🌹 . శ్రీ శివ మహా పురాణము - 215 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
47. అధ్యాయము - 2
🌻. కామప్రాదుర్భావము - 4 🌻
బ్రహ్మోవాచ |
ఏవం తస్య వచశ్ర్శుత్వా పురుషస్య మహాత్మనః | క్షణం న కించిత్ర్పావోచత్స స్రష్టా చాతి విస్మితః || 35
అతో మనస్సు సంయమ్య సమ్య గుత్సృజ్యయ విస్మయమ్ | అవోచత్పురుషం బ్రహ్మా తత్కామం చ సమావహన్ || 36
అనేన త్వం స్వరూపేణ పుష్ప బాణౖశ్చ పంచభిః | మోహయన్ పురుషాన్ స్త్రీ శ్చ కురు సృష్టిం సనాతనీమ్ || 37
అస్మిన్ జీవాశ్చ దేవాద్యాసై#్రలోక్యే సచరాచరే | ఏతే సర్వే భవిష్యంతి న క్షమాస్త్వవలంబనే || 38
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహాత్ముడగు ఆ పురుషుని ఈ మాటలను వినిన ఆ బ్రహ్మ మిక్కిలి విస్మితుడై క్షణకాలము ఏమియూ పలుకలేదు (35).
అపుడు బ్రహ్మ మనస్సును నిలద్రొక్కుకొని, విస్మయమును పూర్తిగా విడిచి, ఆ స్త్రీ యందలి కామనను నియంత్రించుకొని, ఆ పురుషునితో నిట్లనెను (36).
నీవు ఈ స్వరూపముతో నున్నవాడై, అయిదు పుష్పబాణములతో స్త్రీ పురుషులను మోహపెట్టుచూ సనాతనమగు సృష్టిని చేయుము (37).
ఈ స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో దేవతలు మొదలగు ఈ జీవులందరూ కూడియు నిన్ను కాదని నిలబడుటకు సమర్థులు కాజాలరు (38).
అహం వా వాసు దేవో వా స్థాణుర్వా పురుషోత్తమః | భవిష్యామస్తవ వశే కిమన్యే ప్రాణధారకాః || 39
ప్రచ్ఛన్న రూపో జంతూనాం ప్రవిశన్ హృదయం సదా | సుఖహేతుస్స్వయం భూత్వా సృష్టిం కురు సనాతనీమ్ || 40
త్వత్పుష్ప బాణస్య సదా సుఖలక్ష్యం మనోద్భుతమ్ | సర్వేషాం ప్రాణినాం నిత్యం సదా మదకరో భవాన్ || 41
నేను, వాసు దేవుడు, పురుషోత్తముడగు శివుడు కూడా నీకు వశమగు వారమే. ఇక ఇతర ప్రాణుల గురించి చెప్పున దేమున్నది? (39).
నీవు ప్రాణుల హృదయములో సర్వదా గుప్త రూపుడవై యుండి వారికి స్వయముగా సుఖమునకు కారణము అగుచూ, సనాతనమగు సృష్టిని చేయుము (40).
అద్భుతమగు ఆ మనస్సు సర్వదా నీ పుష్పబాణములకు లక్ష్యమై సుఖమునిచ్చును. నీవు ప్రాణులందరికీ సర్వదా మదమును కలిగించెదవు (41).
ఇతి తే కర్మ కథితం సృష్టి ప్రావర్తకం పునః | నామాన్యేతే వదిష్యంతి సుతా మే తవ తత్త్వతః || 42
ఇత్యుక్త్వాహం సురశ్రేష్ఠ స్వసుతానాం ముఖాని చ | ఆలోక్య స్వాసనే పాద్మే ప్రోపవిష్టోsభవం క్షణ || 43
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామప్రాదుర్భావో నామ ద్వితీయోsధ్యాయః (2)
ఇట్లు నేను సృష్టిని ప్రవర్తిల్లజేయు నీ కర్మను గురించి చెప్పితిని. ఈ నా కుమారులు నీ స్వరూపమునకు అనుగుణమగు పేర్లను చెప్పగలరు (42).
ఓ దేవశ్రేష్ఠా! నేను ఇట్లు పలికి, నా కుమారుల ముఖములను చూచి, నా పద్మాసనమునందు శ్రీఘ్రమే ఉపవిష్టుడనైతిని (43).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండంలో కామప్రాదుర్భావము అనే రెండవ అధ్యాయము ముగిసినది (2)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
04.Sep.2020
No comments:
Post a Comment