శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 280 / Sri Lalitha Chaitanya Vijnanam - 280


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 280 / Sri Lalitha Chaitanya Vijnanam - 280 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀

🌻 280. 'పద్మనాభ సహోదరీ'🌻


పద్మనాభుని తోబుట్టువు శ్రీమాత అని అర్థము. పద్మనాభుడనగా నాభి నుండి పద్మము నుత్పత్తి చేసినవాడు. సృష్టికర్తకు మూలము. ఈ మూలతత్త్వమును శ్రీమహా విష్ణువు అని, నారాయణు
డని తెలుపుదురు. అతనితోపాటు ఎప్పుడునూ నున్నది. శ్రీమాత. వారిరువురునూ పరులే.

పరమ పదమున ఇరు తత్త్వములు మేళవించి యుండును. సృష్టి ఉద్భవ సమయమున వీరే మొట్టమొదటగ ప్రకృతి, పురుషులగుదురు. వీరినే నారాయణ, నారాయణి అందురు. విష్ణువు - వైష్ణవి అందురు. ధర్మము - ధర్మి అని కూడ అందురు.

ఈ ప్రకృతి పురుషులు ఒకే తత్త్వము నుండి ఏకకాలమున ఉద్భవింతురు. కనుక తోబుట్టువులు. పరతత్త్వమును పరమ శివుడని, నారాయణుడని, పరబ్రహ్మమని, పరదేవత యని సంబోధింతురు. అందుండి దిగివచ్చిన పురుషుడు విష్ణువు, స్త్రీ వైష్ణవి. ఈ వైష్ణవీదేవి పరమశివుని పత్నీ భావము పొందెను.

శ్రీమాత విష్ణువునకు తోబుట్టువు. ఆమె అంశావతారమే సుభద్ర. శివుని అంశగ ఉద్భవించిన అర్జును డామెను పెండ్లాడుట యందు గల రహస్యమిదియే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 280 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀

🌻 Padmanābha-sahodarī पद्मनाभ-सहोदरी (280) 🌻


She is the younger sister of Lord Viṣṇu. Brahma and Lakṣmī, Viṣṇu and Umā, Śiva and Sarasvatī are twins. They represent creation, sustenance and destruction. Sarasvatī got married to Brahma, Lakṣmī to Viṣṇu and Umā to Śiva. This is a beautiful description of interdependence of creation in mythology.

The Brahman is divided into two aspects. One is the form of righteousness (dharma) and another is the possessor of righteousness. The dharma portion of the Brahman is divided into two, male and female. Viṣṇu, the male form of dharma portion of the Brahman is sustainer of this universe. Śaktī, the female portion of the righteousness became the wife of Śiva. She is called Umā. Śiva, His wife Umā and Viṣṇu combine is referred as the Brahman in this nāma.

The three nāmas 278, 279 and 280 subtly convey the first kūṭa (vāgbhava kūṭa) of Pañcadaśī mantra (क ए ई ल ह्रीं). That is why these nāma-s do not convey any serious meaning as seen in other nāma-s. In fact, these nāma-s convey the secretive mantra form.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Jun 2021

No comments:

Post a Comment