2) 🌹. శ్రీమద్భగవద్గీత - 106 / Bhagavad-Gita - 106 2-59🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 503 / Vishnu Sahasranama Contemplation - 503🌹
4) 🌹 DAILY WISDOM - 181🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 20🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 86🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 316 / Sri Lalitha Chaitanya Vijnanam - 316🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*31, అక్టోబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ సూర్య స్తుతిః-2 🍀*
*భ్రమత్యావిద్ధమఖిలం బ్రహ్మాండం సచరాచరమ్ |*
*త్వదంశుభిరిదం స్పృష్టం సర్వం సంజాయతే శుచి || 3 ||*
*క్రియతే త్వత్కరైః స్పర్శాజ్జలాదీనాం పవిత్రతా |*
*హోమదానాదికో ధర్మో నోపకారాయ జాయతే || 4 ||*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ దశమి 14:28:40 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: మఘ 13:17:10 వరకు తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: బ్రహ్మ 23:21:55 వరకు తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 14:21:39 వరకు
వర్జ్యం: 01:05:00 - 02:42:36 మరియు
21:09:00 - 22:43:24
దుర్ముహూర్తం: 16:12:53 - 16:58:57
రాహు కాలం: 16:18:38 - 17:45:00
గుళిక కాలం: 14:52:16 - 16:18:38
యమ గండం: 11:59:32 - 13:25:54
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 10:50:36 - 12:28:12
పండుగలు : లేదు
సూర్యోదయం: 06:14:04, సూర్యాస్తమయం: 17:45:01
వైదిక సూర్యోదయం: 06:17:42
వైదిక సూర్యాస్తమయం: 17:41:20
చంద్రోదయం: 01:38:45, చంద్రాస్తమయం: 14:40:35
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: సింహం
ఆనందాదియోగం: ముద్గర యోగం - కలహం 13:17:10
వరకు తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 106 / Bhagavad-Gita - 106 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 59 🌴*
59. విషయా వినివర్తన్తే
నిరాహారస్య దేహిన: |
రసవర్జం రసోప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే ||
🌷. తాత్పర్యం :
*దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే యుండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింప జేసి అతడు చైతన్యము నందు స్థిరుడు కాగలుడు.*
🌷. భాష్యము :
దివ్యమైన ఆధ్యాత్మికస్థితిలో నిలువనిదే ఇంద్రియభోగముల నుండి మరలుట ఎవ్వరికిని సాధ్యము కాదు. విధినియమముల ద్వారా ఇంద్రియభోగానుభవముపై ఆంక్షలు విధించుట యనునది రోగిని కొన్ని విధములైన ఆహారపదార్థమూలా నుండి నియమించుట వంటిది. అట్టి నియమములు రోగికెన్నడును రుచింపవు.
అంతియేగాక ఆహారపదార్థములపై కోరికయు అతనికి పోదు. ఆ విధముగనే అల్పజ్ఞులైన మనుజుల కొరకు యమము, నియమము, ఆసనము, ప్రాణాయాము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణాడి పలు పక్రియలు కలిగిన అష్టాంగయోగ విధానము ఇంద్రియములు అదుపు కొరకై నిర్దేశింపబడినవి.
కాని కృష్ణభక్తిలో పురోభివృద్ధి నొందుచు శ్రీకృష్ణభగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు మృతప్రాయములైన లౌకికవిషయముల యెడ రుచిని కోల్పోయియుండును. అనగా నియమములనునవి తోలోదశలో నున్న భక్తుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకే ఏర్పాటు చేయబడినవి. కృష్ణభక్తిభావన యందు నిజమగు రసాస్వాదానము కలుగునంతవరకే అవి ప్రయోజనము కలిగియుండును. మనుజుడు కృష్ణభక్తిరసభావితుడైనంతనే శుష్కవిషయములందు అప్రయత్నముగా రుచిని కోల్పోవును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 106 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 2 - Sankhya Yoga - 59 🌴*
59. viṣayā vinivartante nirāhārasya dehinaḥ
rasa-varjaṁ raso ’py asya paraṁ dṛṣṭvā nivartate
🌷Translation :
*Though the embodied soul may be restricted from sense enjoyment, the taste for sense objects remains. But, ceasing such engagements by experiencing a higher taste, he is fixed in consciousness.*
🌷 Purport :
Unless one is transcendentally situated, it is not possible to cease from sense enjoyment. The process of restriction from sense enjoyment by rules and regulations is something like restricting a diseased person from certain types of eatables. The patient, however, neither likes such restrictions nor loses his taste for eatables. Similarly, sense restriction by some spiritual process like aṣṭāṅga-yoga, in the matter of yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna, etc., is recommended for less intelligent persons who have no better knowledge.
