శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 274 / Sri Lalitha Chaitanya Vijnanam - 274


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 274 / Sri Lalitha Chaitanya Vijnanam - 274 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀

🌻 274. 'పంచకృత్య పరాయణా' 🌻


పంచకృత్యములు సదా నిర్వర్తించుటయందు నిమగ్నమై యుండునది శ్రీదేవి అని అర్థము.

పంచకృత్య పరాయణా అను అష్టాక్షరీ నామము నందు పరాయణత్వము ప్రధానమైన భావము. పరాయణ మనగా అభీష్టము. హెచ్చు తగ్గులు లేని ఒకే రకమగు యిష్టము.

పారాయణము అను పదమునకు కూడ అర్థమిదియే. ఒకే రకమగు యిష్టముతో శాశ్వతముగ పనులు చేయుట పరాయణత్వ మగును. ఇష్టమున్నప్పుడే యిది జరుగగలదు. ఇష్టములు అయిష్టము లాధారముగ మానవుల పనుల యందు శ్రద్ధ, అశ్రద్ధ గోచరించును.

ఇష్టమున్న చోట శ్రద్ధ యుండును. ఇష్టము నందు బలవంత ముండదు. తప్పక చేయుట అను భావ ముండదు. “చేయవలెను కదా! కర్తవ్యము కదా!” అను బరువగు భావము లుండవు. ఇష్టము కనుక చేయుట యుండును. ఇష్టము గనుక కష్ట మనిపించదు. ఈ యిష్ట మేర్పడుటకు కారణముండదు. పిల్లవాడు ఆడుకొనుట, పెద్దలు మాట్లాడుకొనుట చేయుదురు. ఎందుకని ప్రశ్నించిన సమాధాన ముండదు.

తీపి యిష్టమైన వానిని నీకు తీపి ఎందులకు యిష్టమని ప్రశ్నించినచో సమాధాన ముండదు. కావున యిష్ట మకారణ మగుచున్నది. నిష్కారణ మగుచున్నది. దీనినే పరమ ప్రేమ అందురు. కారణముండి యిష్టపడినపుడు అది పరమ ప్రేమ కాదు. “ఇందు వలన నాకిష్టము”, “అందువలన నాకిష్టము” అను సమాధాన మున్నచోట కారణమున్నది. సామాన్యముగ జీవులందరూ కార్యకారణ సంబంధముగనే యిష్టపడుచుందురు. ఇది లౌకికము.

దీనియందిమిడియున్న వారు అన్నిటికినీ కారణములు వెతుకుచుందురు. సతమతమగు చుందురు. మహాత్ముల కార్యములు ఎక్కువగ నిష్కారణములై యుండును. అవి లౌకికుల కంతు పట్టవు. శ్రీమాత యిష్టమును గూర్చి, తర్కించుట వ్యర్థము. ఆమె మహాత్ములకు, త్రిమూర్తులకు కూడ గమ్యము. ఆమె నిరంతరము పంచకృత్యముల యందు యిష్టపడి యుండును.

సృష్టించుట, వృద్ధిచేయుట, రక్షించుట, అనుగ్రహించుట, సృష్టిని తనలోనికి తిరోధాన మొనర్చుట అను ఐదు విధములగు కార్యములను నిర్వర్తించుట యందు పరాయణయై యుండునని ముందు నామములలో తెలుపబడినది. ఈ కృత్యములు నిర్వర్తించుట యందు ఆమె తత్పరయై యుండును. పరమానందము పొందు చుండును. గంపెడు పసిపిల్లలుగల తల్లి పిల్లలందరిని అహర్నిశలు ప్రేమతో పెంచుచుండును. ఆమెకు చాకిరి అనిపించదు. చూచు వారికి మాత్రము చాల చాకిరి చేయుచున్నట్లు భావన కలుగును.

మహాత్ములు కూడ యిట్లే అహర్నిశలు జీవుల శ్రేయస్సు కొఱకు తమ జీవితమును సమర్పింతురు. చూచు వారి కది ప్రారబ్ధమువలె గోచరించును. ఇష్టపడి చేయుటకు, తప్పక చేయుటకు తేడా యున్నది. మహాత్ములు నిష్కారణులై జీవుల శ్రేయస్సు కొఱకు అహర్నిశలు పాటు పడుచుందురు. వారికి పరాకాష్ఠ శ్రీదేవి. ఆమె అభీష్టమును కూర్చి తర్కింపలేము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 274 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀


🌻 Pañcakṛtya-parāyaṇā पञ्चकृत्य-परायणा (274) 🌻


She is the abode of all the five functions discussed above. Nāma 250 Pañca-brahma-svarūpinī already said that She is in the cause of all these five acts. All these five acts are carried out by Her as prākaśa (cit) vimarśa (śaktī) mahā māyā svarūpinī. She is also known as Cit Śaktī. Cit means the consciousness that is absolute and unchanging.

Pratyabhijñāhṛdayam, a Kashmiri saivaism text on Self-realisation says that Śaktī brings about the universe by Her own free will and not by extraneous powers. The universe is already contained in Her implicitly and She makes it explicit.

Even in a soul, He (meaning Śiva) does the five kṛtya-s. He does the five-fold act of manifesting, relishing, thinking out, settling of the seed and dissolution. One fails to recognise His own powers (five kṛtya-s), because of ignorance. (kṛtya कृत्य means to be performed; whereas kṛtyā कृत्या means wickedness)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jun 2021

No comments:

Post a Comment