🌹. వివేక చూడామణి - 83 / Viveka Chudamani - 83🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 20. శరీర బంధనాలు - 9 🍀
288. ఈ జీవాత్మను శాశ్వతమైన పరమాత్మలో లీనము చేసి, ఏలానంటే (కుండలోని ఖాళీ ప్రదేశము విశ్వములోని శాశ్వత ప్రదేశముతో కూడినది అగుటచే) ఓ యోగివర్య నీవు నీ ఆత్మను ధ్యానము ద్వారా పరమాత్మలో లీనము చేయుము.
289. నీవు ఆ పరిపూర్ణ బ్రహ్మముగా అయి ఈ బాహ్యపదార్థ సంచయంతో కూడిన ప్రపంచము నిజమనే భావనను వదలివేసి మరియు స్థూల, సూక్ష్మ ప్రపంచాలకు అతీతముగా బ్రహ్మములో జీవించుము. అపుడే ఈ స్థూల ప్రపంచము యొక్క అశాశ్వతత్వము మనకు అవగతమవుతుంది.
290. ఈ శరీరముతో స్థిరముగా ఉన్న గుర్తింపును మార్పు చేయుట ద్వారా అసలైన, సత్యమైన పరమాత్మ ద్వారా పొందే ఆనందమును తెలుసుకొని, ఈ సూక్ష్మమైన అణువులతో కూడి ఉన్న ఈ శరీరముతో ఉన్న సంబంధమును తొలగించుకొని నీవు ఒంటరిగా స్వేచ్ఛగా ఉండగలిగే ఆత్మ జ్ఞానమును పొందుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 83 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 20. Bondages of Body - 9 🌻
288. Merging the finite soul in the Supreme Self, like the space enclosed by a jar in the infinite space, by means of meditation on their identity, always keep quiet, O sage.
289. Becoming thyself the self-effulgent Brahman, the substratum of all phenomena – as that Reality give up both the macrocosm and the microcosm, like two filthy receptacles.
290. Transferring the identification now rooted in the body to the Atman, the Existence- Knowledge-Bliss Absolute, and discarding the subtle body, be thou ever alone, independent.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
04 Jun 2021
No comments:
Post a Comment