నిర్మల ధ్యానాలు - ఓషో - 87


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 87 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. తెలియని దానికి గురువు ఎట్లాంటి గ్యారంటీ కాడు. అజ్ఞాతానికి ఆయన సాక్షి మాత్రమే. ఆయన సత్యం పట్ల నీ కెలాంటి హామీని ఇవ్వలేడు. ఆయన అది వుంది. నాకది తెలుసు. నేను దానికి సాక్షని అంటాడు. అతని కళ్ళలోకి చూస్తే నీకు నమ్మకం, నీ పట్ల ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. 🍀


తెలియని దాని పట్ల భయమన్నది మనల్ని బాధలకు అతుక్కుని వుండేలా చేస్తుంది. బాధ నిన్ను పట్టుకోదు. నువ్వు బాధని పట్టుకుంటావు. మనుషులు అన్నిటికన్నా బాధలకు ప్రత్యేక విలువ ఇస్తారు. దాన్ని అన్నిటికన్నా గొప్ప చేస్తారు. అనంత విశ్వం కన్నా అత్యున్నతం చేస్తారు. శూన్యంగా వుండటానికి, ఎవరూ కాకుండా వుండడానికి గొప్ప సాహసం కావాలి. తెగింపు కావాలి. అసలు తీరమన్నది వున్నదో లేదో తెలియకుండా ముందుకు పోవడానికి సాహసం కావాలి. ధైర్యం కావాలి, నిర్భయం కావాలి అక్కడ అడుగు ముందుకు వెయ్యటానికి ఎట్లాంటి గ్యారంటీ లేదు.

అందుకనీ గురువు అవసరం. తెలియని దానికి గురువు ఎట్లాంటి గ్యారంటీ కాడు. అజ్ఞాతానికి ఆయన సాక్షి మాత్రమే. ఆయన సత్యం పట్ల నీ కెలాంటి హామీని ఇవ్వలేడు. ఆయన అది వుంది. నాకది తెలుసు. నేను దానికి సాక్షని అంటాడు. అతని కళ్ళలోకి చూస్తే నీకు నమ్మకం కనిపిస్తుంది. ప్రేమ తొణికిసలాడుతుంది. తెలియనిదేదో అతని నించీ నీలోకి ప్రవేశిస్తుంది. రహస్యమయిన పరివర్తన జరుగుతుంది. ఆ రహస్య పరివర్తనే శిష్యామోదం, సన్యాసత్వం అది జీవితం లోని గొప్ప మార్మిక అనుభవం, దాంతో ఎట్లాంటి ప్రేమనుభవాన్ని పోల్చడానికి వీలుపడదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


31 Oct 2021

No comments:

Post a Comment