🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 101 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పిప్పలాద మహర్షి - 3 🌻
14. అయితే మొత్తం సృష్టిలో ధర్మదేవత ఉంది. సృష్టిలో, బ్రహ్మలో ధర్మముంది, ఇంద్రుడిలో ధర్మముంది. సృష్టిలో స్ధర్మమూ ఉంది. అన్నింటిలోనూ ఉంది.
15. హింసచేసి బ్రతకటం ధర్మం అనే రాక్షసులున్నారు. వాళ్ళ స్వభావం అది. అయితే వాళ్ళు అధర్మాన్ని వదిలిపెట్టి క్షేమాన్ని పొందటానికి, దేవతలు కావటానికి మార్గాలున్నాయి.
16. ఈ ప్రకారంగా ధర్మము, అధర్మము రెండుకూడా సృష్టి అంతా వ్యాపించి, సృష్టిలోనే ఉన్నాయి. ఈ సృష్టిలో ఉండేటటువంటి పోషకపదార్థము – సుఖాన్నిచ్చేది, మంచి భవిష్యత్తునిచ్చేది, క్షేమాన్నిచ్చేది అయిన ధర్మమనే ఒక లక్షణం-దేవతాస్వరూపం-సృష్టిలోకి వచ్చింది.
17. ఒకసారి కబంధఋషి “దేవా! ప్రజాసంసృష్టి ఎలా జరుతున్నది?” అని అడిగాడు.
పిప్పలాదుడు, “సృష్టి చేయబడవలసినటువంటి జీవుల యొక్క అదృష్టరేక ఎలా ఉందో, పూర్వకర్మ ఎలాఉందో ఆ ప్రకారంగానే పునఃసృష్టి జరగాలి కదా! దానికొక నిమిత్తమైన శక్తి ఉండాలి కదా! కర్మానుసారంగా మళ్ళీ దేహమో, పునఃసృష్టో జరగాలి. సృష్టిలో అది శాసనం. కానీ నిమిత్తమాత్రంగా సృష్టిచేసేవాడు ఒకడుండాలి కదా! ఆ చేసేవాడే బ్రహ్మదేవుడు.
18. అయితే ఆయన తన ఇష్టానుసారంగా సృష్టి చేయలేడు. జీవులకు కర్మాధీనమైనటువంటి ఏ శరీరం ఎక్కద ఏ లోకంలో ఎలా పుట్టాలో ఆ ప్రకారంగా నడిపించేవాడుమాత్రమే అతడు.
19. “ఒకసారి బ్రహ్మ ఒక మిథునాన్ని సృష్టించాడు. ఆ మిథునంపేరు ‘రయిప్రాణము’. ‘రయి’ అంటే చంద్రుడు, ‘ప్రాణము’ అంటే సూర్యుడు. రయి అంటే మనసు అనికూడా అర్థం. మనసు అంటే ఆత్మ అనీ అర్థం. ప్రాణం అన్నాడు దానిని. వాళ్ళిద్దరివలనే సృష్టిజరుగుతుంది.
20. ఈ సృష్టిక్రమము అనేకమంది మహర్షులు అనేకమందికి చెప్పారు. ఆ సూర్యుడే వైశ్వానరరూపుడై సర్వవ్యాపకుడు, విశ్వరూపుడు అవుతున్నాడు. ప్రాణాగ్నులన్నీ అతడివలననే ఉదయిస్తున్నవి” అని బోధించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
03.Sep.2020
No comments:
Post a Comment