విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 136, 137 / Vishnu Sahasranama Contemplation - 136, 137


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 136, 137 / Vishnu Sahasranama Contemplation - 136, 137 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻136. కృతాఽకృతః, कृताऽकृतः, Kr̥tā’kr̥taḥ🌻

ఓం కృతాఽకృతాయ నమః | ॐ कृताऽकृताय नमः | OM Kr̥tā’kr̥tāya namaḥ

కార్య కారణ రూపోఽసౌ కృతాకృత ఇతీర్యతే కృతము అనగా చేయబడినది అయిన కార్యము, అకృతము అనగా చేయబడనిదియగు కారణము. కార్యకారణ స్వరూపుడగుటచే విష్ణువు కృతాకృతః. కృతశ్చ అకృతశ్చ చేయబడిన వాడును, చేయబడని వాడునూ. మాయాశక్తి ద్వారమున జగద్రూపమున తాను నిర్మించబడినందున కార్య రూపుడు అగును కావున 'కృతః'. చేయబడనివాడు అనగా జగములకు కారణ రూపుడు కావున 'అకృతః' చేయబడనివాడు.

:: పోతన భాగవతము - ఆష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::

సీ. శాంతున కపవర్గసౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషు

నకు, ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యున కధిక విజ్ఞాన మయున

కఖిలేంద్రియ ద్రష్ట కధ్యక్షునకు బహు క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి

మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి

అ. నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు, నుండు నెక్కటికి మహోత్తరునకు

నిఖీల కారణునకు, నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొఱకు.

భగవంతుడు శాంతస్వరూపుడు. మోక్షానికి అధిపతి. ఆనందానికి ఆలవాలం. స్వపరభేదం లేనివాడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్ధులకు అందనివాడు. గుణాల ధర్మము కలవాడు. సరళ స్వభావమూ విశేషమైన జ్ఞానము కలిగినవాడు. అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు. అన్నిటికీ ప్రభువు. సర్వజ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. అన్నింటికీ మూలపురుషుడు.

ఆత్మకు ఆధారమైనవాడు. ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడలో నిండుగా వెలిగేవాడూ, ఒంటరివాడు. మిక్కిలి గొప్పవాడు. అన్నిటికీ బీజమైన (కారణమైన) వాడు. ఏ కారణమూ లేనివాడు. అటువంటి స్వామికి నన్ను కాపాడుమంటూ నమస్కరిస్తున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 136🌹

📚. Prasad Bharadwaj


🌻136. Kr̥tā’kr̥taḥ🌻

OM Kr̥tā’kr̥tāya namaḥ

Kārya kāraṇa rūpo’sau kr̥tākr̥ta itīryate Kārya is the effect which is the result of an action. Kāraṇa is the invisible cause that led to an action.

As He is both the cause and effect, Lord Viṣṇu is Kr̥tākr̥taḥ. Kr̥taśca akr̥taśca the One who is the action and also the One who is not the action. He is the creation Himself hence He is Kr̥tāḥ and since He is also the cause of the creation, He is Akr̥taḥ.


Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3

Yasminnidaṃ yataśrcedaṃ yenedaṃ ya idaṃ svayam,
Yo’smātparasmācca parastaṃ prapadhye svayambhuvam. (3)


:: श्रीमद्भागवते अष्टम स्कन्धे तृतियोऽध्यायः ::

यस्मिन्निदं यतश्र्चेदं येनेदं य इदं स्वयम् ।
योऽस्मात्परस्माच्च परस्तं प्रपध्ये स्वयम्भुवम् ॥ ३ ॥

He is the supreme platform on which everything rests, the ingredient by which everything has been produced, and the person who has created and is the only cause of this cosmic manifestation. Nonetheless, He is different from the cause and the result. I surrender unto Him, the Supreme God, who is self-sufficient in everything.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः ।
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥

లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥

Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ ।
Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 137 / Vishnu Sahasranama Contemplation - 137🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻137. చతురాత్మా, चतुरात्मा, Caturātmā🌻

ఓం చతురాత్మనే నమః | ॐ चतुरात्मने नमः | OM Caturātmane namaḥ

యస్య సర్గాదిషు పృథక్ చతస్రో హి విభూతయః ।
ఆత్మనో మూర్తయో యస్య చతురాత్మాస ఉచ్యతే ॥

సృష్టీ, స్థితీ మరియూ లయలు చేయు సమయములందు, శ్రీ మహా విష్ణువునకు నాలుగేసి ఆత్మలు లేదా విభూతులు లేక మూర్తులు కలిగియుండుట వలన, ఆయన చతురాత్మగా చెప్పబడును.


:: విష్ణు పురాణము - ప్రథమాంశము, ద్వావింశోఽధ్యాయము ::

బ్రహ్మా దక్షాదయః కలస్తథైవాఖిలజన్తవః ।
విభూతయో హరేరేతా జగతః సృష్టిహేతవః ॥ 31॥

విష్ణుర్మన్వాదయః కాలః సర్వభూతాని చ ద్విజ।
స్థితేర్నిమిత్తభూతస్య విష్ణోరేతా విభూతయః ॥ 32॥

రుద్రః కాలాన్తకాద్యాశ్చ సమస్తాశ్చైవ జన్తవః।
చతుర్ధా ప్రలయాయైతా జనార్దనవిభూతయః ॥ 33 ॥

బ్రహ్మా, దక్షుడు మొదలగు ప్రజాపతులూ, కాలమూ అటులే అఖిల ప్రాణులూ - ఇవి జగత్ సృష్టికి హేతువులగు విష్ణుని నాలుగు విభూతులుగా నుండును. ఓ విప్రా! జగముల స్థితికి నిమిత్తకారణుడుగా నుండు విష్ణుని విభూతులు లేదా మూర్తిభేదములు - విష్ణువూ, మనువులు మొదలగు వారూ, కాలమూ మరియూ సర్వభూతములు. లోకముల ప్రళయమును కలిగించు శ్రీ మహా విష్ణువునకు ఆ సమయమున ఉండు నాలుగు విభూతులు - రుద్రుడూ, అంతకుడు మొదలగు వారూ, కాలమూ మరియూ సమస్తములగు ప్రాణులు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 137🌹

📚 Prasad Bharadwaj


🌻137. Caturātmā🌻

OM Caturātmane namaḥ

Yasya sargādiṣu pr̥thak catasro hi vibhūtayaḥ,
Ātmano mūrtayo yasya caturātmāsa ucyate.

यस्य सर्गादिषु पृथक् चतस्रो हि विभूतयः ।
आत्मनो मूर्तयो यस्य चतुरात्मास उच्यते ॥

One who for the sake of creation, sustenance and dissolution assumes forms; in each of which there are four groups is Caturātmā.

Viṣṇu Purāṇa - Part 1, Section 22

Brahmā dakṣādayaḥ kalastathaivākhilajantavaḥ,
Vibhūtayo hareretā jagataḥ sr̥ṣṭihetavaḥ. (31)

Viṣṇurmanvādayaḥ kālaḥ sarvabhūtāni ca dvija,
Sthiternimittabhūtasya viṣṇoretā vibhūtayaḥ. (32)

Rudraḥ kālāntakādyāśca samastāścaiva jantavaḥ,
Caturdhā pralayāyaitā janārdanavibhūtayaḥ. (33)


:: विष्णु पुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::

ब्रह्मा दक्षादयः कलस्तथैवाखिलजन्तवः ।
विभूतयो हरेरेता जगतः सृष्टिहेतवः ॥ ३१ ॥

विष्णुर्मन्वादयः कालः सर्वभूतानि च द्विज ।
स्थितेर्निमित्तभूतस्य विष्णोरेता विभूतयः ॥ ३२ ॥

रुद्रः कालान्तकाद्याश्च समस्ताश्चैव जन्तवः ।
चतुर्धा प्रलयायैता जनार्दनविभूतयः ॥ ३३ ॥

Brahmā, Prajāpatis like Dakṣa, Kāla or time and Jīvas - these are the powers of Viṣṇu for the purpose of creation. Viṣṇu, the Manus, Kāla or time and the living beings - these are the powers of Viṣṇu for the purpose of sustenance. Rudra, Kāla or time, Antakā or death and living beings - these are Viṣṇu's powers for the purpose of dissolution.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः ।
चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥

లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥

Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ ।
Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹



29 Nov 2020

No comments:

Post a Comment