వివేక చూడామణి - 89 / Viveka Chudamani - 89


🌹. వివేక చూడామణి - 89 / Viveka Chudamani - 89🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 21. అహంభావము - 5 🍀


305. అందువలన అహంకారము యొక్క పూర్తి గుర్తింపును వెంటనే వదలివేసి, అది కేవలము మాలిన్యము యొక్క స్వభావమని, తన యొక్క తెలివితేటలని, ఆత్మ యొక్క ప్రతిబింబమని గ్రహించి, దాని నుండి మనస్సును మరలించి ఆత్మ వైపుకు త్రిప్పవలెను. నీవు ఆ అహంకారము వలననే సంసార సాగరమనే ఈ ప్రపంచములో చిక్కుకున్నట్లు తెలుసుకొని, అది కేవలము పుట్టుక, క్షీణత, చావులని గ్రహించి అసలైన బ్రహ్మానంద స్థితి యొక్క ఆనందమును దర్శించవలెను.

306. అయితే నీ యొక్క గుర్తింపు అహంకారమైనచో, ఎప్పటికి నీవు శాశ్వతమైన పరమాత్మ యొక్క ఔన్నత్యమును, ఎల్లప్రదేశములందు విస్తరించి ఉన్న పరిపూర్ణ ఆనంద స్థితిని, మరుగులేని ఉన్నత స్థితిని పొందలేవు.

307. అందువలన నీ యొక్క అహంకారమును నాశనం చేసి; అది నీ శత్రువు ఎందువలనంటే అది మనిషి యొక్క గొంతులో గుచ్చుకొన్న ముల్లువలె, నీవు ఆహారమును స్వీకరించలేని స్థితిని కలిగించునది కాన; నీవు దానిని నీ పదునైన వివేచన అనే ఖడ్గముతో నీ శత్రువును వదించినట్లు నాశనము చేసి నీ యొక్క అసలు స్థితిని తెలుసుకొని నేరుగా బ్రహ్మానందమనే ఆత్మ సామ్రాజ్యమును పొందుము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 89 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 21. Ego Feeling - 5 🌻

305. Give up immediately thy identification with egoism, the agent, which is by its nature a modification, is endued with a reflection of the Self, and diverts one from being established in the Self – identifying thyself with which thou hast come by this relative existence, full of the miseries of birth, decay and death, though thou art the Witness, the Essence of Knowledge and Bliss Absolute.

306. But for thy identification with that egoism there can never be any transmigration for thee who art immutable and eternally the same, the Knowledge Absolute, omnipresent, the Bliss Absolute, and of untarnished glory.

307. Therefore destroying this egoism, thy enemy - which appears like a thorn sticking in the throat of a man taking meal – with the great sword of realisation, enjoy directly and freely the bliss of thy own empire, the majesty of the Atman.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


18 Jun 2021

No comments:

Post a Comment