మైత్రేయ మహర్షి బోధనలు - 20
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 20 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 12. సత్యము - భ్రమ 🌻
“మానవ జీవితము అతలాకుతలమైనప్పుడు మానవులు గర్వించి తమ పునాదులు సైతము పెకలించుకొను మూర్ఖత్వమును అతిశయముతో పొందినపుడు, జాతిలో మేలుకొలుపు కలిగించుటకు మైత్రేయ వాణి వినిపించునని” అత్యంత ప్రాచీన గ్రంథములు ఉదోషించుచున్నవి. మానవ చైతన్యమును క్రమబద్ధము చేయుటయే మైత్రేయవాణి ముఖ్య ఆశయము. సత్యమును తమ స్వార్థము కొఱకు మహాత్ములు అనుకొనువారు ఎన్నియో వక్రమార్గములు పట్టించి అడ్డుగోలుగ సిద్ధాంతములేర్పరచి విశ్వమానవ సోదరత్వము అను పవిత్ర భావమును దుర్వినియోగపరచుచూ, జాతిని దుస్థితిపాలు చేసినారు.
ఈ రోజులలో అందరూ విశ్వమానవ సౌభ్రాతృత్వమును గూర్చి మాట్లాడెదరు. కాని చేతలలో వారిలోగల కుసంస్కారములు, జాతి, మత, కుల భేదములను వికృతముగా వ్యక్తపరచు చుందురు. దీనికి కారణము సత్యమునందు తాముండుట కన్న తమ యందు భాసించినదే సత్యమని భ్రమపడుట. ఈ భ్రమ తొలగిననే పరిష్కారము లభించును. ఈ భ్రమ తొలగింపునకే మైత్రేయవాణి కృషి.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
31 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment