దేవాపి మహర్షి బోధనలు - 94


🌹. దేవాపి మహర్షి బోధనలు - 94 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 75. సుగంధ పరిమళములు 🌻

విత్తనములు, ఎండు ద్రాక్ష, ఖర్జూరము మొదలగు పండ్లు, పూవుల సువాసనల ద్వారా చికిత్స చేయుట అతిప్రాచీనము. గులాబి వాసన వాతావరణమున గల అపాయకరమగు భూతములను పారద్రోలును. గులాబి తోట చిత్తమునకు స్ఫూర్తి నిచ్చును. నరములకు శాంతి గూర్చును. ఊపిరితిత్తుల వ్యాధి కలవారికి బార్లీ నీరు మిక్కిలి ఉపయోగము.

దేవదారు దివ్యతత్త్వములను ప్రసారము చేయును. సుగంధము, ఇతర పరిమళ ద్రవ్యముల వాడుకను మానవజాతి శృంగార క్రియలకే పరిమితి యొనర్చినది కాని, నిజమునకు వాని వినియోగము ఆధ్యాత్మిక సాధన కుపయోగము. గంధము చెక్క ఈ విషయముననెంతయో ఉపయోగకరము.

పూర్వకాలము సత్పురుషులు గంధమును పూసుకొనుట, గంధము చెక్కను తమ వద్ద నుంచుకొనుట చేయుచుండెడివారు. ఆధునిక కాలమున తయారగుచున్న perfumes, scents కలిగించును కాని, జీవుని చిత్తమునకు శాంతి కలిగింప లేవు. అనేకానేక పతన కారణములలో వికృత పరిమళ సుగంధములు ఒకటిగ గుర్తింపుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jun 2021

No comments:

Post a Comment