1) 🌹 శ్రీమద్భగవద్గీత - 479 / Bhagavad-Gita - 479🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 267🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 169🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 83 / Sri Lalita Sahasranamavali - Meaning - 83🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 85🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 55🌹
8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 42 / Gajanan Maharaj Life History - 42 🌹
9) 🌹. శివగీత - 52 / The Shiva-Gita - 52🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 34🌹
11) 🌹. సౌందర్య లహరి - 94 / Soundarya Lahari - 94 🌹
12) 🌹. శ్రీమద్భగవద్గీత - 394 / Bhagavad-Gita - 394🌹
13) 🌹. శివ మహా పురాణము - 215🌹
14) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 91 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 102 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 33🌹
17) శ్రీ విష్ణు సహస్ర నామములు - 4 / Sri Vishnu Sahasranama - 4 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 23 🌹
19) 🌹 Seeds Of Consciousness - 166🌹
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 45🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 22 📚
22) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 2 / Vishnu Sahasranama Contemplation - 2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 479 / Bhagavad-Gita - 479 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 24 🌴*
24. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై: సహ |
సర్వథా వర్తమానో(పి న స భూయో(భిజాయతే ||
🌷. తాత్పర్యం :
భౌతికప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంత:ప్రక్రియకు సంబంధించిన ఈ తత్త్వమును అవగాహన చేసికొనినవాడు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమానస్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు.
🌷. భాష్యము :
భౌతికప్రకృతి, పరమాత్మ, జీవాత్మ, వాని నడుమగల సంబంధము యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తుని గావించును.
అంతియే గాక ఈ భౌతికప్రకృతికి అతడు తిరిగిరాకుండునట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మికత వైపునకు మళ్ళించును. ఇదియే జ్ఞానము యొక్క ఫలితము. జీవుడు యాదృచ్చికముగా భౌతికస్థితిలోనికి పతితుడయ్యెనని అవగాహన చేసికొనుటయే జ్ఞానము యొక్క ఉద్దేశ్యమై యున్నది.
కనుక జీవుడు ప్రామాణికుల (సాధుపురుషుల మరియు గురువు) సాంగత్యమున తన నిజస్థితిని అవగతము చేసికొని, శ్రీకృష్ణుడు వివరించిన రీతిగా భగవద్గీతను తెలిసికొని ఆధ్యాత్మికభావనకు (కృష్ణభక్తిరసభావనము) మరలవలెను.
అప్పుడు అతడు నిశ్చయముగా ఈ భౌతికజగమునకు తిరిగిరాక సచ్చిదానందమయ జీవనమునకై ఆధ్యాత్మికజగత్తును చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 479 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 24 🌴*
24. ya evaṁ vetti puruṣaṁ
prakṛtiṁ ca guṇaiḥ saha
sarvathā vartamāno ’pi
na sa bhūyo ’bhijāyate
🌷 Translation :
One who understands this philosophy concerning material nature, the living entity and the interaction of the modes of nature is sure to attain liberation. He will not take birth here again, regardless of his present position.
🌹 Purport :
Clear understanding of material nature, the Supersoul, the individual soul and their interrelation makes one eligible to become liberated and turn to the spiritual atmosphere without being forced to return to this material nature.
This is the result of knowledge. The purpose of knowledge is to understand distinctly that the living entity has by chance fallen into this material existence.
By his personal endeavor in association with authorities, saintly persons and a spiritual master, he has to understand his position and then revert to spiritual consciousness or Kṛṣṇa consciousness by understanding Bhagavad-gītā as it is explained by the Personality of Godhead.
Then it is certain that he will never come again into this material existence; he will be transferred into the spiritual world for a blissful eternal life of knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 267 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 32
*🌴 Description of Nava Nadhas 🌴*
*🌻 Explanation about Sai Baba - 1 🌻*
I told you before, that in future my Samardha Sadguru form by name Saibaba would be coming. That avathar will make Dheesila Nagaram as his place of work and protects his devotees.
That avathar will not be different from my tatwam. I will decide how much grace has to be given and how much should not be given.
Saibaba, if disturbed by his devotee’s prayers, asks for more grace from me, I will certainly give. The Prabhu tatwam shows His grace listening to common man’s prayers and anguish. Why will It not give when Saibaba asks?
So all people who follow Saibaba will be certainly benefited. ‘Sethe visramyathi ithi Sai’. Sai tatwam is the one which apeaces the functions of organs.
The tatwam of Saibaba will be in a state of ‘merger’ in me (sayujya stithi).’ I asked ‘Salutations to Sri Maha Guru. Is Sri Vasavee Kanyaka a complete manifestation or a partial manifestation?”
Sripada said, ‘Arya Mahadevi was born as the daughter of Kusuma Shresti in accordance with Her promise. If Kanyaka had not come, Vysya Kulam would have had many mishaps.
A Vysya by name Samadhi noticed this danger remaining in seed form. He noticed that it was going to come from unexpressed state to the expressed state, sprout and became a big tree, and Vysya kulam was going to be caught in danger.
If Ambika was not born cruel Kings like Vishnuvardhana, would marry beautiful girls of small Kings like Kusuma Shresti or his relatives and treat them as their ‘mistresses’ and will make everybody fallen from dharma.
To avoid such things happening to any girl of the small Kings and to protect their chastity, self pride and dignity of their caste, Vasavee entered agni along with others in different gothras.
Either the dignity and self pride should be burnt in agni or the Vysyas having dignity and pride should be burnt.
In this agni pareeksha (test of fire), the Vysyas became victorious by the grace of Sri Vasavee.
In return to that sacrifice, people borne in their gothras (their descendants) are being granted wealth and health having no dearth of food and clothing.
Sri Vasavee Kanyaka is only one ray of Arya Mahadevi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 146 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సంస్కృతి-సమానత 🌻*
సమానత అంటే అన్ని జాతులందు, అన్ని సంస్కృతులందు గల ఏకత్వాన్ని దర్శించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పనిని త్రికరణ శుద్ధిగా చేయడమేగాని మన సంస్కృతిని, సంస్కారాన్ని వదులుకొనడం కాదు.
మన దేశము, మన సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించడం, మెచ్చుకొనడం సమానతకు భంగకరం (anti-secular) అని భావించడం హాస్యాస్పదం.
అనాది కాలం నుండి ఇతర ఖండాలలో మన భారతీయ సంస్కృతికి ఎంతో పేరు, ప్రతిష్ఠలున్నాయి. ఈనాటికి ఎందరో పాశ్చాత్య ఖండవాసులు భారతదేశం రావడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరిచడం అదృష్టంగా భావిస్తారు.
నేడు ప్రపంచ దేశాల మానవులను పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ పుణ్యభూమి యందే దొరుకుతుందనేది నిస్సందేహము.
అయితే మనదేశం ప్రస్తుతం అనేక సమస్యలలో కూరుకుని ఉన్నది కదా అని సందేహం రావొచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
ఈ దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మతమనే మసిపూసిన అద్దంలో నుంచి చూసి తిరస్కరించడం ప్రధాన కారణం. అన్ని రంగాల్లోను పాశ్చాత్య సంస్కృతిని ఆదర్శంగా తీసికొని వారి నుంచి అవి, ఇవి యాచించడం, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం మొదలైన ఎన్నో కారణాలున్నాయి.
అంతేకాక బ్రిటీషు పాలనకు ముందు ప్రతి గ్రామంలో ఉన్న అన్ని వర్ణాలవారు ఐకమత్యంతో ఒకే కుటుంబ సభ్యులు వలె పరస్పరత్వంతో మెలిగేవారు. అందరిమధ్య సామరస్యభావన, సమానత అప్రయత్నంగా నెలకొని ఉండేవి.
బ్రిటీషు వారి 'విభజించి పాలించడము' (Divide and Rule) అనే పద్ధతి వలన వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా గజిబిజి చేయబడింది. అప్పటి నుండి గ్రామ వాసుల మధ్య సామరస్యం దెబ్బతిన్నది.
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 167 🌹*
*🌴 The Bridge - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻. Student and Teacher - 3 🌻*
We are so accustomed to physical things that we think that the presence of a teacher is also physical. But it is never physical.
A teacher is one who has realized in himself the Buddhic consciousness, who has realized himself as a soul and who has built a bridge to the universal soul or God.
He lives in connection with God, with the universal energy. He is able to convey to the seeker the sublime states of consciousness.
Therefore, it is said that the presence of the teacher transforms the disciple just like a piece of iron is magnetized near a magnet.
In the same way, the presence of the Master manifests in each aspirant who invokes the name of Master CVV. As a result of this presence, Prana flows from the surrounding space into the aspirant.
The presence of the teacher or Master is a catalyst. It is simply there, and the one who receives this presence transforms himself. The presence itself does nothing, it IS only.
