✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 9 🌻
మనకి ఉద్వేగం కలిగేటటువంటి అంశాలు ఏమేమిటీ అంటే ధనం, గృహం, ఆరామం, క్షేత్రం, సంపదలు, అనిత్యమైనటువంటి ద్వంద్వానుభూతులు. ఏ ఏ అంశములందు మీకు ఆవేశం కలుగుతూ వుందో చక్కగా గమనించు. ఆవేశం ఎందువల్ల కలిగింది, నీకు సంగత్వ దోషం వుండబట్టి కలిగింది లేకపోతే కలుగదు.
సంగత్వ దోషం ఎందువల్ల వుంది? ఆసక్తి వుంది కాబట్టి. ఆసక్తి ఎందువల్ల వుందీ అంటే దాని వల్ల నీకు సుఖమో, దుఃఖాన్ని దూరం చేసుకోవడమో, కొత్త సుఖాన్ని పొందుతాననే భ్రాంతి వుంది కాబట్టి. ఆ భ్రాంతి ఎందుకుంది? నీకు సుఖాపేక్షయందు ఆసక్తి వుంది కాబట్టి. ఎల్లప్పుడూ సుఖంగా వుండాలనే బలీయమైన జీవ భ్రాంతి వుంది కాబట్టి.
ఆ జీవ భ్రాంతి ఎందుకుందీ? శరీరమే నేననేటటువంటి బలమైన పునాది అభిమానము శరీరమునందు ‘దేహాభిమానమే నేను’ అనేటటువంటి బలమైన అభిమానం నీలో వుంది కాబట్టి ఆ యా అంశములను స్పృశించినప్పుడల్లా నీకు ఆవేశం కలుగుతుంది. తప్పదు. ఆ ఆవేశం కలిగిన ప్రతిఒక్కరూ కూడా ఈ ఆత్మానుభూతిని పొందజాలరు.
కారణమేమిటి అంటే నీ అంతఃకరణము - మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటియందు ఆసక్తమై సంగత్వ దోషాన్ని నిరంతరాయంగా పొందుతూ వుంటుంది. మీ ప్రతిఒక్కరి స్వభావంలో గ్రహించండి -- మీరు ఇక్కడ చెప్పినటువంటి అంశాలలో ఏదో ఒక అంశం మీద మీరు తప్పక స్పందిస్తారు. స్పందించకుండా వుండలేరు. సమస్యలేదు అందులో. ఆవేశాన్ని పొందుతారు తప్పక. ఆ ఆవేశాన్ని పొందితే ఆ రకమైనటువంటి సంగత్వ దోషం, మాలిన్యం మీలో ఏర్పడక తప్పదు.
వీటియందు ఎవరైతే అసంగముగా, నిరాసక్తముగా వైరాగ్యముతో విషయ ప్రభావం లేకుండా నిశ్చలముగా, గంభీరముతోటి నిమిత్తమాత్రంగా, సాక్షిగా, ఎవరైతే వుంటారో వారు మాత్రమే ఆత్మజ్ఞానమును పొందుటకు అధికారులు.
ఇంకేమి చెప్తున్నారు? “కామ్య కర్మలవలన కలుగు ఫలము ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును” . మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్యక కర్మలు. అంటే అర్ధమేమిటీ? ఏదో ఒక కోరిక చేత ప్రేరేపించబడునవి. ఫలము చేత ప్రేరేపించబడునవి అని కర్మలు ద్వివిధంబులు.
కర్మ మనము చేసేటప్పుడు ప్రారబ్ధ కర్మ అయినప్పటికీ కూడా ఆ ప్రారబ్ధ కర్మ భాగంలో రెండుంటాయి. కోరిక ఫలము. ఈ రెండింటి చేత ప్రేరితమవుతూ చేయబడినటువంటి సమస్తమూ కూడా కామ్యక కర్మే.
భారతదేశంలో సనాతన ధర్మంలో బోధించ బోధించినది అంతా కూడా మానవులు కర్తవ్య కర్మను ఆచరించ వలనే గానీ అభిమాన పూరితమైనటువంటి విశేష కర్మని ఆచరించరాదు.
విశేషమైన ధనం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి గృహం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి రూప లావణ్యవతి అయిన భార్య ప్రాప్తిస్తుంది లేక భర్త ప్రాప్తిస్తాడు. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం జరుగుతుంది.
విశేషమైనటువంటి శారీరిక బలం లభిస్తుంది. విశేషమైనటువంటి విద్యాబలం లభిస్తుంది. విశేషమైన పాండిత్యం లభిస్తుంది. విశేషమైన శాస్త్ర జ్ఞానం లభిస్తుంది. విశేషమైనటువంటి బుద్ధిబలం లభిస్తుంది.విశేషమైనటువంటి స్వర్గ సుఖం లభిస్తుంది.
విశేషమైనటువంటి... ఈ రకంగా ఎన్ని విశేషాలు చెప్పుకుంటూ పోతే అన్ని విశేషములు మన జీవితమంతా పరుచుకునివుంటాయి. విశేషమైన సుఖం అనమాట దాంట్లో. అదొస్తే చాలండి.
నేను లంకంత ఇల్లు కట్టుకుంటే సుఖంగా వుంటాను. తరువాత లంకేశ్వరుడు ఏమయ్యాడు? ప్రతివాడూ ఏమనుకుంటూ వుంటాడంటే లంకంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడు. తక్కువేమీ కట్టుకోవాలి అనుకోడు. వాడి ఆలోచనంతా ఎప్పుడూ అంతే.
కాని లంకేశ్వరుడు ఏమైపోయాడనే అంశాన్ని మాత్రం ఆలోచించడు. ఎందుకనిటా? అప్పుడు ఆ రకమైనటువంటి అభిమానానికి లోనయ్యావుగా. అట్లగే ప్రతివాడూ ఏమనుకుంటాడూ?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
04.Sep.2020
No comments:
Post a Comment