శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 48 / Sri Devi Mahatyam - Durga Saptasati - 48


🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 48 / Sri Devi Mahatyam - Durga Saptasati - 48 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 13

🌻. సురథ వైశ్యవరప్రదానము - 2 🌻

చివరి భాగము

12. మూడేళ్ళు ఇలా మనోనిగ్రహంతో ఆరాధించగా ఆ లోక సంరక్షకురాలు, చండిక, సంతుష్టిచెంది ప్రత్యక్షమై వారికిలా చెప్పింది:

13-15. దేవి పలికెను : ఓ రాజా! కుటుంబహర్ష కారకుడవైన ఓ వైశ్యా! మీరు కోరినవన్ని నా వద్ద నుండి తీసుకోండి. సంతుష్టురాలనై మీకు వాటిని ఇస్తున్నాను.

16-17. మార్కండేయుడు పలికెను : అంతట ఆ రాజు మరొక జన్మలో కూడా తొలగిపోని రాజ్యం లభించేటట్లు, ఈ జన్మలో తన శత్రువుల బలాన్ని బలాత్కారంగా నశింపజేసి, తన రాజ్యాన్ని మళ్ళీ పొందేటట్లు కోరుకున్నాడు.

18. విరక్తచిత్తుడు, ప్రాజ్ఞుడు అయిన ఆ వైశ్యుడు, మమతాహంకార రూపమైన (నేను, నాది అను భావాన్ని కల్పించే) సంగాన్ని పారద్రోలే జ్ఞానాన్ని కోరుకున్నాడు.

19–21. దేవి పలికెను. "ఓ రాజా! కొద్ది దినాలలో నీ శత్రువులను వధించి నీవు నీ రాజ్యాన్ని పొందుతావు. అది తొలగిపోకుండా అక్కడే నీకు నిలిచి ఉంటుంది.

22-23. “నీవు మృతిచెందిన తరువాత వేలుపైన వివస్వంతుని (సూర్యుని) వల్ల మరొక జన్మను పొంది, సావర్ణియనే పేరుతో భూమిపై మనువు అవుతావు.

24-25. "ఓ వైశ్యశ్రేష్ఠుడా! నా వల్ల నీవు కోరుకున్న వరాన్ని నీకు ఇస్తున్నాను. సంసిద్ధిని (ఆత్మసాక్షాత్కారం) కలిగించే జ్ఞానం నీకు లభిస్తుంది.

26-27. మార్కండేయుడు పలికెను : ఇలా వారిరువురూ కోరిన వరాలను ఇచ్చి వారామెను భక్తిపూర్వకంగా స్తుతిస్తుండగానే ఆ దేవి వెంటనే అంతర్థానమయ్యింది.

28–29. దేవిచేత ఇలా వరాన్ని పొంది క్షత్రియ శ్రేష్ఠుడైన సురథుడు సూర్యుని వల్ల (సూర్యపత్ని అయిన సవర్ణ వల్ల) జన్మ పొంది సావర్ణి అనే పేరుగల మనువు అవుతాడు. క్లీం ఓమ్.

శ్రీమార్కండేయ పురాణమందలి సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లోని "సురథ వైశ్యవరప్రదానము” అనే త్రయోదశాధ్యాయము సమాప్తం.

శ్రీ సప్తశతీ దేవీ మాహాత్మ్యము సంపూర్ణం.

ఓం తత్ సత్ ఓమ్.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 48 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 13

🌻 The bestowing of boons to Suratha and Vaisya - 2 🌻

LAST PART


12. When they, with controlled minds propitiated her thus for three years, Chandika, the upholder of the world, was well pleased and spoke to them in visible form.

The Devi said:

13-15. What you solicit, O King, and you, the delight of your family, receive all that from me. Well-leased I bestow those to you both.

Markandeya said:

16-17. Then the King chose a kingdom, imperishable even in another life, and in this life itself, his own kingdom wherein the power of his enemies is destroyed by force.

18. Then the wise merchant also, whose mind was full of dispassion for the world, chose the knowledge which removes the attachment (in the form of) ‘mine’ and ‘I’.

The Devi said:

19-21. O King, after slaying your foes in a few days, you shall obtain your own kingdom and it shall last with you there.

22-23. ‘And, when you are dead, you shall gain another birth from the Deva Vivasvat (Sun), and shall be a Manu on earth by name Savarni.

24-25. ‘and, O the best of merchants, I grant you the boon which you have desired of me. (Supreme) knowledge shall be yours, for your self-realization’. Markandeya said:

26-27. Having thus granted them both the boon that watch desired, the Devi disappeared forthwith, as they were extolling her with devotion.

28-29. Having thus gained the boon from the Devi, Suratha, the foremost of Kshatriyas, shall obtain a new birth through Surya (and of his wife Savarna), and shall be the Manu (eighth) named Savarni, shall be the Manu named Savarni.

Here ends the thirteenth chapter called ‘The bestowing of boons to Suratha and Vaisya’ of Devi-mahatmya in Markandeyapurana, during the period of Savarni, the Manu.

Here ends the Devi-Mahatmya of 700 Mantras.

🌹 🌹 🌹 🌹 🌹


29 Nov 2020

No comments:

Post a Comment