Being in the presence of a person who lives in Buddhi and does not let himself get entangled in mundane matters, is the easiest and most effective way to build the bridge to the super-mundane and to cross that bridge.
Therefore, the presence of a Master should be regularly contemplated.
🌻 🌻 🌻 🌻 🌻
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars. Master Dr. E. Krishnamacharya: Spiritual Astrology.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 83 / Sri Lalita Sahasranamavali - Meaning - 83 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్లోకం 159*
*జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ*
*సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా*
848. జన్మమృత్యుజరాతప్త :
చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు
849. జన :
జనులు
850. విశ్రాంతిదాయినీ :
విశ్రాంతి ని ఇచ్చునది
851. సర్వోపనిషదుద్ఘుష్టా :
అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
852. శాంత్యతీతకళాత్మికా :
శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప, రాగద్వేషములు లేని మానసిక స్థితి "శాంతి", ఆనందము దానిని మించినది)
*🌻. శ్లోకం 160*
*గంభీరా గగనాంతస్తా గర్వితా గానలోలుపా*
*కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధ విగ్రహ*
853. గంభీరా :
లోతైనది (అమ్మణ్ణి తత్వము తెల్సుకొనుట కష్టము)
854. గగనాంతస్తా :
ఆకాశమునందు ఉండునది
855. గర్వితా :
గర్వము కలిగినది
856. గానలోలుపా :
సంగీతమునందు ప్రీతి కలిగినది
857. కల్పనారహితా :
ఎట్టి కల్పన లేనిది
858. కాష్ఠా :
కాలపరిగణన లో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం)
859. కాంతా :
కాంతి కలిగినది
860. కాంతార్ధ విగ్రహ :
కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 83 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 83 🌻*
848 ) Udara keerthi -
She who has wide and tall fame
849 ) Uddhhama vaibhava - She who has immeasurable fame
850 ) Varna roopini -
She who is personification of alphabets
851 ) Janma mrutyu jara thaptha jana vishranthi dhayini -
She who is the panacea of ills of birth, death and aging
852 ) Sarvopanisha dhudh gushta -
She who is being loudly announced as the greatest by Upanishads
853 ) Shantyathheetha kalathmika -
She who is a greater art than peace
854 ) Gambheera -
She whose depth cannot be measured
855 ) Gagananthastha -
She who is situated in the sky
856 ) Garvitha -
She who is proud
857 ) Gana lolupa -
She who likes songs
858 ) Kalpana rahitha -
She who does not imagine
859 ) Kashta - She who is in the ultimate boundary
860 ) Akantha - She who removes sins
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 85 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 55
*🌻 55. తత్ ప్రాప్య తదేవాలోక యతి, తదేవ శృణోతి,*
*(తదేవ భాషయతి) తదేవ చింతయతి ॥| 🌻*
ముఖ్యభక్తి లక్షణాల్లో ఆంతరంగిక అనుభవం ఉంటూనే ఆ భక్తి వలన కలిగే ఆవేశం బాహ్యానికి ప్రకటితమవుతుంది.
భక్తుడు భగవత్రైమను అనేక పద్ధతులలో వ్యక్తికరిస్తూ ఉంటాడు. అంతరంగంలో గోచరమవుతున్న భగవంతుడిని, బయట ప్రతి ప్రాణిలోనూ చూస్తాడు. జడ వస్తువులలో కూడా చూస్తాడు. సమస్తం భగవత్స్వరూపంగా చూస్తూ ఉంటాడు. కనుక సమస్తాన్ని ప్రేమిస్తాడు.
అందువలన జీవ లోకానికి అవసరమైన సేవను “నారాయణసేవ”గా చెస్తాడు. ఆ భక్తుడు ఏది చూచినా, దెనిని విన్నా ఎవరితో మాట్లాడినా, దేనిని చింతించినా అంతా భగవంతుడితోటె లోకంగా జీవిస్తాడు.
లోకంలో భగవంతుడు, తాను ఉన్నట్టు, ఇంక మూడవదెది లెనట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ముఖ్యభక్తి అనెది పరాభక్తికి ఒక మెట్టు క్రిందిదని గ్రహించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 55 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
Sloka: yajno vratam tao danam japa stirtham tathaiva ca sarvesa meva jantunam sarve marga pratarakah
*Rituals of the highest order (Yagnas), vows (Vratas), penances, worships, pilgrimages, the various path-ways for Sadhana (yogic practice) are all deceptive if one doesn’t concentrate upon one’s Guru.*
*It means that he who doesn’t bear devotion to the Guru will be confronted with evil effects in his yogic practice.*
Sloka: Japa stapo vratam tirtham yajno danam tathaiva ca Gurutatva mavijnaya sarvam vyartham bhavet priye
Siva proceeds to say to Parvati that if one does not know the quality of Guru, all ritualistic practices, prayers, penances etc are all useless.
We consider ourselves very knowledgeable thinking “I’m a great scientist” or “I am wellversed in the Vedas” or “I did a lot of rigorous study”, or “I’m a great artist”. There are people that say, “I worked very hard, I worked for 5 years to earn this degree”.
But, what is Knowledge? Science, arts and the like comprise a kind of knowledge. Similarly, Vedas, Puranas and scriptures also comprise a kind of knowledge.
However, Science helps us understand and see things that are very far away, but it cannot help you see your inner self. Science tells you about several planets in the outer space. It also tells you about the precious stones and elements buried deep in the earth.
People that know a lot about this are considered great scientists. But, remember that Science cannot help you see or understand your inner self.
Not only that, it actually takes you even farther away from your self, because all this knowledge makes you egoistic. You think you’ve earned a lot of great knowledge.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 52 / The Siva-Gita - 52 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము
*🌻. విశ్వరూప సందర్శన యోగము - 6 🌻*
అజ్ఞాన మూడా మున యో వదంతి
పూజో పచారాది బహుక్రియాభి:,
తేషాం గిరీశో భజతీతి మిథ్యా
కుతస్త్వ ముర్త స్య తు భోగలిప్పా 31
కించిద్ద లం వా చులకోదకం వా
యత్త్వం మహేశ! ప్రతిగృహ్య ధత్సే !
త్రైలోక్యలక్ష్మీ మపి తజ్జ నేభ్య
స్సర్వంత్వ విద్యాకృత మేవ మన్యే 32
వ్యాప్నోషి సర్వావిదిశో దిశశ్చ
త్వం విశ్వమేకః పురుషః పురాణై,
నష్టేపి త స్మిం స్తవ నాస్తి హాని
ర్నస్టే వినష్టే నభ సోయథైవ 33
యథైవ మాకాశ గ మర్క బింబం
క్షుద్రేషు పాత్రేషు జలాన్వితేషు,
భజత్యనేక ప్రతిబింబభావం
త థా త్వ మంతః కరణే షు దేవః 34
సుసర్జ నే వాప్యవనే వినాశే
విశ్వస్య కించి త్త వ నాస్తి కార్యమ్,
అనాది భి ర్దే హభ్రుతా మద్రుష్టై:
తథాపిత త్స్వప్నవ దాతనోషి 35
ఆరాధనోపచార ఉపహారములు మొదలగు అనేక క్రియలచేత నీవు ప్రసన్నుడవగుదువని యజ్ఞానముతో మందమతులైన మునులు పలుకుచుందురు. అమూర్తుడవగు నీకు సుఖోపభోగ మెక్కడిది ?
ఎవడైతే భక్తితో కొద్ది మాత్ర బిల్వ పత్రములు జలము సమర్పించినచో ఆతనిని నీవు అత్యంత గౌరవముతో ప్రసన్నుండవై ముల్లోక రాజ్యమును అనుగ్రహించెద వనియు అయినప్పటికీ వీనినన్నింటిని అజ్ఞాన పాచరణగా నే ననుకొనెదను. పురాణ పురుషుడవగు నీ వొక్కడివే. దిశలను విదిశలను నిఖిల జగత్తును వ్యాపించియున్నావు. యద్యపి అవి నశించినను ఆకాశము వలె నీకు కూడా నాశనమనేది లేదు.
ఆకస మందు చరించే సూర్యుడు జలాశయ కుపటాదులలో నేవిధముగా భిన్న్నభిన్నములుగాను అగుపడునో, అదేరీతిగా నీ వొక్కండవయ్యు లో కాంతః కరణములందు అనేక రూపములందు దృగ్గో చరుండ వగుదువు.
ఈ చరాచరాత్మకం సమస్త ప్రపంచమును బుట్టింప - రక్షింప, చివరకు లయ (హరించుట) మొనర్చుటవలన నీ కేమియు లాభము (ఉపయోగము)లేదు. అనాది సంచితములగు శరీరుల అదృష్టాను సారముగా కలుగుచుండును. ఉండును, పోవును, ఐనప్పటికిన్ని స్వప్నము మాదిరిగా విస్తరింపచేతువు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 52 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 07 :
*🌻 Vishwaroopa Sandarshana Yoga - 6 🌻*
Ignorant Saints preach that you become pleased with worship, Upachara, and gifts kind of various
offerings because of their poor intellect.
You, who doesn't have a form (amoorti), what's the use of comforts (sukha) and enjoyments (bhoga) to you? The one who offers you little Bilva leaves with water you become extremely pleased with that person and shower the property of the kingdom of three worlds on him. But still i doubt this belief also as a belief out of ignorance only!
You are the primordial being (Purana Purusha) who alone remains pervading in all directions and entire world. Even when they get destroyed, you remain indestructible pervading like the ether.
As like as the one single sun looks multiple
when seen in the reflection in multiple pots, in the same way you are the only one who exists but you
appear as many to the eyes. There is not special benefit for you in doing creation, sustenance and
dissolution of these universes.
Due to the accumulated bodies (karanadeham) based on the karmas you make them they originate, stay and dissolve in you and you expand them like a play in dream.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 42 / Sri Gajanan Maharaj Life History - 42 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 9వ అధ్యాయము - 1 🌻*
శ్రీగణేశాయనమః ! ఓరుక్మిణివరా, చంద్రభాగనదీ తీరంవద్ద నివసించే ఓభగవంతుడా, మురళి చేతబట్టి, యోగులను దీవించేవాడా, పతితులను రక్షించి దీవంచే వాడవు నీవే. చిన్న వాళ్ళ అస్థిత్వం లేకపోతే గొప్పవాళ్ళ గొప్పతనం ఉండనే ఉండదు, మరియు పాపులు లేనిదే భగవంతునికి ప్రాధాన్యత దొరకదు. ఓభగవంతుడా మావంటి పాపుల కారణంగానే నీవు రక్షకుడవని పిలవబడుతున్నావని గుర్తుంచుకో.
స్పర్శవేదమణికి గొప్పతనం, ఇనుమును తాకగానే బంగారంగా మార్చడంవల్ల లభించింది. ప్రతిచిన్న సెలయేరునుండి నీటిని తనలోకి రానిస్తుంది కావున గోదావరి పవిత్రనది అని పిలవబడింది. ఓమాధవా ఈవిషయం మీద ఆలోచించి ఈదాసగణును మునిగిపోకుండా కాపాడడానికి చేయూతను ఇమ్ము .
గోవిందబువా తకిళికర్ అనే పేరుగల ఒక కీర్తనకారుడు ఒకసారి షేగాంలో కీర్తన చేసేందుకు వచ్చాడు. షేగాంలో శివభగవానుని పురాతన దేవాలయం ఒకటి ఉంది. దానిని మాటే అనే ధనవంతుడు పునరుద్ధరణ చేయించాడు. ఈకాలంలో ధనవంతులకు మందిరాలయందు ఆసక్తిలేదు. ద్విచక్ర వాహనాలు, మోటరుకారులు ఇష్టపడుతున్నారు.
మొటేషాహుకారు ఆవిధమయిన వ్యక్తికాదు. ధనవంతుడయినప్పటికీ, భగవంతుడంటే నమ్మకం కలవాడు. అందువల్ల ఆమందిరం మోటోగారి మందిరంగా పిలవబడింది. ఇక కధవినండి: గోవిందబువా తకిళికర్ పైన ఉదాహరించిన గుడిలో బసచేసి తన గుర్రాన్ని ముఖద్వారం ఎదురుగా కట్టాడు. దగ్గరకు ఎవరు వచ్చినా తన్నడం, కరవడం వంటి చెడు లక్షణాలు ఈగుర్రానికి ఉన్నాయి. ఇది తరచు తాళ్ళుతెంచుకుని, ఒకచోట స్థిరంగా ఉండక, ఒక్కొక్క సారి అయితే అడవులలోకి పారిపోయేది. రాత్రి పగలు తింటూ చాలా చెడ్డ అలవాట్లు నేర్చుకుంది.
గోవిందబువా దీనికోసం ప్రత్యేకంగా ఒక ఇనుప గొలుసు తయారు చేయించాడు కాని, దురదృష్టవశాత్తు ఈసారి షేగాం వచ్చినప్పుడు తేవడం మరచిపోయాడు. ఈగుర్రాన్ని ఏదో ఒక విధంగా తాడుతో కట్టి తను గుడిలో పడుకున్నాడు. అది అర్ధరాత్రి సమయం, ప్రతీది చిక్కటి అంధకారంలో మునిగి ఉన్నాయి. రాత్రి తిరిగే పక్షులు తమ ఆహారం కోసం వెతుకుతూ భయానక ధ్వనులు చేస్తున్నాయి. అన్నిఇళ్ళ తలుపులు మూసిఉండి, చుట్టుప్రక్కలంతా నిశ్శబ్దంగా ఉంది.
ఆ సమయంలో శ్రీగజానన్ ఆగుర్రం కట్టి ఉన్న స్థలానికి వచ్చారు. చెడ్డవారిని ఉద్ధరించడానికే, యోగులను జన్మించడం భగవంతుని ఉద్దేశ్యం. ఔషదం జబ్బును నయంచేసినట్టు, యోగులు బ్రష్టుల క్రూరత్వం తొలిగించేందుకు సహాయ పడతారు. కావున ఆరోజు రాత్రి, శ్రీగజానన్ మహారాజు ఆ గుర్రం దగ్గరకివచ్చి దాని నాలుగు కాళ్ళ మధ్యలో హాయిగా పడుకున్నారు. ఆయన తను సాధారణంగా వర్ణించే మంత్రం గణ గణ గణాత బోతె వర్ణించుకుంటున్నారు. దీని అర్ధం ఎవరికీ తెలియదు.
ఈ భజనకి నా అనువాదం ఏమంటే గణి అంటే లెక్క. ప్రతివారి ఆత్మ, గణ అంటే భక్తుడు, ఎవరూ బ్రహ్మనుండి వేరుకారు అని సూచించడానికి గణత్ అనే పదం వాడబడింది. బోతే అనేది బహుశ భేట్ కు బదులుగా యాశగా వాడబడింది. అర్ధం ఏమంటే ప్రతి ఆత్మ స్వయాన బ్రహ్మయే కాని దానినుండి వేరుకాదు అని. ఈ భజన గూర్చి రెండు విధాలయిన కధనాలు ఉన్నాయి, కాని మనకు వాటి గురించి చింతించనవసరం లేదు ఎందుకంటే మనకు కావలసింది ఆ కధ గురించే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 42 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 9 - part 1 🌻*
Shri Ganeshayanamah! O Rukmini's consort! O You, who lives on the bank of Chandrabhaga, adores flute and blesses saints! You are the saviour of the fallen and the giver of blessings.
Greatness of the great cannot exist without the presence of small ones, and God cannot get his importance without the existence of sinners. Oh God! Please remember that because of us, the sinners, you are called the savior.
A paras has importance because its touch turns iron into gold. Godavari is called a holy river because it accepts water from small brooks. Oh, Madhava think over this and give a helping hand to this Dasganu to save him from drowning.
One Kirtankar named Govindbua Taklikar once came to Shegaon to perform kirtan. There was an ancient temple of God Shiva at Shegaon and it was renovated by a rich man named Mote. Nowadays the rich are not very fond of spending money over buildings or renovating religious institutions like temples, instead they like investing their money on motors, cars and cycles.
Mote Saokar was not that kind of a person. Though rich, he was a believer in God, and that was why he got the temple renovated. So the temple was called Mote's temple. Now listen to the story. Govindbua Taklikar camped in the above mentioned Mote's temple and had tied his horse in front of the main door.
The horse had very bad habits like kicking anybody coming near it, and of biting. It frequently snapped the ropes holding it, never stayed steady and at times used to run away in the jungles. Day and night it used to neigh, creating a lot of noise. Govindbua had gotten an iron chain prepared for it, but had forgotten to bring the same with him during his trip to Shegaon.
The horse was some how tied with a rope while Govindbua slept in the temple monitoring the horse at all times. It was past midnight and everything, had drowned in pitch darkness. Night birds, creating fearful sounds, were searching for their feed. All the doors in the villages were closed and there was a fearful dead silence all around. Nobody was seen on the roads.
At that time Shri Gajanan came to the place where the horse was tied. Saints' birth on this earth is ordained by Gods to improve the bad people, and as medicine cures disease, the saints help remove the wickedness from the disillusioned people.
So Shri Gajanan Maharaj, on that particular night, came to the horse and happily slept under its four legs. He was reciting His usual Mantra, Gana Gan Ganat Bote, the meaning of which nobody knew.
My interpretation of this symbolic Bhajan is as follows - Gani means count, Individual soul, (Gana) means devotee, who is not different from Brahma and to suggest it the word Ganat is used.
Bote appears to be the corrupt form of Bate meaning individual soul in Brahma Himself and not anything different from it. There are two versions of this Bhajan, but we need not bother about it, as we are concerned about the story at this moment.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 34 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 1 🌻*
*ఆవశ్యక అస్థిత్వము : -*
129) భౌతిక సంబంధమైనవి అన్నింటితో కూడి యున్నది. పంచ ఆవిష్కరణమూలలో ,నిది అయిడవిది . ఈ యైదును పరాత్పరునిలోనున్న భగవంతుని పంచ ఆవిష్కరణలములు. ఒక సద్గురువు లేక అవతార పురుషునియొక్క సార్వభౌమిక మనసుయొక్క సహాయము లేనిదే వీటి మర్మమెవరికిని తెలియదు.
130. భగవంతుడు తన శాశ్వత అనంత ఆస్తితత్వమందు ఎఱుక కలవాడగుటకే, తానెవరో తనకు తెలియని (A) స్థితిలోనున్న భగవంతునిలో అనంతలీల చలించిన ఫలితమే, యాదృచ్ఛికమైన పరిణామము సంభవించినది.
131. పరమాత్మయొక్క ఎఱుకలేని (A) స్థితినుండి పొందిన చైతన్యము, పరమాత్మలో నైక్యమై, ఆ నైక్యము ద్వారా సత్యానుభవమును, పొందుటకు మారుగా, ద్వైతము ద్వారా స్థూల రూపములతో సహకరించి అసంఖ్యా క సంస్కారములను అనుభవించుచూ పరిణామము చెందుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 సౌందర్య లహరి - 94 / Soundarya Lahari - 94 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
94 వ శ్లోకము
*🌴 విజయం లభించుటకు, ఆపార్ధాలు, అపనిందలు తొలగుటకు 🌴*
శ్లో: 94. కళజ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం కళాభిః కర్పూరై ర్మరకతకరణ్డం నిబిడితమ్ అతస్త్వద్భోగేన ప్రతిదిన మిదం రిక్త కుహరం విధిర్భూయోభూయో నిబిడయతి నూనం తవ కృతే.ll
🌷. తాత్పర్యం :
అమ్మా చంద్రబింబము అనగా మరకతమణులచే నిర్మించబడిన పెట్టె. అందు నీవు రోజూ ఉపయోగించు పన్నీరు, కస్తూరి, కర్పూరము పలుకులు ఉంచి రోజూ ఉపయోగించుట వలన ఖాళీ అయిన వాటిని బ్రహ్మ దేవుడు మాటిమాటికి నింపును. కదా ఇది సత్యము.
🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 108 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పొంగలి, పండ్లు నివేదించినచో సర్వాభిష్టములు దైవానుగ్రహము వలన నెరవేరునని, విజయం సంప్రాప్తించును, మరియు ఆపార్ధాలు, అపనిందలు తొలగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Soundarya Lahari - 94 🌹*
📚. Prasad Bharadwaj
SLOKA - 94
*🌴 Getting all Desires, Clears misunderstandings, blames 🌴*
94. Kalankah kasthuri rajani-kara-bimbham jalamayam Kalabhih karpurair marakatha-karandam nibiditam; Athas thvad-bhogena prahti-dinam idam riktha-kuharam Vidhir bhuyo bhuyo nibidayathi nunam thava krithe.
🌻 Translation :
The moon that we know is thine jewel box,filled with water of incense,the blackness we see in the moon,the musk put for thy use in this box,and the crescents we see of the moonis thy canister of emerald,full of divine camphor.and for sure,brahma the creator refills these daily,after your use,so that they are always full.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 108 times a day for 45 days, offering pongal and fruits as nivedhyam, it is said that all their desires will be fulfilled, and Clears misunderstandings, blames with the blessings of the lord.
🌻 BENEFICIAL RESULTS:
Getting great renown, moksha (liberation), bright face.
🌻 Literal Results:
Ideal sloka for people born during waning moon period. Clears misunderstandings, blames, public scandals etc. Also suitable for reviving closed chapters (business/personal). Face becomes radiant.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 394 / Bhagavad-Gita - 394 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 01 🌴
01. అర్జున ఉవాచ
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహో(యం విగతో మమ ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను: ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడని ఈ అధ్యాయము తెలియజేయును. ఎవని నుండి భౌతికవిశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువునకు శైత్యము అతడే కారణము. అట్టి శ్రీకృష్ణుడు అవతారము కాదు. సర్వావతారములకు కారణుడైన అవతారి. ఈ విషయము గడచిన అధ్యాయమున విశదముగా వివరింపబడినది.
ఇచ్చట అర్జునుడు తన మోహము తొలగిపోయినట్లుగా పలికినాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్యమానవునిగా లేక తన స్నేహితునిగా భావించక, సర్వమునకు కారణమైనవానిగా తెలియగలిగినాడు.
అతడు పరమ్ ఉత్తేజితుడై తనకు కృష్ణుని వంటి గొప్ప స్నేహితుడు లభించినందులకు పరమానందభరితుడైనాడు. కాని తాను శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా ఆంగీకరింపరేమోనని అతడు యోచింప నారంభించెను.
కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరచుటకు అతడు తన విశ్వరూపమును చూపుమని ఈ అధ్యాయమున శ్రీకృష్ణుని ప్రార్థించెను. వాస్తవమునకు శ్రీకృష్ణుని విశ్వరూపము గాంచినపుడు ఎవరైనను అర్జునుని వలె భీతి నొందెదరు. కాని కరుణాంతరంగుడైన ఆ భగవానుడు విశ్వరూపమును చూపిన పిమ్మట తన మూలరూపమును పొందియుండెను.
“నీ హితము కొరకు నేనిది ఉపదేశించుచున్నాను” అని పలుమార్లు శ్రీకృష్ణుడు పలికిన విషయమును సంపూర్ణముగా అంగీకరించిన అర్జునుడు అంతయు శ్రీకృష్ణుని కరుణ చేతనే జరుగుచున్నదని కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చట పలుకుచున్నాడు.
అనగా శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడనియు మరియు సర్వుల హృదయమునందు పరమాత్మరూపమున వసించియున్నాడనియు అర్జునుడు ఇప్పుడు సంపూర్ణ నిశ్చయమునకు వచ్చెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 394 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 01 🌴
01. arjuna uvāca
mad-anugrahāya paramaṁ
guhyam adhyātma-saṁjñitam
yat tvayoktaṁ vacas tena
moho ’yaṁ vigato mama
🌷 Translation :
Arjuna said: By my hearing the instructions You have kindly given me about these most confidential spiritual subjects, my illusion has now been dispelled.
🌹 Purport :
This chapter reveals Kṛṣṇa as the cause of all causes. He is even the cause of the Mahā-viṣṇu, from whom the material universes emanate.
Kṛiṣṇa is not an incarnation; He is the source of all incarnations. That has been completely explained in the last chapter.
Now, as far as Arjuna is concerned, he says that his illusion is over. This means that Arjuna no longer thinks of Kṛṣṇa as a mere human being, as a friend of his, but as the source of everything.
Arjuna is very enlightened and is glad that he has such a great friend as Kṛṣṇa, but now he is thinking that although he may accept Kṛṣṇa as the source of everything, others may not.
So in order to establish Kṛṣṇa’s divinity for all, he is requesting Kṛṣṇa in this chapter to show His universal form.
Actually when one sees the universal form of Kṛṣṇa one becomes frightened, like Arjuna, but Kṛṣṇa is so kind that after showing it He converts Himself again into His original form.
Arjuna agrees to what Kṛṣṇa has several times said: Kṛṣṇa is speaking to him just for his benefit.
So Arjuna acknowledges that all this is happening to him by Kṛṣṇa’s grace. He is now convinced that Kṛṣṇa is the cause of all causes and is present in everyone’s heart as the Supersoul.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 215 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
47. అధ్యాయము - 2
*🌻. కామప్రాదుర్భావము - 4 🌻*
బ్రహ్మోవాచ |
ఏవం తస్య వచశ్ర్శుత్వా పురుషస్య మహాత్మనః | క్షణం న కించిత్ర్పావోచత్స స్రష్టా చాతి విస్మితః || 35
అతో మనస్సు సంయమ్య సమ్య గుత్సృజ్యయ విస్మయమ్ | అవోచత్పురుషం బ్రహ్మా తత్కామం చ సమావహన్ || 36
అనేన త్వం స్వరూపేణ పుష్ప బాణౖశ్చ పంచభిః | మోహయన్ పురుషాన్ స్త్రీ శ్చ కురు సృష్టిం సనాతనీమ్ || 37
అస్మిన్ జీవాశ్చ దేవాద్యాసై#్రలోక్యే సచరాచరే | ఏతే సర్వే భవిష్యంతి న క్షమాస్త్వవలంబనే || 38
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహాత్ముడగు ఆ పురుషుని ఈ మాటలను వినిన ఆ బ్రహ్మ మిక్కిలి విస్మితుడై క్షణకాలము ఏమియూ పలుకలేదు (35).
అపుడు బ్రహ్మ మనస్సును నిలద్రొక్కుకొని, విస్మయమును పూర్తిగా విడిచి, ఆ స్త్రీ యందలి కామనను నియంత్రించుకొని, ఆ పురుషునితో నిట్లనెను (36).
నీవు ఈ స్వరూపముతో నున్నవాడై, అయిదు పుష్పబాణములతో స్త్రీ పురుషులను మోహపెట్టుచూ సనాతనమగు సృష్టిని చేయుము (37).
ఈ స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో దేవతలు మొదలగు ఈ జీవులందరూ కూడియు నిన్ను కాదని నిలబడుటకు సమర్థులు కాజాలరు (38).
అహం వా వాసు దేవో వా స్థాణుర్వా పురుషోత్తమః | భవిష్యామస్తవ వశే కిమన్యే ప్రాణధారకాః || 39
ప్రచ్ఛన్న రూపో జంతూనాం ప్రవిశన్ హృదయం సదా | సుఖహేతుస్స్వయం భూత్వా సృష్టిం కురు సనాతనీమ్ || 40
త్వత్పుష్ప బాణస్య సదా సుఖలక్ష్యం మనోద్భుతమ్ | సర్వేషాం ప్రాణినాం నిత్యం సదా మదకరో భవాన్ || 41
నేను, వాసు దేవుడు, పురుషోత్తముడగు శివుడు కూడా నీకు వశమగు వారమే. ఇక ఇతర ప్రాణుల గురించి చెప్పున దేమున్నది? (39).
నీవు ప్రాణుల హృదయములో సర్వదా గుప్త రూపుడవై యుండి వారికి స్వయముగా సుఖమునకు కారణము అగుచూ, సనాతనమగు సృష్టిని చేయుము (40).
అద్భుతమగు ఆ మనస్సు సర్వదా నీ పుష్పబాణములకు లక్ష్యమై సుఖమునిచ్చును. నీవు ప్రాణులందరికీ సర్వదా మదమును కలిగించెదవు (41).
ఇతి తే కర్మ కథితం సృష్టి ప్రావర్తకం పునః | నామాన్యేతే వదిష్యంతి సుతా మే తవ తత్త్వతః || 42
ఇత్యుక్త్వాహం సురశ్రేష్ఠ స్వసుతానాం ముఖాని చ | ఆలోక్య స్వాసనే పాద్మే ప్రోపవిష్టోsభవం క్షణ || 43
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామప్రాదుర్భావో నామ ద్వితీయోsధ్యాయః (2)
ఇట్లు నేను సృష్టిని ప్రవర్తిల్లజేయు నీ కర్మను గురించి చెప్పితిని. ఈ నా కుమారులు నీ స్వరూపమునకు అనుగుణమగు పేర్లను చెప్పగలరు (42).
ఓ దేవశ్రేష్ఠా! నేను ఇట్లు పలికి, నా కుమారుల ముఖములను చూచి, నా పద్మాసనమునందు శ్రీఘ్రమే ఉపవిష్టుడనైతిని (43).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండంలో కామప్రాదుర్భావము అనే రెండవ అధ్యాయము ముగిసినది (2)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 91 🌹*
Chapter 29
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 Settiling the Accounts - 2 🌻*
Consciousness was running up huge bills of debt because of so many unnatural actions. If you borrow from a bank or someone, you must repay the loan. If you don't, you will not be given any more credit until you pay.
You cannot borrow again until you have repaid your loans. Basically, the situation in the universe was that consciousness had borrowed more than it could pay back, and could not find anyone else to borrow from.
Consciousness was going bankrupt. In other words, consciousness had become too murderous, too selfish, too greedy, too hateful, too lustful, too false, etc., to balance itself. And there was no way to compensate for all of this.
It is the Avatar who must pay, and so he works and suffers for each one to settle the imbalanced accounts, and thereby sets the account for each one straight, a natural level of debit and credit.
But while he works for the benefit of each one, very few cooperate with him, because very few want to pay back their debits. Most of the world opposes his work, because most refuse to pay back.
Everyone must repay and be paid their sanskaric debits and credits.
But because of the amount of debit amassed, the Avatar comes to protect humanity. In spite of opposition, his work protects the world, and his love protects humanity.
After finishing his work the Avatar drops his body. Since the Avatar's work is most perfect, the result of the work is most perfect. He perfectly settles the accounts by making each one pay, but also by protecting the debtors from the creditors.
After the dropping of the Avatar's body, adjustments in every account take place according to the work done by the Avatar. A time comes when all adjustments in everyone's account are settled. Each one pays and is paid to whomever he is sanskarically in debt to or has credit with.
Everyone has the capacity to pay the price for going further on the path of Truth, though this capacity varies from person to person. Each one has the opportunity to clear their debts and be free, but those in whom the capacity varies continue to establish debts.
When all have the capacity to pay the price for progressing further along the path to Truth, they will naturally wonder who has given them this opportunity. This opportunity is the Avatar's legacy to humanity, the Father's legacy to his children.
When humanity realizes it was an inheritance, and something they did not earn, then the love of the Avatar manifests, and people read his will, "I have given you, my children, this inheritance. I love you all. I have suffered infinitely for your sake. I embrace you. All are
forgiven."
Let us long for the embrace of our Compassionate Father, who has suffered infinitely for us. Let us accept his forgiveness by suffering the pain of separation to that extent wherein our longing will achieve Union.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 102 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. పిప్పలాద మహర్షి - 4 🌻*
21. అతడు ఈ జీవకోటికి అంతర్యామిగా ఉన్నాడు. అంతే కాకుండా కాలరూపుడై ఉన్నాడు. అంతర్యామిగా కాలరూపుడు అంటే, పుట్టిన శరీరం ఒకసారెపుడో నశించాలి. కాబట్టి దానికి వృద్ధిక్షయములు అన్నీ ఉంటాయి. వాటిని విధిస్తూఉండే అంతర్యామి ఒకరు లోపల ఉన్నారు. పరబ్రహ్మ వస్తువే ఉందక్కడ. తరువాత అంతర్ముఖంగా అదే అతడు చేసే కర్మకు సాక్షిగాకూడా ఉన్నది.
22. ఎందుచేతనంటే ప్రతీజీవుడియందు అతడుచేసే కర్మ చూచేదెవరు? ఎవరు నిర్ణయం చేస్తున్నారు? అంతస్సాక్షిగా ఉన్న పరమాత్మవస్తువు జీవాత్మకు వెనుక, ద్రష్టగా(చూచేవాడుగా) సాక్షిగా ఉన్నాడు. (“ద్వా సుపర్ణా…” అనే ఉపనిషన్మంత్రానికి ఈ అర్థమే ఉంది. ఆ మంత్రంలో వర్ణితమైన వృక్షం ఈ దేహం. అందులోని రెండు పక్షులు – ఒకరు జీవాత్మ, మరొకరు పరమాత్మ. అతడు ద్రష్ట. చూచేవాడు కాబట్టి అతడిని సాక్షి అని అంటారు.)
23. “అంతటా వ్యాపించిన ఆ పరమాత్మ సృష్టిస్థితిలయములకు హేతువు అవుతున్నాడు. సర్వస్వరూపుడు అతడే! యజ్ఞంలో అర్చించబడేది అతడే! దక్షిణాయనానికి, ఉత్తరాయణానికి ఆయనే కారకుడు.
24. కర్మానుసారంగా జీవులకు దక్షిణాయనంలో పితృయానమార్గంలో చంద్రమండల ప్రాప్తి, ఉత్తరాయణంలో అర్చిరాది మార్గమున బ్రహ్మలోకప్రాప్తి అతడే కల్పిస్తున్నాడు. మొదటిది పునరావృత్తి సహితము, రెండవది పునరావృత్తి రహితము.
25. అంటే పితృయానమార్గంలో చంద్రలోకానికి వెళ్ళినప్పుడు జీవుడికి మళ్ళీ పునర్జన్మ కలిగితీరుతుంది. ఉత్తరాయణంలో యోగ్యుడై వెళ్ళిపోతే పునర్జన్మ కలుగదు. అంటే అందరికీ అనికాదు.
26. ఎందుకంటే ఉత్తరాయణంలో అనేక జీవులు చనిపోతున్నాయి. మేక, కుక్కలతోపాటు ఎన్నో జీవులు చనిపోతున్నాయి. మహాపాపాలు చేసినవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఉత్తరాయణంలో పుణ్యశీలి, జ్ఞానం కోరేవాడు పోతే అతడి పుణ్యం సఫలమయే కాలం వచ్చిందన్నమాట. అప్పటికే మోక్షంపై కోరిక ఉండి పుణ్యంచేసినవాడు ఉత్తరాయణ కాలంలోపోతే, అతడు పరమపదానికి వెళతాడు” అని చెప్పాడు పిప్పలాదుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 32 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*
STANZA VII
*🌻 The Fiery Baptism - 3 🌻*
67. Little by little, the Light illumined what had once been the domain of the darkness, whose puzzlingly restless and chaotic thoughts were still letting themselves be felt as blustery drafts.
One by one they attacked the tiny tongues of Fire, releasing their venomous sting of doubt and zealous distrust of his healing life-creating force. Still, the wee fire continued to glimmer gently, despite the dense drops of poison falling into it. The Light lived.
68. The struggle had moved from an external to an internal plane, taking on forms more and more subtle and concealed.
Many servants of the darkness went about their business surreptitiously, masked by the guise of “light.” It was still a challenge to distinguish the false reflection from the true. Intellectual reasoning was useless. It was the Heart that possessed the highest gift of discernment, and only it could help.
69. People began to listen ever more keenly to the Heart, which was now drawing more attention than the brain.
Many began to listen eagerly and attentively to the words of the Beacons of the Fiery World, proclaiming that the future belonged to the Heart, for it was pure. Yes, the Heart was incapable of lying or pretence; it had no feelings of hatred, revenge, greed, and all the other ills harboured by the human mind.
It knew only Love, and that pulsating organ could love like none other... While the mind had been defiled with dark thoughts, the Heart was utterly impervious to evil. To the Heart belonged the Future, while the mind was bogged down in the past. People hearkened to its Call...
70. The Gods sensed the readiness of human Hearts to receive New Currents. And then they set to work, rotating the Wheel in the New Rhythm of the outpouring currents of Sacred Love.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 4 / Sri Vishnu Sahasra Namavali - 4 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*4. సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ‖ 4 ‖ *
25) సర్వ: -
సమస్తమును తానై అయినవాడు.
26) శర్వ: -
సకల జీవులను సంహరింప జేయువాడు.
27) శివ:
శాశ్వతుడు.
28) స్థాణు:
స్థిరమైనవాడు.
29) భూతాది: -
భూతములకు ఆదికారణమైన వాడు.
30) అవ్యయనిధి: -
నశించని ఐశ్వర్యము గల వాడు.
31) సంభవ: -
వివిధ అవతారములను ఎత్తినవాడు.
32) భావన: -
సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
33) భర్తా: -
సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
34) ప్రభవ: -
పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
35) ప్రభు: -
సర్వశక్తి సమన్వితమైనవాడు.
36) ఈశ్వర: -
ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 4 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*4. Sarvaḥ śarvaḥ śivaḥ sthāṇurbhūtādirnidhiravyayaḥ |*
*saṁbhavō bhāvanō bhartā prabhavaḥ prabhurīśvaraḥ || 4 ||*
25) Sarwa –
The Lord Who is Everything
26) Sharva –
The Lord Who Destroys Everything When the Deluge comes
27) Shiva –
The Lord Who is Eternally Pure
28) Sthanu –
The Immovable
29) Bhootadi –
The Lord From Whom All the Beings Evolved
30) Nidhiravyaya –
The Imperishable Treasure
31) Sambhava –
The One Who is All that Happens
32) Bhavana –
The Lord Who Gives Everything to His Devotees
33) Bharta –
The Lord Who Governs the Entire Living World
34) Prabhava –
The Lord in Whom All Things were Born
35) Prabhu –
The Almighty Lord
36) Ishwara –
The Lord Who Controls and Rules All Beings
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 23 🌹*
✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌟. 7.ప్లేన్స్(తలాలు)-చైతన్య ఉన్నత లోకాలు - 2 🌟*
🌟. *మూడవ చైతన్య తలం (3rd Plane)*🌟
💠. *మనోమయ తలం :* దీనిని *"సువర్లోకం (మెంటల్ ప్లేన్)"* అంటారు. ఇది మూడవ తలం. ఇది మనోమయకోశంతో మణిపూరక చక్రంతో అనుసంధానం అయి ఉంటుంది. ఇక్కడ చైతన్యం మానవులుగా, జంతువులుగా జన్మలు తీసుకోవడం జరిగింది. దీనిని *'వాస్తవిక ప్రపంచం'* అంటారు. ఇక్కడ మనుషులు ఇతర లైఫ్ ఫామ్స్ కలిసి జీవించడం జరుగుతుంది.
💫. ఈ తలం ఎమోషన్స్, కోరికలు మరి అభిరుచి మొదలైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మూడవ చైతన్య తలం యొక్క శక్తి ద్వారా మన శరీరంలో ప్రొటీన్స్ ని తయారు చేసుకుంటుంది. ప్రొటీన్ ద్వారా అణువులు, కార్బన్ ఆధారిత శరీర నిర్మాణం తయారవుతాయి. ప్రొటీన్ అనేది శరీరానికి అందకపోతే శరీరంలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది, లేదా పోషక లోపం జరుగుతుంది. ఈ మూడవ చైతన్య తలం నుండి మన DNA లోనికి భౌతిక వాస్తవాలను సృష్టించడం, పోషణ అనే కోడింగ్ లభిస్తుంది. ఇక్కడ DNAలో ఉన్న కోడింగ్ *"సంకల్పశక్తి."* ఇక్కడ స్లోగన్ ఏమిటి అంటే *"కోరుకో, ఇష్టపడు, అవసరాన్ని తీర్చుకో"* అంటుంది.
🌟. *4. నాలుగవ చైతన్య తలం(4th Plane)*🌟
💠. *బుద్ధి తలం:* దీనిని *"మహర్లోకం (బుద్ధిక్ ప్లేన్)"* అంటారు. ఇది 4వ తలం. ఇది విజ్ఞానమయ కోశంతోనూ, అనాహత చక్రంతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది స్పిరిట్ వరల్డ్(spirit world) . ఇక్కడికి చనిపోయిన ఆత్మలు వెళతాయి.
4వ తలం నుండి మనకు DNA ద్వారా వినికిడి, రుచి, స్పర్శ, అనుభూతులు(feelings) అనే జ్ఞానేంద్రియాల జ్ఞానం పొందుతున్నాం.ఈ తలం నుండి శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. వీటివల్ల శరీరానికి శక్తి వస్తుంది. అణువులోనికి ఆత్మశక్తి ఫీలింగ్స్ ద్వారా DNA లో కోడింగ్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. మన DNA లో ఉన్న కోడింగ్ కరుణతో కూడిన ప్రేమ.
🌟. *5. ఐదవ చైతన్య తలం(5th Plane)*🌟
💠. *ఆత్మ తలం:* దీనిని *"జనాలోకం (స్పిరిచువల్ ప్లేన్)"* అంటారు. ఇది5 తలం. ఇది ఆనందమయ కోశంతోనూ, విశుద్ధచక్రం తోనూ కనెక్ట్ అయి ఉంటుంది.
5వ తలం..ఉన్నత ఆత్మలైన అసెండెడ్ మాస్టర్స్, ఎన్ లైటెన్డ్ బీయింగ్స్, ఏంజిల్స్ మన యొక్క స్పిరిట్ గైడ్స్, మన యొక్క స్పిరిచువల్ ఫాదర్, మదర్ ఇక్కడే ఉంటారు. Eg :- లార్డ్ శివ, బుద్ధ, గణేష్, జీసస్, మహమ్మద్, కృష్ణ, రామ.. మొదలైనవారు ఉండే తలం ఇది.
5వ తలం నుండి మనకు లిపిడ్స్, ఫ్యాటీయాసిడ్స్, నాచురల్ ఆయిల్స్, సీడ్స్, నట్స్ ( బాదం, జీడిపప్పు, పిస్తా మొదలైనవి) లభిస్తాయి. వీటి ద్వారా మన భౌతికదేహం కొవ్వు పదార్థాలను తయారు చేసుకుంటుంది. వీటి లోపం వల్ల శరీరంలో *" hormonal imbalance"* వస్తుంది(హార్మోన్స్ తగ్గుతాయి).5 వ చైతన్య తలం నుండి వచ్చే ఆహారం ద్వారా మన DNA లో ఉన్న స్పిరిచువల్ బ్యాలెన్స్ అనే కోడింగ్ డెవలప్ చేయబడుతుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 167 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 14. The ‘I am’ is the permanent link in the succession of events called life, be at the link ‘I am’ only and go beyond it. 🌻*
Conception, birth and infancy, these are the beginnings of your being where the ‘I am’ lies dormant. Then is the spontaneous appearance of the non-verbal feeling ‘I am’ around say three years of age.
