✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 53 54
🌻. 53 . ప్రకాశ(శ్య)తే క్వాపి పాత్రే ॥ 🌻
ఆ భగవత్రేమ అంతటా అన్ని కాలాలలో ప్రకాశించదు. అవసరమైన చోట కాలానుగుణ్యంగా బయటకు వస్తుంది. కాని భక్తుని అంతరంగంలో మాత్రం ఎడతెగకుండా ప్రకాశిస్తూనె ఉంటుంది. అది ఆ భక్తుడికి మాత్రమె తెలుస్తుంది. కాని మాటలలో చెప్పడానికి భాష చాలదు.
🌻 54. గుణ రహితం, కామనారహితం, ప్రతిక్షణ వర్థమానం,
అవిచ్చిన్నం, సూక్ష్మతరం, అనుభవరూపమ్ ॥ 🌻
పరాభక్తిలో సహజమైన ప్రేమ ఉంటుంది. ఇది హృదయానికి సంబంధించింది. మనసుకు సంబంధించినదైతే అది గుణాలతో కూడినది. కనుక మాటలలో వర్ణించగలం. సాధన దశలో ముందుగా మనసుతో ప్రారంభిసాం. మనసుతోనె అభ్యాసం చేస్తాం. అప్పుడా భక్తిని గౌణభక్తి అని అన్నాం.
మనసునుండి విడుదలై హృదయంలోకి చేరేసరికి ఆ భక్తి సహజ సాధన పూర్తయ్యింది. ఇక అది పెరిగేది, తరిగేది కాదు. సహజ మౌతుంది. సిద్ధమైన ప్రమ స్థిరంగా ఉంటుంది. సూక్ష్మతరమైన బుద్దితో గుర్తించబడుతుంది. అది హృదయ పూర్వకమైనది.
ఈ పరాభక్తి ప్రభావం వలన కోరికలు, వాంఛలు మొదలగు గుణ సంబంధమైన వాటినుండి మనసు విడుదలవుతుంది. మనసు తేటపడుతున్న కొద్ది, పరాభక్తి క్రమంగా స్థిరపడె ప్రయత్నం జరుగుతుంది. ప్రతి క్షణం వర్ద్మమానమవుతుంది.
పరాకాష్టలో అది నిరంతరం అలాగే ఉండిపోతుంది. భక్తి అవిచ్చిన్నమై పరాభక్తికి దారితీస్తుంది. భక్తి మనసులో ఉన్నంత సేపు స్థూలంగా ఉంటుంది. హృదయానికి చెరేసరికి సూక్ష్మతరమవుతుంది. తుదకు పరాభక్తిగా పరిణమిస్తుంది.
అప్పుడా పరాభక్తి అతడికి అనుభవైక వెద్యమేగాని, ఆ అనుభవాన్ని మాటలలో చెప్పలెడు. స్ట్రూలరూప అనుభవాన్ని చెప్పగలడు గాని, సూక్ష్మతరమైన దాన్ని చెప్పలెడు. అది అవాజ్బానస గోచరం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
03.Sep.2020
No comments:
Post a Comment