🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 85 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. అథ పవిత్రారోపణ విధానమ్ - 5 🌻
వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నశ్చానిరుద్దకః. 43
అగ్న్యాదౌ శ్రీధృతిరతికాన్తయో మూర్తయో హరేః | శఙ్ఖచక్రగదాపద్మమగ్న్యాదౌ పూర్వకాదికమ్. 44
శార్‌జ్గం చ ముసలం ఖడ్గం వనమాలాం చ తద్బహిః | ఇన్ద్రాద్యాశ్చ తథానన్తో నైరృత్యాం వరుణసత్తః. 45
బ్రహ్మేన్ద్రేశానయోర్మధ్యే అస్త్రావరణకం బహిః | ఐరావతస్తతశ్ఛాగో మహిషో వానరో ఝషః. 46
మృగః శశో7థ వృషభః కూర్మో హంసస్తతో బహిః |
పృశ్నిగర్భః కుముదాద్యా ద్వారపాలా ద్వయం ద్వయమ్. 47
పూర్వాద్యుత్త రద్వారాన్తం హరిం నత్వా బలిం బహి ః | విష్ణపార్షదేభ్యో నమో బలిపీఠే బలిం దదేత్. 48
విశ్వాయ విష్వక్సేనాత్మనే ఈశానకే యజేత్ | దేవస్య దక్షిణ హస్తే రక్షాసూత్రం చ బన్ధయేత్. 49
సంవత్సరకృతార్చాయాః సంపూర్ణఫలదాయినే | పవిత్రారోహణాయేదం కౌస్తుభం ధారయ ఓం నమః. 50
ఉపవాసాదినియమం కుర్యాద్వై దేవసన్నిధౌ | ఉపవాసాదినియతో దేవం సంతోషయామ్యహమ్. 51
కామక్రోధాదయః సర్వే మా మే తిష్ఠన్తు సర్వధా | అద్యప్రభృతి దేవేశ యావద్వై శేషికం దినమ్. 52
యజమానో హ్యశక్త శ్చే త్కుర్యాన్నక్తాదికమ్ వ్రతీ | హుత్వావిసర్జయేత్ స్తుత్వా శ్రీకరం నిత్యపూజనమ్. 53
ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయనమః.
ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే పవిత్రారోహణ శ్రీదరనినత్యపూజావిధానం నామ త్రయస్త్రింశో7ధ్యాయః.
వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని నాలుగుమూర్తులు. అగ్నేయాదివిదిశలయందు క్రమముగ శ్రీ, రతి, ధృతి, కాంతలను పూజింపవలెను.
వీరు కూడ శ్రీహరి మూర్తులే. అగ్న్యాదికోణములందు క్రమముగ శంఖ-చక్ర-గదా-పద్మములను పూజింపవలెను. తూర్పు మొదలైన దిక్కులందు శార్‌జ్గ- మసల - ఖడ్గ - వనమాలలను పూజించవలెను.
వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర - అగ్ని-యమ-నిర్బతి- వరుణ-వాయు-కుబేర-ఈశానులను పూజించి నైరృతి పశ్చమదిక్కల మధ్య అనంతుని, తూర్పు-ఈశాన్యదిక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను
వీటి బైట వజ్రము మొదలగు అస్త్రమయఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పలకుల వాహనరూపములగు ఆవరణములను పూజింపవలెను.
తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చెవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను.
వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుడు మొదలగు ద్వారపాలులను పూజింపలెను. తూర్పు మొదలు ఉత్తరము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వారపాంకులను పూజింపవలెను.
పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. ''ఓం విష్ణుపార్షదేభ్యో నమః '' అను మంత్రము నుచ్చరించుచు విష్ణుపీఠముపై వారలకు బలి అర్పింపవలెను.
ఈశానదిక్కునందు ''ఓం విశ్వాయ విష్వక్సేనాయ నమః'' అను మంత్రముచే విష్వక్సేనపూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడిచేతికి రక్షాసూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆ భగవంతునితో ఇట్లు చెప్పవలెను-
''దేవా! ఒక సంత్సరముపాటు నిరంతరము జరుగు మీ పూజయొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుప నున్న పవిత్రారోపణకర్మకొరకై ఈ కౌతుకసూత్రమును ధరింపుము. ఓం నమః''. పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాది నియమములను అవలంబించి ఇట్లు చెప్పవలెను.
''నేను నియమపూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్టదేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేడు మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాదిదోషము లేవియు నా వద్దకు రాకుండు గాక''.
వ్రతమును స్వీకరించిన యజమానుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని పక్షమున నక్తవ్రతము (రాత్రిమాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతునిస్తోత్రము చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను.
భగవంతుని నిత్యపూజ చేసి చో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అనునది మంత్రము.
శ్రీ అగ్ని మహాపురాణమునందు పవిత్రారోపణమున శ్రీధరనిత్యపూజావిధాన మను ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం
03.Sep.2020
No comments:
Post a Comment