నిర్మల ధ్యానాలు - ఓషో - 26


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 26 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానమంటే ఆలోచన లేని స్థితి, స్వచ్చమయిన వునికి. 🍀


పాశ్చాత్యుల ధ్యానమన్నది ఒక రకమయిన ఆలోచన మినహా మరొకటి కాదు. ఉన్నత విషయాల గురించి ఆలోచించడం ధ్యానం. నువ్వు దేవుని గురించి, ప్రేమ గురించి ఆలోచిస్తే దాన్ని ధ్యానమంటారు. తూర్పుదేశాల్లో ఆలోచన అన్నది అసలు ధ్యానం కిందకే రాదు. నువ్వు దేవుడి గురించి లేదా డబ్బు గురించి ఆలోచించినా అది ధ్యానం కిందికి రాదు. ఏ విషయాన్ని గురించి ఆలోచించినా అది ధ్యానానికి ఆటంకంగానే పరిగణింపబడుతుంది.

తూర్పు దేశాల్లో ధ్యానమంటే ఆలోచన లేని స్థితి, స్వచ్చమయిన వునికి. అది జీవితంలో గొప్ప అనుభవం. నువ్వు కేవలం వున్నావు. నీ వునికిలో ఎట్లాంటి ఆలోచనా లేదు. రద్దీ అంతా ఆగిపోయింది. మనసు మాయమైంది. కాని చైతన్యం. అక్కడ వుంది. ఎప్పటికన్నా మరింత కాంతివంతంగా వుంది. ఆలోచనల వెనక దాగున్నదంతా అప్పుడు అదృశ్యమయిపోతుంది.

ఆలోచనలనతో కలిసి వున్నదేదీ అప్పుడక్కడ వుండదు. సమస్త శక్తి బహర్గతమయింది. అక్కడ ఎంత నిశ్శబ్దం వుందంటే అల కదలిన కలకలం కూడా లేదు. ఆ నిశ్శబ్ద చైతన్య సరస్సులో శక్తి సరస్సులో అస్తిత్వం ప్రతిఫలిస్తుంది. ఏది ఏమిటో మనకు తెలిసి వస్తుంది. దేవుడు అన్నది మరో పేరు మాత్రమే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jun 2021

No comments:

Post a Comment