శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 316 / Sri Lalitha Chaitanya Vijnanam - 316
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 316 / Sri Lalitha Chaitanya Vijnanam - 316 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀
🌻 316. 'రతిప్రియా' 🌻
చూచువానికి చూపు కలిగించునది శ్రీమాతయే. దివ్యదృష్టి కూడ శ్రీమాత శక్తియే. చూచువాడు తా నున్నాను అని భావించుటకు ప్రాతిపదికయే శ్రీమాత యైనపుడు ప్రకృతి రహితమగు దానినేట్లు చూడగలడు? చూచువానియందు ప్రకృతి పురుషు లున్నారు. చూడగోరిన తత్త్వమునందు కూడ వారిరువురును ఏకమై యున్నారు. అంతయూ ప్రకృతియే అని భావించువారు ఎంత అజ్ఞానులో, ప్రకృతి కతీతమగు తత్త్వమును చేరెదనను వాడు కూడ అంత అజ్ఞానియే. సంకల్పమే ప్రకృతి యైనపుడు తత్త్వము చేరెద నను సంకల్పము ప్రకృతి కాదా!
అట్లనుకొనుట అందలి రహస్య మేమనగ పదార్థమయమగు ప్రకృతి నుండి పరమార్థ మయమగు మూల ప్రకృతిని చేరెద ననుటయే బహిరావరణముల నుండి ప్రకృతి యొక్క దివ్యము, అమృతము అగు అంతరావరణలోనికి ప్రవేశించి మూలప్రకృతియై పరమేశ్వరుని అంటి యుండవచ్చును.
ఇట్లు తిరోధానమున ఆత్మ మూలమును చేరుటకు రతి ప్రధానము. భక్తి ప్రాథమికమగు రతియే. దైవమునం దనురక్తిగ భక్తి మారినపుడు దివ్యరతి కలుగును. అపుడు అహర్నిశలు కలసి యుండుటకే ప్రయత్నము జరుగును. నిజమునకు కలసియే యున్నాడు. కావున కలిసియే వున్నాడని తెలియును. రాధాకృష్ణ తత్త్వమిదియే. అర్ధనారీశ్వర రూప మిదియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 316 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻
🌻 316. Ratipriyā रतिप्रिया (316) 🌻
She is fond of Rati, the wife of Kāma. There is a yakṣiṇī (lower form of demigoddess) called Ratipriyā who gives wealth. She is said to be Kubera’s wife. Kubera is the chief of yakṣa-s. Ratipriyā’s mantra is short and one should chant this mantra in the night sitting on the top of a banyan tree. It is said that the She will appear in person and gives wealth. Her mantra is ‘om raṁ śrīṁ hrīṁ dhaṁ dhanate ratipriye svāhā’ (ॐ रं श्रीं ह्रीं धं धनते रतिप्रिये स्वाहा॥). This is to be chanted 100,000 times followed by puraścaraṇa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
31 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment