📚. ప్రసాద్ భరద్వాజ
विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥
Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥
1. విశ్వమ్, विश्वम्, Viśvam 😘
ఓం విశ్వస్మై నమః | ॐ विश्वस्मै नमः | OM viśvasmai namaḥ
'యతః సర్వాణి భూతాని' (విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లో. 11) అనునది మొదలుగా ఉత్పత్తి, స్థితి, లయ కారణుడగు బ్రహ్మము 'ఏకదైవతము'గా చెప్పబడియుండుటచే మొట్టమొదట అట్టి ఉభయ విధమగు బ్రహ్మమును 'విశ్వ' శబ్ధముచేత చెప్పబడుచున్నది. విశ్వమునకు, జగత్తునకు కారణము అగుటచేత 'బ్రహ్మము' 'విశ్వమ్' అని చెప్పబడుచున్నది. ఇది మొదటి నిర్వచనము.
లేదా పరమార్థ (సత్య) స్థితిలో ఈ విశ్వము పరమ పురుషుని కంటే భిన్నము కాదు. అందుచే బ్రహ్మతత్వము 'విశ్వం' అని చెప్పబడుచున్నది.
లేదా 'విశతి' (ప్రవేశించుచున్నాడు) కావున బ్రహ్మతత్వము విశ్వమనబడును. 'తత్సృష్ట్వా తదేవాఽనుప్రావిశత' (తైత్తి 2-6) అనగా 'దానిని (విశ్వమును) సృజించి దానినే అనుప్రవేశించెను' అను శ్రుతి వచనము దీనికి ప్రామాణము.
ఇవీ కాక సంహార (ప్రళయ) కాలమునందు సర్వభూతములూ ఇతనియందు ప్రవేశించుచున్నవి అను అర్థముచే 'విశంతి అస్మిన్' అను వ్యుత్పత్తిచే బ్రహ్మము 'విశ్వం' అనబడును. 'యత్ప్రయన్త్యభిసంవిశన్తి' (తైత్తి 3-1) 'ఈ భూతములు దేహములను వదలిపోవుచు దేనిని ప్రవేశించుచున్నవో' అను శ్రుతి దీనికి ప్రామాణము.
ఇట్లు తాను నిర్మించిన కార్యమేయగు సకల జగత్తును ఈతడు ప్రవేశించుచున్నాడు. ఇతనియందు సకలమును ప్రవేశించుచున్నది అను రెండు విధములచేతను బ్రహ్మము 'విశ్వమ్' అను శబ్దముచే చెప్పదగియున్నది.
'విశ్వమ్' అనగా ఓంకారము. ఓంకారముచే చెప్పబడువాడు కావున బ్రహ్మతత్వము కూడ 'విశ్వమ్' అనబడును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Vishnu Sahasranama Contemplation - 1 🌹
📚. Prasad Bharadwaj
🌻. 1. Viswam 😘
The All. He whom the Upaniṣads indicate by the passage 'Yataḥ sarvāṇi bhūtāni' as the cause of the generation, sustenance and dissolution of the universe. He is Brahman, the Non-dual Supreme Being. The term Viśvam meaning 'the all or the whole manifested universe' indicates Him, both in relation to his adjunct of the universe and without it. As the effect can indicate the cause, He is called by the name 'Viśvam' - the Universe of manifestation having its source in Him and thus forming His effect.
Or alternatively, as the universe has no existence apart from Him, He can be called Viśvam, the Universe.
According to the root meaning also Viśvam can mean Brahman or the Supreme Being. Its root viśati means enter or interpenetrate. Brahman interpenetrates everything, according to the Upaniṣadic passage: Tatsr̥iṣṭˈvā tadēvā’nuprāviśat (Taittiriya Upaniṣad 2-6). Also Yatprayantyabhisaṃviśanti - that into which all beings enter at the time of dissolution (Taittiriya Upaniṣad 3-1). Thus Brahman enters into its effect, the Universe and the Universe enters or dissolves in Him. Thus in both these senses He is Viśvam.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #Vishnusahasranamam
03.Sep.2020
No comments:
Post a Comment