But one who has tasted the beauty of the Supreme Lord Kṛṣṇa, in the course of his advancement in Kṛṣṇa consciousness, no longer has a taste for dead, material things. Therefore, restrictions are there for the less intelligent neophytes in the spiritual advancement of life, but such restrictions are only good until one actually has a taste for Kṛṣṇa consciousness. When one is actually Kṛṣṇa conscious, he automatically loses his taste for pale things.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 503 / Vishnu Sahasranama Contemplation - 503 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻503. సోమపః, सोमपः, Somapaḥ🌻*
*ఓం సోమపాయ నమః | ॐ सोमपाय नमः | OM Somapāya namaḥ*
దర్శయన్ ధర్మమర్యాదాం యజమానో జనార్దనః ।
యష్టవ్య దేవతా రూపీవాఽపి సోమప ఉచ్యతే ॥
*శ్రీ విష్ణువు సర్వ యజ్ఞములందును యజించబడదగిన దేవతారూపముననుండుచు సోమ రసమును పానము చేయుచుండును. లేదా ధర్మ మర్యాదను చూపుటకై యజ్ఞమును ఆచరించుచు యజమాన రూపమునైన శ్రీవిష్ణువే సోమపానము చేయుచున్నాడు. కావున అతడు సోమమును త్రావును - కనుక 'సోమపః' అనదగును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 503🌹*
📚. Prasad Bharadwaj
*🌻 503. Somapaḥ 🌻*
*OM Somapāya namaḥ*
दर्शयन् धर्ममर्यादां यजमानो जनार्दनः ।
यष्टव्य देवता रूपीवाऽपि सोमप उच्यते ॥
Darśayan dharmamaryādāṃ yajamāno janārdanaḥ,
Yaṣṭavya devatā rūpīvā’pi somapa ucyate.
*One who drinks the Soma rasa in all Yajñas in the form of presiding deity. Or One who takes the Soma as the yajamāna or the master of sacrifice for the sake of Dharma.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥
సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥
Somapo’mrtassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 181 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 29. What is Earth Made Of ? 🌻*
The ancient Indian scientists felt that everything was made up of five things: the earth element, the water element, the fire element, the air element and the ether (space) element. The ether element was an especially enigmatic thing for these scientists. Everything is made up of these five elements: earth, water, fire, air and ether. All the wonder of creation is included in the wonder of these five elements. The vast astronomical universe is made up of these five elements alone.
But what these five elements are—that is another question. One needs to go deeper and deeper: what is earth made of? ‘Earth' is only a name that we give to something which appears hard to the touch, but the mere name does not satisfy us. We may use the word ‘earth', but what is earth? What is water? What is fire? What are these five elements? Why not go deeper and discover what these five elements are made of? In Sanskrit, these elements are called the mahabhutas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 20 🌹*
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 12. సత్యము - భ్రమ 🌻*
“మానవ జీవితము అతలాకుతలమైనప్పుడు మానవులు గర్వించి తమ పునాదులు సైతము పెకలించుకొను మూర్ఖత్వమును అతిశయముతో పొందినపుడు, జాతిలో మేలుకొలుపు కలిగించుటకు మైత్రేయ వాణి వినిపించునని” అత్యంత ప్రాచీన గ్రంథములు ఉదోషించుచున్నవి. మానవ చైతన్యమును క్రమబద్ధము చేయుటయే మైత్రేయవాణి ముఖ్య ఆశయము. సత్యమును తమ స్వార్థము కొఱకు మహాత్ములు అనుకొనువారు ఎన్నియో వక్రమార్గములు పట్టించి అడ్డుగోలుగ సిద్ధాంతములేర్పరచి విశ్వమానవ సోదరత్వము అను పవిత్ర భావమును దుర్వినియోగపరచుచూ, జాతిని దుస్థితిపాలు చేసినారు.
ఈ రోజులలో అందరూ విశ్వమానవ సౌభ్రాతృత్వమును గూర్చి మాట్లాడెదరు. కాని చేతలలో వారిలోగల కుసంస్కారములు, జాతి, మత, కుల భేదములను వికృతముగా వ్యక్తపరచు చుందురు. దీనికి కారణము సత్యమునందు తాముండుట కన్న తమ యందు భాసించినదే సత్యమని భ్రమపడుట. ఈ భ్రమ తొలగిననే పరిష్కారము లభించును. ఈ భ్రమ తొలగింపునకే మైత్రేయవాణి కృషి.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 87 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. తెలియని దానికి గురువు ఎట్లాంటి గ్యారంటీ కాడు. అజ్ఞాతానికి ఆయన సాక్షి మాత్రమే. ఆయన సత్యం పట్ల నీ కెలాంటి హామీని ఇవ్వలేడు. ఆయన అది వుంది. నాకది తెలుసు. నేను దానికి సాక్షని అంటాడు. అతని కళ్ళలోకి చూస్తే నీకు నమ్మకం, నీ పట్ల ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. 🍀*
తెలియని దాని పట్ల భయమన్నది మనల్ని బాధలకు అతుక్కుని వుండేలా చేస్తుంది. బాధ నిన్ను పట్టుకోదు. నువ్వు బాధని పట్టుకుంటావు. మనుషులు అన్నిటికన్నా బాధలకు ప్రత్యేక విలువ ఇస్తారు. దాన్ని అన్నిటికన్నా గొప్ప చేస్తారు. అనంత విశ్వం కన్నా అత్యున్నతం చేస్తారు. శూన్యంగా వుండటానికి, ఎవరూ కాకుండా వుండడానికి గొప్ప సాహసం కావాలి. తెగింపు కావాలి. అసలు తీరమన్నది వున్నదో లేదో తెలియకుండా ముందుకు పోవడానికి సాహసం కావాలి. ధైర్యం కావాలి, నిర్భయం కావాలి అక్కడ అడుగు ముందుకు వెయ్యటానికి ఎట్లాంటి గ్యారంటీ లేదు.
