2) 🌹 శ్రీమద్భగవద్గీత - 619 / Bhagavad-Gita - 619 - 18-30🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 424 425 / Vishnu Sahasranama Contemplation - 424, 425🌹
4) 🌹 Daily Wisdom - 126🌹
5) 🌹. వివేక చూడామణి - 89🌹
6) 🌹Viveka Chudamani - 89🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 89🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 32🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 280 / Sri Lalita Chaitanya Vijnanam - 280 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 51 / Bhagavad-Gita - 51 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 4 🌴*
4. అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభి: ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను: ఓ శత్రుసంహారా! ఓ మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణుల వంటివారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను?
🌷. భాష్యము :
పితామహుడైన భీష్ముడు, ఆచార్యుడైన ద్రోణాచార్యుల వంటి గౌరవనీయులగు పెద్ద సదా పూజింప దగినవారు. అటువంటి వారు దాడి చేసినను వారి యెడ ఎదురు దాడి చేయరాదు. పెద్దలతో వాగ్యుద్ధమునకైనను దిగకుండుట సాధారణ కట్టుబాటు.
కొన్నిమార్లు వారు కటువుగా వర్తించినను వారి యెడ కటువుగా వర్తించరాదు. అట్టి యెడ వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యము కాగలదు? కృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనా తాతయైన ఉగ్రసేనుని గాని, గురువైన సాందీపమునిని గాని ఎదుర్కొనెనా? ఈ విధమైన కొన్ని వాదములను అర్జునుడు శ్రీకృష్ణునకు తెలియ జేయుచున్నాడు.
🌹🌹🌹🌹🌹
*🌹 Bhagavad-Gita as It is - 51 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
*🌴 Chapter 2 - Sankhya Yoga - 4 🌴*
4. arjuna uvāca kathaṁ bhīṣmam ahaṁ saṅkhye droṇaṁ ca madhusūdana iṣubhiḥ pratiyotsyāmi pūjārhāv ari-sūdana
🌷 Translation :
Arjuna said: O killer of enemies, O killer of Madhu, how can I counterattack with arrows in battle men like Bhīṣma and Droṇa, who are worthy of my worship?
🌷 Purport :
Respectable superiors like Bhīṣma the grandfather and Droṇācārya the teacher are always worshipable. Even if they attack, they should not be counterattacked. It is general etiquette that superiors are not to be offered even a verbal fight. Even if they are sometimes harsh in behavior, they should not be harshly treated.
Then, how is it possible for Arjuna to counterattack them? Would Kṛṣṇa ever attack His own grandfather, Ugrasena, or His teacher, Sāndīpani Muni? These were some of the arguments offered by Arjuna to Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 619 / Bhagavad-Gita - 619 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 30 🌴*
30. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధి: సా పార్థ సాత్త్వికీ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! ఏ బుద్ధి ద్వారా మనుజుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలెనో దేనికి భయము నొందరాదో, ఏది బంధకరమో ఏది ముక్తిదాయకమో తెలిసికొనగలుగునో అట్టి బుద్ధి సత్త్వగుణప్రధానమైనది.
🌷. భాష్యము :
శాస్త్రనిర్దేశముల దృష్ట్యా కార్యముల నొనరించుట “ప్రవృత్తి” యనబడును. అదియే చేయదగిన కర్మముల నొనరించుట యగును. నిర్దేశములు కానటువంటి కర్మల నెన్నడును ఒనరింపరాదు. శాస్త్రనిర్దేశములను ఎరుగనివాడు కర్మల యందు మరియు కర్మఫలముల యందు బంధితుడగుచున్నాడు. అట్టి విచక్షణా జ్ఞానమును కలిగించు బుద్ధియే సత్త్వగుణప్రధానమైనదని చెప్పబడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 619 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 30 🌴*
30. pravṛttiṁ ca nivṛttiṁ ca kāryākārye bhayābhaye
bandhaṁ mokṣaṁ ca yā vetti buddhiḥ sā pārtha sāttvikī
🌷 Translation :
O son of Pṛthā, that understanding by which one knows what ought to be done and what ought not to be done, what is to be feared and what is not to be feared, what is binding and what is liberating, is in the mode of goodness.
🌹 Purport :
Performing actions in terms of the directions of the scriptures is called pravṛtti, or executing actions that deserve to be performed. And actions which are not so directed are not to be performed.
One who does not know the scriptural directions becomes entangled in the actions and reactions of work. Understanding which discriminates by intelligence is situated in the mode of goodness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 424, 425 / Vishnu Sahasranama Contemplation - 424, 425 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻424. విశ్రామః, विश्रामः, Viśrāmaḥ🌻*
*ఓం విశ్రామాయ నమః | ॐ विश्रामाय नमः | OM Viśrāmāya namaḥ*
సంసార సాగరే హి క్షుత్పిపాసాదిషడూర్మిభిః ।
తరంగితైరవిద్యాద్వైర్మహాక్లేశైర్మదాదిభిః ॥
ఉపక్లేశైశ్చ సువశీకృతానాం మృత్యుధర్మిణామ్ ।
విశ్రాంతిం కాంక్షమాణానాం సతతం పరితప్యతాం ।
కరోతి మోక్షం విశ్రామమితి విశ్రామ ఉచ్యతే ॥
క్షుత్, పిపాస, శోకము, మోహము, జరా మరియు మరణములనే ఆరు ఊర్ములచేతను (షడూర్ములు) తరంగములు కలదిగా అయియున్న సంసారసాగరమునందు అవిద్య, అస్మితా (చేతన, జడ తత్త్వముల పరస్పర తాదాత్మ్యభావన), రాగము, ద్వేషము, అభివేశము (పూర్వ జన్మ సంస్కారాదికముచే దేని విషయమున నయినను గాఢమగు ఆసక్తి) అనే మహాక్లేశముల చేతను, మదము మొదలగు ఉపక్లేశములచేతను వశీకరించుకొనబడిన వారును - విశ్రాంతిని కాంక్షించు వారును అగు వారికి మోక్షరూపమగు విశ్రామమును కలిగించునుగనుక ఈతండు విశ్రామః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 424🌹*
📚. Prasad Bharadwaj
*🌻424. Viśrāmaḥ🌻*
*OM Viśrāmāya namaḥ*
Saṃsāra sāgare hi kṣutpipāsādiṣaḍūrmibhiḥ,
Taraṃgitairavidyādvairmahākleśairmadādibhiḥ.
Upakleśaiśca suvaśīkr̥tānāṃ mr̥tyudharmiṇām,
Viśrāṃtiṃ kāṃkṣamāṇānāṃ satataṃ paritapyatāṃ,
Karoti mokṣaṃ viśrāmamiti viśrāma ucyate.
संसार सागरे हि क्षुत्पिपासादिषडूर्मिभिः ।
तरंगितैरविद्याद्वैर्महाक्लेशैर्मदादिभिः ॥
उपक्लेशैश्च सुवशीकृतानां मृत्युधर्मिणाम् ।
विश्रांतिं कांक्षमाणानां सततं परितप्यतां ।
करोति मोक्षं विश्राममिति विश्राम उच्यते ॥
For those who are entangled in the ocean saṃsāra (worldly existence) containing the six waves of hunger, thirst etc., caught up by the great griefs of avidyā etc., and the small griefs like pride etc., longing for rest, He bestows viśrāma or liberation. So Viśrāmaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 425 / Vishnu Sahasranama Contemplation - 425🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 425. విశ్వదక్షిణః, विश्वदक्षिणः, Viśvadakṣiṇaḥ 🌻*
*ఓం విశ్వదక్షిణాయ నమః | ॐ विश्वदक्षिणाय नमः | OM Viśvadakṣiṇāya namaḥ*
విశ్వస్మాత్ దక్షిణశ్శక్తో యద్వా విశ్వేషు కర్మసు ।
దాక్షిణ్యాద్విశ్వదక్షిణ ఇతి సంకీర్త్యతే హరిః ॥
ప్రతియొకదానికంటెను దక్షిణుడు లేదా శక్తి కలవాడు. సకల కర్మలను ఆచరించుటయందును నేర్పరి. దక్షః, దక్షిణః అను పదాలు రెండును శక్తి కలవాడు, నేర్పరి అను అర్థములందు ప్రసిద్ధములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 425🌹*
📚. Prasad Bharadwaj
*🌻 425. Viśvadakṣiṇaḥ 🌻*
*OM Viśvadakṣiṇāya namaḥ*
Viśvasmāt dakṣiṇaśśakto yadvā viśveṣu karmasu,
Dākṣiṇyādviśvadakṣiṇa iti saṃkīrtyate hariḥ.
विश्वस्मात् दक्षिणश्शक्तो यद्वा विश्वेषु कर्मसु ।
दाक्षिण्याद्विश्वदक्षिण इति संकीर्त्यते हरिः ॥
More powerful or capable than all. Or skilful in all actions. So He is Viśvadakṣiṇaḥ. The two words Dakṣaḥ and Dakṣiṇaḥ imply capability and ability respectively.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 126 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 5. The Aim of Philosophy is Direct Experience 🌻*
Philosophy is a general exposition of the ultimate concepts, meanings and values of the things of the universe, by a resort to their final causes which range beyond the reach of the senses. It becomes possible for philosophy to concern itself with metaphysical essences by resting on the strong foundation of the testimony given by sages to deep meditation and realisation.
Hence, the source as well as the aim of philosophy is direct experience, non-mediate, super-sensory and super-logical. All knowledge that we ordinarily obtain in this world is mediate, for it requires the operation of the triune process of the knower, knowledge and the known. By this method of knowing, it is not possible for us to acquire an unshakable knowledge of reality, for mediacy in knowledge does not enjoy the characteristics of permanency.
The transitory nature of mediate knowledge affects the whole world of science, for this latter is sense-bound. We need not point out here that science lays too must trust in the validity of sense perception and thus gets vitiated by the gross limitations to which the senses are obviously subject.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 89 / Viveka Chudamani - 89🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 21. అహంభావము - 5 🍀*
305. అందువలన అహంకారము యొక్క పూర్తి గుర్తింపును వెంటనే వదలివేసి, అది కేవలము మాలిన్యము యొక్క స్వభావమని, తన యొక్క తెలివితేటలని, ఆత్మ యొక్క ప్రతిబింబమని గ్రహించి, దాని నుండి మనస్సును మరలించి ఆత్మ వైపుకు త్రిప్పవలెను. నీవు ఆ అహంకారము వలననే సంసార సాగరమనే ఈ ప్రపంచములో చిక్కుకున్నట్లు తెలుసుకొని, అది కేవలము పుట్టుక, క్షీణత, చావులని గ్రహించి అసలైన బ్రహ్మానంద స్థితి యొక్క ఆనందమును దర్శించవలెను.
306. అయితే నీ యొక్క గుర్తింపు అహంకారమైనచో, ఎప్పటికి నీవు శాశ్వతమైన పరమాత్మ యొక్క ఔన్నత్యమును, ఎల్లప్రదేశములందు విస్తరించి ఉన్న పరిపూర్ణ ఆనంద స్థితిని, మరుగులేని ఉన్నత స్థితిని పొందలేవు.
307. అందువలన నీ యొక్క అహంకారమును నాశనం చేసి; అది నీ శత్రువు ఎందువలనంటే అది మనిషి యొక్క గొంతులో గుచ్చుకొన్న ముల్లువలె, నీవు ఆహారమును స్వీకరించలేని స్థితిని కలిగించునది కాన; నీవు దానిని నీ పదునైన వివేచన అనే ఖడ్గముతో నీ శత్రువును వదించినట్లు నాశనము చేసి నీ యొక్క అసలు స్థితిని తెలుసుకొని నేరుగా బ్రహ్మానందమనే ఆత్మ సామ్రాజ్యమును పొందుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 89 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 21. Ego Feeling - 5 🌻*
305. Give up immediately thy identification with egoism, the agent, which is by its nature a modification, is endued with a reflection of the Self, and diverts one from being established in the Self – identifying thyself with which thou hast come by this relative existence, full of the miseries of birth, decay and death, though thou art the Witness, the Essence of Knowledge and Bliss Absolute.
306. But for thy identification with that egoism there can never be any transmigration for thee who art immutable and eternally the same, the Knowledge Absolute, omnipresent, the Bliss Absolute, and of untarnished glory.
307. Therefore destroying this egoism, thy enemy - which appears like a thorn sticking in the throat of a man taking meal – with the great sword of realisation, enjoy directly and freely the bliss of thy own empire, the majesty of the Atman.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 100 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 78. మధుర మార్గము -4 🌻*
నూతనత్వము మాధుర్య మార్గమునకు పునాదియని తెలిపితిమి. నూతనత్వము ఆనందము కలిగించును. ఆనందము తుష్టిని, పుష్టిని కలిగించును. శ్రీకృష్ణుడు నిత్యనూతనుడు. అతడెప్పు డెట్లుండునో ఎవరునూ ఊహించలేరు. ఎట్లు ప్రవర్తించునో అసలే తెలియదు. అతనియందంతయు నూతనత్వమే. అతను నిత్యనూతను డగుటచే అతనిని గూర్చిన భావన నిత్యానందకరము. బాలురు, స్త్రీలు, వృద్ధులు, వీరులు, వైరులు, మిత్రులు, భార్యలు, బంధువులు ఎవ్వరునూ అతని చేష్టలను ముందుగ నూహింపలేకపోయిరి.
అతని నుండి కార్యములు జరుగుచున్నప్పుడు చూచి ఆశ్చర్యపడుట, ఆనందపడుట, దైనందిన చర్యగ మారినవి. అతడిట్లు తన పరివారము నంతను ఉత్సాహమున నుంచెను. చిల్లర విషయములందు వారికి గల ఆసక్తిని తన సాన్నిధ్యములోనికి మరల్చెను. అతని వేణుగానముతో భూమిని, పశుపక్ష్యాదులను ప్రచోదనము గావించెను.
ఆ వేణుగాన తరంగములే నెమరు వేసుకొనుచు భూమి, దానిని ఆవరించియున్న పంచభూతములు, గురుపరంపర ఇనుమడించిన ఉత్సాహముతో కర్తవ్యములను నిర్వర్తించుచున్నవి. ఈ మధుర సాన్నిధ్య మార్గముల కన్న మించిన మార్గమేదియు లేదని మధురాధిపతి తన చివరి సందేశముగ జీవుల కందించెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 32 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. మీ జీవితాలకు సంబంధించి సమస్త బాధ్యతని అస్తిత్వం తీసుకోనీయండి 🍀*
జనం బాధల్లో వున్నారు. ఎందుకంటే వాళ్ళు అస్తిత్వాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్షణం నించీ అస్తిత్వాన్ని అడ్డుకోకండి. విశ్రాంతిగా వుండండి. ప్రతిదీ దానంతట అది జరగనీ అన్న రీతిలో వుండండి.
మీ జీవితాలకు సంబంధించి సమస్త బాధ్యతని అస్తిత్వం తీసుకోనీ. అపుడు జీవితంలో అపూర్వమయిన వైవిధ్యముంటుంది అపుడు పరవశమన్నది శ్వాసలాగా సహజంగా వుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 280 / Sri Lalitha Chaitanya Vijnanam - 280 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।*
*పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀*
*🌻 280. 'పద్మనాభ సహోదరీ'🌻*
పద్మనాభుని తోబుట్టువు శ్రీమాత అని అర్థము. పద్మనాభుడనగా నాభి నుండి పద్మము నుత్పత్తి చేసినవాడు. సృష్టికర్తకు మూలము. ఈ మూలతత్త్వమును శ్రీమహా విష్ణువు అని, నారాయణు
డని తెలుపుదురు. అతనితోపాటు ఎప్పుడునూ నున్నది. శ్రీమాత. వారిరువురునూ పరులే.
పరమ పదమున ఇరు తత్త్వములు మేళవించి యుండును. సృష్టి ఉద్భవ సమయమున వీరే మొట్టమొదటగ ప్రకృతి, పురుషులగుదురు. వీరినే నారాయణ, నారాయణి అందురు. విష్ణువు - వైష్ణవి అందురు. ధర్మము - ధర్మి అని కూడ అందురు.
ఈ ప్రకృతి పురుషులు ఒకే తత్త్వము నుండి ఏకకాలమున ఉద్భవింతురు. కనుక తోబుట్టువులు. పరతత్త్వమును పరమ శివుడని, నారాయణుడని, పరబ్రహ్మమని, పరదేవత యని సంబోధింతురు. అందుండి దిగివచ్చిన పురుషుడు విష్ణువు, స్త్రీ వైష్ణవి. ఈ వైష్ణవీదేవి పరమశివుని పత్నీ భావము పొందెను.
శ్రీమాత విష్ణువునకు తోబుట్టువు. ఆమె అంశావతారమే సుభద్ర. శివుని అంశగ ఉద్భవించిన అర్జును డామెను పెండ్లాడుట యందు గల రహస్యమిదియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 280 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀*
*🌻 Padmanābha-sahodarī पद्मनाभ-सहोदरी (280) 🌻*
She is the younger sister of Lord Viṣṇu. Brahma and Lakṣmī, Viṣṇu and Umā, Śiva and Sarasvatī are twins. They represent creation, sustenance and destruction. Sarasvatī got married to Brahma, Lakṣmī to Viṣṇu and Umā to Śiva. This is a beautiful description of interdependence of creation in mythology.
The Brahman is divided into two aspects. One is the form of righteousness (dharma) and another is the possessor of righteousness. The dharma portion of the Brahman is divided into two, male and female. Viṣṇu, the male form of dharma portion of the Brahman is sustainer of this universe. Śaktī, the female portion of the righteousness became the wife of Śiva. She is called Umā. Śiva, His wife Umā and Viṣṇu combine is referred as the Brahman in this nāma.
The three nāmas 278, 279 and 280 subtly convey the first kūṭa (vāgbhava kūṭa) of Pañcadaśī mantra (क ए ई ल ह्रीं). That is why these nāma-s do not convey any serious meaning as seen in other nāma-s. In fact, these nāma-s convey the secretive mantra form.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment