శివగీత - 𝟻̷𝟷̷ / 𝚃̷𝚑̷𝚎̷ 𝚂̷𝚒̷𝚟̷𝚊̷-𝙶̷𝚒̷𝚝̷𝚊̷ - 𝟻̷𝟷̷

🌹.   శివగీత - 𝟻̷𝟷̷ / 𝚃̷𝚑̷𝚎̷ 𝚂̷𝚒̷𝚟̷𝚊̷-𝙶̷𝚒̷𝚝̷𝚊̷ - 𝟻̷𝟷̷  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము


🌻. విశ్వరూప సందర్శన యోగము - 5 🌻

తేజో భి రా పూర్య జగత్స మగ్రం
ప్రకాశ మానః కురుషే ప్రకాశమ్,

వినా ప్రకాశం తవ దేవదేవ
న దృశ్యతే విశ్వ మిదం క్షణేన 26

అల్పాశ్రయో నైవ బృహంత మర్ధం
ధత్తే ణురేకో న హి వింధ్య శైలమ్,

త్వద్వక్త్ర మాత్రే జగ దేత దస్తిత్వన్యాయ
యై వేతి చ నిశ్చితమ్ 27

రజ్జౌ భుజంగో భయదో యథైవ
న జాయతే నాస్తి న చైతి నాశమ్

త్వన్మాయయా కేవల మాత్త రూపం
తథైవ విశ్వం త్వయి నీలకంట 28

విచార్యమాణే తవ యచ్చ రీర
మధారభావం జగతా ముపైతి

తద ప్యవశ్యం మదవిద్యై న
పూర్ణ శ్చిదానంద మయోయత స్త్వమ్ 29

పూజేష్ట పూర్తా దివర క్రియాణాం
భోక్తు: ఫలం యచ్చ సి శస్త మేవ,

మృషైత దేవం వచనం పురారే
త్వత్తోస్తీ భిన్నం న చ కించి దేవ 30

సమస్త ప్రపంచమును నీ ప్రకాశముతో నింపి ప్రకాశవంతముగా చేయుచున్నావు.

ఓ దేవదేవా ! మహాదేవా! నీ ప్రకాశమే లేనియెడల ఒక క్షణమైనను ఈ జగత్తు అగుపడదు కదా! ఒక చిన్న వస్తువు గొప్ప పదార్ధమును మోయలేదు కదా! కాని నీ నోటిలోన ప్రపంచ మంతయును ఇమిడి యున్నది. ఇదంతయును నీ యొక్క మాయచేతనే యని నేను విశ్వశించుచున్నాను.

ఓయీ! నీలకంటా ! త్రాటియందు సర్ప భ్రాంతివలే కనబడి ఏ రీతిగా భయమును కల్పించుచున్నదో అట్లే కేవలము ఆత్మ స్వరూపుండైన నీలోనే విశ్వమంతయు నీ మాయతో కల్పితమై జనముగాని, వినాశముగాని పొందనప్పటికీ భయమును గొల్పుచున్నది.

బాగుగా పరిశీలించగా, నీ యొక్క శరీరమే ఈ ప్రపంచమునకు ఆధారభూతమైనదిగా ఉన్నాడని చెప్పినచో యది అవస్యముగాన అజ్ఞానమనక తప్పదు. నీవు సర్వాంతర్యామివి చిదానంద స్వరూపుండవు.

ఓయీ! త్రిపుర సంహారకా! ఇష్టా పూర్ద్యాది శ్రేష్టమైన కర్మలను చేయువారికి మహాత్వపూర్ణమైన ఫలము నొసగుచున్నావను వచనము కూడా అబద్దమైనదే, ఏలయనగా నీకంటే, నుభిన్నమైనది యే మాత్రములేదు. అంతానీ స్వరూపమే కదా!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  𝚃̷𝚑̷𝚎̷ 𝚂̷𝚒̷𝚟̷𝚊̷-𝙶̷𝚒̷𝚝̷𝚊̷ - 𝟻̷𝟷̷  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj


Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 5
🌻

It's you alone under whose brilliant light shines these all worlds. O ancient supreme lord (Devadideva)!,

O great lord (Mahadeva)! In absence of your light even for a split second these universes wouldn't be visible!

A small particle can't support a huge object, however inside your mouth i see that entire creation is supported. All this is your own Maya.

O blue necked one (Neelakantha)!, as like as snake reside in ant hill, similarly in you who are only Atmaswaroopa, all the universes takes birth under your supreme power of illusion.

With an in depth analysis If i say that your body is the foundation of this entire cosmos, then it would be my ignorance only. You are the indweller of everyone. you are of the form of consciousness and bliss.

O destroyer of three cities (Tripurari)! What is usually heard like you bestow good results to those who please you through great tasks; but this also has become totally false now since there is nothing that is not you (or different from you) O lord!

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

03.Sep.2020

No comments:

Post a Comment