శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 155 / Sri Lalitha Chaitanya Vijnanam - 155


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 155 / Sri Lalitha Chaitanya Vijnanam - 155 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖

🌻155. 'నిరీశ్వరా'🌻

జగత్తునకు శ్రీమాతయే ఈశ్వరి అని భావము. శ్రీమాతను ఈశ్వరి అని సంబోధించుటలో ఈశ్వరుడు- ఈశ్వరి సామ్యమును, సరిసమానత్వమును తెలుపబడుచున్నవి. ఈశ్వరుని పొంది యుండునది గనుక ఆమె ఈశ్వరి. సృష్టి యందు ప్రకృతి లేని పురుషుడు లేడు. పురుషుడు లేని ప్రకృతియును లేదు. పురుష ప్రకృతులు అభేద్యమగు తత్త్వము.

తత్త్వము నుండియే ఇరువురు ఏర్పడినారు. ఒకటి, రెండుగా ఏర్పడినది. రెండుగా లేనపుడు, ఒకటిగా ఉన్నపుడు ఆ తత్త్వమును పురుషుడనుటకును, ప్రకృతి అనుటకును వలను పడదు. పురుషుడు, ప్రకృతి ఇద్దరును తత్త్వము నుండి ఉద్భవించినవారే. రెంటి యందలి తత్త్వము ఒకటే గనుక వారు పరస్పర ఆకర్షితులు. మొదట అర్ధనారీశ్వరులు.

అటుపైన విడిపడిన ప్రకృతి పురుషులు. విడిపడినను ఒకరి యందు మరియొకరి ఆసక్తి కారణముగా చైతన్య ముద్భవించినది. అందుండి సమస్త లోకములు ఉద్భవించినవి. ప్రకృతి గాని, పురుషుడు గాని లేని లోకముండదు. ఉండుటకు వలను పడదు. కావున వారిరువురి మధ్య తారతమ్యము లేదు. అతడు ఈశ్వరుడైనపుడు ఆమె ఈశ్వరి. సృష్టికి వారిరువురును తల్లితండ్రులవంటివారు.

గొప్పతనము, తక్కువతనము, హెచ్చుతగ్గులు అహంకారాది లోకములలో ఉండును గాని గుణాతీతమగు చైతన్యమునకు, తత్త్వమునకు ఉండదు. ఈశ్వరి ఈశ్వరియే. ఆమెకిక ఈశ్వరుడు లేడు. అందువలన ఆమె నిరీశ్వరి. అట్లే ఈశ్వరుడు ఈశ్వరుడే. అతడును నిరీశ్వరుడే.

పై కారణముగనే కైవల్య ప్రాప్తికి ఇరువురును అధిష్టానదైవములైనారు. శ్రీవిద్య, బ్రహ్మ విద్యా మార్గములేర్పడినవి. రెండిటి సమత్వమును సమన్వయించుచు అన్ని లోకములందు జీవించుటకు యోగవిద్య ఏర్పడినది. స్త్రీ పురుష అభేద స్థితి సమత్వము తెలిసినవారే నిజమగు యోగులు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 155 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Nīriśvarā नीरिश्वरा (155) 🌻

Iśvara means superior or master. She does not have a superior. She is the Supreme ruler. One may argue that Śiva is above Her in hierarchy. Śiva has certain well defined acts that include creation of Śaktī out of His prakāśa form, acting as the static partner in creation but Himself not partaking in the acts of creation, sustenance and dissolution. Śiva does not interfere with Her administration (vimarśa form of Śaktī). Hence it is said that She does not have a superior.

Though there are many other interpretations for these nāma-s, this book has taken into account the explanations available to qualify the Brahman. When the qualities of the Brahman are being discussed, it is inappropriate to interpret nāma-s in a way different from what they are intended for.

With this nāma the description of qualities of Her nirguṇa Brahman form ends. Though the Brahman does not have qualities, one could be wondering why Vāc Devi-s mention about the qualities of the Brahman. As said earlier, for a common man, the Brahman can be qualified by negations, as the Brahman cannot be realized by sensory perceptions. Hence prefixes niṣ or nir (negation) is used in all these nāma-s (132-155 except 141).

Knowledge of the Brahman starts with ‘not that’ and ends with ‘I am That’. The first that is negation and second That is affirmation. Any affirmation is possible only if one has comprehensive knowledge of the subject concerned. Nāma-s 156 to 195 discuss about the fruits of worshipping Her formless form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2020

No comments:

Post a Comment