On this foundation of the knowledge ‘I am’ is built a large structure of words, ideas and concepts and very soon it is ‘I am so and so’ and so forth.
The pure ‘I am’ is contaminated and it piles on right from childhood to old age, but in all the succession of events, the ‘I am’ lies at the base and has always been there.
The ‘I am’ is an unbroken link throughout your life, so come back to it, abide there and try to transcend it, for there lies your True being.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 45 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 9 🌻*
మనకి ఉద్వేగం కలిగేటటువంటి అంశాలు ఏమేమిటీ అంటే ధనం, గృహం, ఆరామం, క్షేత్రం, సంపదలు, అనిత్యమైనటువంటి ద్వంద్వానుభూతులు. ఏ ఏ అంశములందు మీకు ఆవేశం కలుగుతూ వుందో చక్కగా గమనించు. ఆవేశం ఎందువల్ల కలిగింది, నీకు సంగత్వ దోషం వుండబట్టి కలిగింది లేకపోతే కలుగదు.
సంగత్వ దోషం ఎందువల్ల వుంది? ఆసక్తి వుంది కాబట్టి. ఆసక్తి ఎందువల్ల వుందీ అంటే దాని వల్ల నీకు సుఖమో, దుఃఖాన్ని దూరం చేసుకోవడమో, కొత్త సుఖాన్ని పొందుతాననే భ్రాంతి వుంది కాబట్టి. ఆ భ్రాంతి ఎందుకుంది? నీకు సుఖాపేక్షయందు ఆసక్తి వుంది కాబట్టి. ఎల్లప్పుడూ సుఖంగా వుండాలనే బలీయమైన జీవ భ్రాంతి వుంది కాబట్టి.
ఆ జీవ భ్రాంతి ఎందుకుందీ? శరీరమే నేననేటటువంటి బలమైన పునాది అభిమానము శరీరమునందు ‘దేహాభిమానమే నేను’ అనేటటువంటి బలమైన అభిమానం నీలో వుంది కాబట్టి ఆ యా అంశములను స్పృశించినప్పుడల్లా నీకు ఆవేశం కలుగుతుంది. తప్పదు. ఆ ఆవేశం కలిగిన ప్రతిఒక్కరూ కూడా ఈ ఆత్మానుభూతిని పొందజాలరు.
కారణమేమిటి అంటే నీ అంతఃకరణము - మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటియందు ఆసక్తమై సంగత్వ దోషాన్ని నిరంతరాయంగా పొందుతూ వుంటుంది. మీ ప్రతిఒక్కరి స్వభావంలో గ్రహించండి -- మీరు ఇక్కడ చెప్పినటువంటి అంశాలలో ఏదో ఒక అంశం మీద మీరు తప్పక స్పందిస్తారు. స్పందించకుండా వుండలేరు. సమస్యలేదు అందులో. ఆవేశాన్ని పొందుతారు తప్పక. ఆ ఆవేశాన్ని పొందితే ఆ రకమైనటువంటి సంగత్వ దోషం, మాలిన్యం మీలో ఏర్పడక తప్పదు.
వీటియందు ఎవరైతే అసంగముగా, నిరాసక్తముగా వైరాగ్యముతో విషయ ప్రభావం లేకుండా నిశ్చలముగా, గంభీరముతోటి నిమిత్తమాత్రంగా, సాక్షిగా, ఎవరైతే వుంటారో వారు మాత్రమే ఆత్మజ్ఞానమును పొందుటకు అధికారులు.
ఇంకేమి చెప్తున్నారు? “కామ్య కర్మలవలన కలుగు ఫలము ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును” . మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్యక కర్మలు. అంటే అర్ధమేమిటీ? ఏదో ఒక కోరిక చేత ప్రేరేపించబడునవి. ఫలము చేత ప్రేరేపించబడునవి అని కర్మలు ద్వివిధంబులు.
కర్మ మనము చేసేటప్పుడు ప్రారబ్ధ కర్మ అయినప్పటికీ కూడా ఆ ప్రారబ్ధ కర్మ భాగంలో రెండుంటాయి. కోరిక ఫలము. ఈ రెండింటి చేత ప్రేరితమవుతూ చేయబడినటువంటి సమస్తమూ కూడా కామ్యక కర్మే.
భారతదేశంలో సనాతన ధర్మంలో బోధించ బోధించినది అంతా కూడా మానవులు కర్తవ్య కర్మను ఆచరించ వలనే గానీ అభిమాన పూరితమైనటువంటి విశేష కర్మని ఆచరించరాదు.
విశేషమైన ధనం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి గృహం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి రూప లావణ్యవతి అయిన భార్య ప్రాప్తిస్తుంది లేక భర్త ప్రాప్తిస్తాడు. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం జరుగుతుంది.
విశేషమైనటువంటి శారీరిక బలం లభిస్తుంది. విశేషమైనటువంటి విద్యాబలం లభిస్తుంది. విశేషమైన పాండిత్యం లభిస్తుంది. విశేషమైన శాస్త్ర జ్ఞానం లభిస్తుంది. విశేషమైనటువంటి బుద్ధిబలం లభిస్తుంది.విశేషమైనటువంటి స్వర్గ సుఖం లభిస్తుంది.
విశేషమైనటువంటి... ఈ రకంగా ఎన్ని విశేషాలు చెప్పుకుంటూ పోతే అన్ని విశేషములు మన జీవితమంతా పరుచుకునివుంటాయి. విశేషమైన సుఖం అనమాట దాంట్లో. అదొస్తే చాలండి.
నేను లంకంత ఇల్లు కట్టుకుంటే సుఖంగా వుంటాను. తరువాత లంకేశ్వరుడు ఏమయ్యాడు? ప్రతివాడూ ఏమనుకుంటూ వుంటాడంటే లంకంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడు. తక్కువేమీ కట్టుకోవాలి అనుకోడు. వాడి ఆలోచనంతా ఎప్పుడూ అంతే.
కాని లంకేశ్వరుడు ఏమైపోయాడనే అంశాన్ని మాత్రం ఆలోచించడు. ఎందుకనిటా? అప్పుడు ఆ రకమైనటువంటి అభిమానానికి లోనయ్యావుగా. అట్లగే ప్రతివాడూ ఏమనుకుంటాడూ?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 22. గీతోపనిషత్తు - కర్మ సూత్రము - మనము చేయు పనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 48, 49 📚*
*చేయు పనుల ద్వారా మనలను మనమే బంధించుకొనుట
ఏమి తెలివి? తెలివైన వాడిననుకొనువాడు కూడ తన తెలివితోనే తన జీవితమును చిక్కుపోచుకొను చున్నాడు కదా! వీరు కొరమాలిన తెలివికలవారే కాని, నిజమైన తెలివిగలవారు కారు.*
*యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |*
*సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48*
*దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ |*
*బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 49*
ఒక పని చేయునప్పుడు, దాని నుండి పుట్టు పనులను, చిక్కులను, కష్ట-నష్టములను పూర్తిగ బేరీజు వేసుకొనవలెను. ప్రస్తుతమునకు సరలికర్యముగ నున్నదని, లాభము కలుగుచున్నదని, జయము చేకూరునని, చేయుపనులు అటుపై వికించగలవు.
*పెద్దలు యిచ్చిన నానుడిలో ముఖ్యమైన దేమనగా - ''పాపము చేయు నపుడు చమ్మగ నుండును. ఫలితము లనుభవించునపుడు చేదుగా నుండును.''*
కరుడుకట్టిన స్వార్థముతో తనకు లాభించునని ప్రతి మానవుడు దాని తరంగముల ప్రభావము తెలియక ఉరుకులు పరుగులు వేయుచూ యితరులను దోచుకొనుచున్నాడు. మానవుడు రాక్షసుడై హద్దూ-పద్దూ లేక భూమి సంపదను, వృక్ష సంపదను, జంతు సంపదను దోచుకొనుచున్నాడు.
ఎక్కువ దిగుబడికై వృక్షములు మరియు జంతువుల జన్యువులను కూడ రసాయనక చర్యలతో ఒత్తి కలిగించుచున్నాడు. ఇది అంతయూ తనయొక్క మేలునకే అనుకొని చేయుచున్నాడు. చేయు పనులనుండి పుట్టబోవు మహత్తర మైన విపత్తులను గమనించుటయే లేదు.
పంచభూతముల సమన్వయమును కూడ భంగపరచుటకు సిద్దపడిన మానవుడు, ఈనాడు తాను చేసిన పనికి కలుగు ఫలిత మెట్లుండునోనని భయ భ్రాంతుడై జీవించుచున్నాడు.