అందుకనీ గురువు అవసరం. తెలియని దానికి గురువు ఎట్లాంటి గ్యారంటీ కాడు. అజ్ఞాతానికి ఆయన సాక్షి మాత్రమే. ఆయన సత్యం పట్ల నీ కెలాంటి హామీని ఇవ్వలేడు. ఆయన అది వుంది. నాకది తెలుసు. నేను దానికి సాక్షని అంటాడు. అతని కళ్ళలోకి చూస్తే నీకు నమ్మకం కనిపిస్తుంది. ప్రేమ తొణికిసలాడుతుంది. తెలియనిదేదో అతని నించీ నీలోకి ప్రవేశిస్తుంది. రహస్యమయిన పరివర్తన జరుగుతుంది. ఆ రహస్య పరివర్తనే శిష్యామోదం, సన్యాసత్వం అది జీవితం లోని గొప్ప మార్మిక అనుభవం, దాంతో ఎట్లాంటి ప్రేమనుభవాన్ని పోల్చడానికి వీలుపడదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 316 / Sri Lalitha Chaitanya Vijnanam - 316 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*
*🌻 316. 'రతిప్రియా' 🌻*
చూచువానికి చూపు కలిగించునది శ్రీమాతయే. దివ్యదృష్టి కూడ శ్రీమాత శక్తియే. చూచువాడు తా నున్నాను అని భావించుటకు ప్రాతిపదికయే శ్రీమాత యైనపుడు ప్రకృతి రహితమగు దానినేట్లు చూడగలడు? చూచువానియందు ప్రకృతి పురుషు లున్నారు. చూడగోరిన తత్త్వమునందు కూడ వారిరువురును ఏకమై యున్నారు. అంతయూ ప్రకృతియే అని భావించువారు ఎంత అజ్ఞానులో, ప్రకృతి కతీతమగు తత్త్వమును చేరెదనను వాడు కూడ అంత అజ్ఞానియే. సంకల్పమే ప్రకృతి యైనపుడు తత్త్వము చేరెద నను సంకల్పము ప్రకృతి కాదా!
అట్లనుకొనుట అందలి రహస్య మేమనగ పదార్థమయమగు ప్రకృతి నుండి పరమార్థ మయమగు మూల ప్రకృతిని చేరెద ననుటయే బహిరావరణముల నుండి ప్రకృతి యొక్క దివ్యము, అమృతము అగు అంతరావరణలోనికి ప్రవేశించి మూలప్రకృతియై పరమేశ్వరుని అంటి యుండవచ్చును.
ఇట్లు తిరోధానమున ఆత్మ మూలమును చేరుటకు రతి ప్రధానము. భక్తి ప్రాథమికమగు రతియే. దైవమునం దనురక్తిగ భక్తి మారినపుడు దివ్యరతి కలుగును. అపుడు అహర్నిశలు కలసి యుండుటకే ప్రయత్నము జరుగును. నిజమునకు కలసియే యున్నాడు. కావున కలిసియే వున్నాడని తెలియును. రాధాకృష్ణ తత్త్వమిదియే. అర్ధనారీశ్వర రూప మిదియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 316 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*
*🌻 316. Ratipriyā रतिप्रिया (316) 🌻*
She is fond of Rati, the wife of Kāma. There is a yakṣiṇī (lower form of demigoddess) called Ratipriyā who gives wealth. She is said to be Kubera’s wife. Kubera is the chief of yakṣa-s. Ratipriyā’s mantra is short and one should chant this mantra in the night sitting on the top of a banyan tree. It is said that the She will appear in person and gives wealth. Her mantra is ‘om raṁ śrīṁ hrīṁ dhaṁ dhanate ratipriye svāhā’ (ॐ रं श्रीं ह्रीं धं धनते रतिप्रिये स्वाहा॥). This is to be chanted 100,000 times followed by puraścaraṇa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment