सौभाग्य-दायिनी (117) 🌻
She confers prosperity on Her devotees. There is a reference to saubhāgya aṣṭagam (eight things that gives prosperity) in Agni Purāṇa.
They are sugarcane, peepul tree, sprouted jīra seeds, coriander, cow’s milk (and its modifications curd, butter and ghee), everything that are yellow in colour, flowers and salt. All these indicate auspiciousness and prosperity.
The next three nāma-s discuss about bhakti (devotion).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 118 / Sri Lalitha Chaitanya Vijnanam - 118 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ‖ 41 ‖
🌻 118. 'భక్తప్రియా' 🌻
భక్తి ప్రియముగా గలది శ్రీదేవి. భక్తి రెండు విధములు. అవి ముఖ్యభక్తి,
గౌణభక్తి. ముఖ్యభక్తి యనగా భవంతునియందు అనురక్తి, భగవంతుని యందు ఆసక్తి, భగవంతునియందు ప్రేమ.
అనురక్తి, ఆసక్తి, ప్రేమ గల వస్తువును సతతము స్మరించుచు నుందుము. అట్టి స్మరణకు మరియొక కారణముండదు. ఎప్పుడునూ మనస్సు దైవము వైపునకే లాగుచుండును.
ఇతర విషయములపై మనస్సు అంతంత మాత్రమే లగ్నమగును. అన్నిటియందు దైవమే స్ఫురించుచుండును. ఇట్టివారికి భగవంతుడు కానిదేమియు ఉండదు. ప్రహ్లాదుడు, అంబరీషుడు, శుకుడు, నారదుడు అట్టివారు. ఈ మార్గము నవలంబించు భక్తులు కలరు.
వారికి నిత్యజీవితమంతయు భగవత్ పరముగనే యుండును. వీరే శ్రీకృష్ణుడు తెలిపిన అనన్య చింతనలు, నిత్య అభియుక్తులు, పర్యుపాసకులు, యోగులు, భజించుట, పూజించుట, కీర్తించుట, శ్రవణము చేయుట, స్మరణము చేయుట, ధ్యానించుట, సేవ చేయుట, గుర్తుంచు కొనుటకు ప్రయత్నించుట వంటి భక్తి గౌణభక్తి.
అనగా భగవంతుని కొంత సమయము స్మరించుట, ఇతర సమయమునందు తమదైన విషయములందు నిమగ్నమగుట యుండును. ఈ భక్తి సర్వసామాన్యము.
ముఖ్యభక్తి గలవారకి గౌణభక్తి అనుపానమై నిలచును. గౌణభక్తి గలవారు క్రమముగా కొన్ని జన్మలలో ముఖ్యభక్తిని పొంద వచ్చును. అందుదురని రూఢి లేదు. భగవంతుని యందు ప్రేమ జనించినపుడే, ముఖ్యభక్తి అను బీజము అంకురించును.
కాని అవసరములకై భగవంతుని ప్రార్థించువారికి గౌణభక్తియే మిగులును. శ్రీలలిత భక్తియందు ప్రియము కలది కావున ముఖ్యభక్తిని గౌణభక్తిని కూడ అనుగ్రహించును. భక్తి అను విషయమున ఆమె కట్టి ప్రియము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 118 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bhakti-priyā भक्ति-प्रिया (118) 🌻
She is fond of devotion. Śivānanda Laharī (Lahari means rise up as if in waves) (verse 61) describes devotion.
“The way needle seeks magnet, the way creeper seeks tree, the way river unites with ocean and the way the mind seeks the lotus feet of Śiva are called devotion”. Sage Nārada said ‘Devotion is beyond three guṇa -s – rajas, tamas and sattva. It is beyond desire.
It grows every second. It remains connected with the Brahman. It is subtle and realized out of experience. Once realized, he always remains with That.’ Śrī Rāmakṛṣṇa compares devotion to the flood that flows powerfully into the ocean in spite of the dams built to control the floods.
Our mind, he continues, is not flowing but stagnant like a pond. Our mind gets stagnated towards devotion, which has to grow every second.
Viveka cūḍāmaṇi (verse 31) says that “amongst things conducive to liberation, devotion alone holds the supreme place.
The seeking after one’s real nature is designated as devotion. Others maintain that the inquiry into the truth of one’s own Self is devotion”.
The point driven home in this nāma is that nothing prevents a true devotee in realizing Her irrespective of the hurdles.
She is delighted with such devotion and such devotees. Devotees are those who worship Her through mind to seek Her within.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 Nov 2020
No comments:
Post a Comment