మంచుపర్వతములు కరుగునని, సముద్రములు పొంగునని, అగ్నిపర్వతములు బ్రద్దలగునని, అనివార్యమైన రోగములు ప్రబలునని, జీవనపు అల్లిక చెడిపోవు చున్నదని దుఃఖ పడుచున్న మానవుడు ఈ విపత్కర పరిస్థితికి తానే కారణమని తెలుసుకొనవలెను.
తన స్వార్థచింతన తగ్గించు కొని పరహితము పెంచుకొనినచో జీవన విధానమున మార్పు ఏర్పడి పరిష్కారము లభింప గలదు.
ఈనాటి మానవుని తెలివి ఆత్మహత్య గావించుకొను వాని తెలివిది. శాస్త్ర విజ్ఞానము పెరుగుదల, సంస్కారముల
తరుగుదల కారణముగ అతి వేగముగ ప్రమాదము వైపు పరుగిడుచున్నాడు.
*మనము చేయుపనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.*
ప్రతి జీవియు తన జీవన నిర్మాణ పథంమున ఎప్పటికప్పుడు
జీవితముపై తన స్వామిత్వమును పరికించుచుండవలెను. అట్లు కానిచో వృత్తి, కుటుంబము, సంఘము, అతనిని బంధించగలవు.
జీవితము ముందుకు సాగుచున్న కొలది, బాధ్యతలు పెరిగిననూ మనసున బంధము పెరుగరాదు. బంధములు పెంచుకొను
మార్గము చావుతెలివి.
ఉదా : మంచి గదిని నిర్మాణము చేసుకొను వాడు తన చుట్టునూ ఇటుకపై ఇటుక పేర్చుకొనుచూ నలువైపులా గోడను నిర్మించుకొనినచో బయటకు పోవు దారిలేక తను నిర్మించిన గదియే నిర్గమశాన్యమగు దుర్గమై తాను సమాధి చెందుటకు కారణమగును.
ప్రతివ్యక్తియూ ఈనాడు తన పెరుగుదల రూపమున ఈషణ
త్రయమున విపరీతముగ బంధించుకొనుచూ తన గోరీని తానే
నిర్మాణము చేసుకొనుచున్నాడు. అంతియేకాదు, తనంత తెలివిగ యితరులు గోరీలు కట్టుకొన కూడదని పోీపుచూ అందమైన గోరీని నిర్మాణము చేసుకొను చున్నాడు. జీవితమును ఒక కారాగారముగ నిర్మించుకొనుటగా కాక, రాకపోకలు గల ఒక గృహముగ నేర్పాటు చేసుకొనుటకు వలసిన సూత్రమునే భగవానుడు-
''మాకర్మ ఫలహేతుర్భూ'' అని హెచ్చరించి యున్నాడు. చిన్నతనముననే ఈ ఎరుక కలిగినచో జీవిత మానందమయ మగుటకు అవకాశముండును. తిమింగలముచే పట్టబడిన తరువాత తెలిసినచో బంధమోచనము కష్టతరము.
ఎవరైననూ వచ్చి రక్షించవలసినదే కాని, తనను తాను రక్షించుకొనలేు. అట్టి వానికి గజేంద్రుడు చేసిన ప్రార్థనయే శరణ్యము.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 2 / Vishnu Sahasranama Contemplation - 2 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥
Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥
2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ
ఓం విష్ణవే నమః | ॐ विष्णवे नमः | OM Viṣṇavē namaḥ
విశ్వ శబ్దముచే చెప్పబడదగు తత్వము ఏది అన్న ప్రశ్నకు 'విష్ణుః' అన్నదానిని సమాధానముగా చెబుతారు. వేవేష్టి - వ్యాప్నోతి అని విష్ణు శబ్ద వ్యుత్పత్తి. ప్రవేశించు - అను అర్థమునిచ్చు 'విశ్' (విశ) ధాతువునుండి 'ను' (క్) ప్రత్యయము చేరుటచే 'విష్ణు' అగుననియు చెప్పదగును.
:: విష్ణు పురాణం - తృతీయ అంశము, మొదటి అధ్యాయము ::
యస్మాద్విష్టమిదం విశ్వం యస్య శక్త్యా మహాత్మనః ।
తస్మాత్స ప్రోచ్యతే విష్ణుర్విశేర్ధాతోః ప్రవేశనాత్ ॥ 45 ॥
ఈ సర్వమును ఆ మహాత్ముని శక్తిచే ప్రవేశించబడి యుండుటచే - ప్రవేశము అను అర్థమును ఇచ్చు 'విశ' ధాతువునుండి ఏర్పడిన 'విష్ణు' శబ్దముచే అతడు చెప్పబడుచున్నాడు.
ప్రవేశయతి స్వశక్తిం ఇమం ప్రపంచమ్ స్వశక్తిని ఈ ప్రపంచమున ప్రవేశింపజేయుచున్నాడు. ఆ విషయమును సమర్థించునదిగా ఋగ్వేదమునందు...
తము స్తోతారః పూర్వ్యమ్ యథావిద
ఋతస్య గర్భమ్ జనుషా పిపర్తన ।
ఆఽస్య జానన్తో నామ చిద్వివక్తన
మహస్తే విష్ణో సుమతిమ్ భజామహే ॥
(ఋగ్వే. 2-2-26) ఈ ఋక్కునకు అర్థము: అత్యంత ప్రాచీనుడగు అతనినే స్తుతించుచున్నవారగుచు సత్యమునకు సంబంధించిన సారభూతతత్వమును ఎట్లు ఉన్న దానిని అట్లే ఎరిగిన వారగుచు జన్మతో సమాప్తినందిన వారు అగుడు (లేదా జన్మరాహిత్యమునొందుడు). (తత్వమును) ఎరిగినవారగుచు సమగ్రముగా (లేదా ఎల్లప్పుడును) ఈతని (విష్ణుని) నామమును కూడ పలుకుచునేయుండుడు. ఓ విష్ణు! ఇతరులు నీ నామమును ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా శోభనమగు నీ తేజమును సేవింతుము.
ఈ మొదలగు శ్రుతులచే విష్ణుని నామ సంకీర్తనము సమ్యగ్‌ఙ్ఞాన ప్రాప్తికై (సరియగు తత్వ ఙ్ఞానము లభించుటకై) సాధనముగా చెప్పబడినది.
వ్యాసుడిని భాగవత రచన చేయమని ప్రేరణనందిస్తున్న నారదులవారు చెప్పిన మాటలు - పోతన భాగవతము.
సీ. విష్ణుండు విశ్వంబు; విష్ణుని కంటెను వేఱేమియును లేదు; విశ్వమునకు
భవవృద్ధి లయము లా పరమేశుచే నగు; నీ వెరుంగుదు గాదె నీ ముఖమున
నెఱిఁగింపఁ బడ్డది యేక దేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము; రమణతో హరిపరాక్రమము లెల్ల.
ఆ. వినుతిసేయు మీవు వినికియుఁజదువును, దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ, గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.
ఈ విశ్వమంతా విష్ణుమయం. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె అన్యమైనది ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, సంహారాలు ఎర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు! నీకు తెలియనిది ఏమున్నది? నీవే ఒక చోట ఒక విషయాన్ని చెప్పి ఉన్నావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్తుతించు. మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన కమలనాభుని స్తుతించటమే.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 2 🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻. 1. Viṣṇuḥ :*
When the question arises who is it that has become Viśvam, the All, the answer is given that it is Viṣṇuḥ. As he pervades everything, vēvēṣṭi, He is called Viṣṇu. The term Viṣṇu is derived from the root viś (indicating presence everywhere) combined with the suffix nuk. So the Viṣṇu Purāṇa says:
Viṣṇu Purāṇa
Yasmādviṣṭamidaṃ viśvaṃ yasya śaktyā mahātmanaḥ,
Tasmātsa procyate viṣṇurviśerdhātoḥ praveśanāt. (3.1.45)
The power of that Supreme Being has entered within the Universe. The root Viś means 'enter into'.
The following R̥igvēdic mantra (2.2.26) also advocates the adoration of Viṣṇu for the attainment of spiritual enlightenment:
Tamu stōtāraḥ pūrvyam yathāvida
R̥itasya garbham januṣā pipartana,
Ā’sya jānantō nāma cidvivaktana
Mahastē Viṣṇō sumatim bhajāmahē.
It means: O hymnists! Put an end to your recurring births by attaining the real knowledge of that Ancient Being who is eternal and true. Understanding these names Viṣṇu, repeat them always. Let other people repeat or not repeat. Thy holy names; we, O Viṣṇu, shall adore Thy charming effulgence.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment