సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 12
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 12 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 12 🍀
తీ వ్రత్ నేమ్ భావే వీణ్ సిద్ధి!
వాయాచి ఉపాధి కరిసీ జనా!!
భావబళే ఆకళే యెద్దవీ నాకళే!
కరతళీ ఆవళే తైసా హరీ!!
పారియాచా రవా మేతా భూమీవరీ!
యత్న పరోపరీ సాధన్ తైసె!!
జ్ఞానదేవ మణే నివృత్తి నిర్గుణ్!
దిధలే సంపూర్ణ మాయ హాతీ!!
భావము:
తీర్థ వ్రతాలు, నేమాలలో భావనలేక పోతే ఫలితాన్ని ఇవ్వవు. అయినా కానీ జనులు వృధా ప్రయాస చేయుచునే ఉన్నారు.
భావ జాలము కలవారు అరచేతిలోని ఉసిరి కాయను పట్టినట్లుగ శ్రీహరిని పట్టివేయగలరు. ఊరకనే లభించడు.
భూమిపై పడిన పాదరసము తీయవలెనన్న ఎంత కష్టమో! ఇతర సాధనాలు అదే విధముగ కష్టము కాగలవు. శ్రీ గురువు నివృత్తినాథులు నిర్గుణ దైవాన్ని సంపూర్ణముగ నా చేతికి ఇచ్చినారని జ్ఞానదేవులు అంటున్నారు.
🌻. నామ సుధ -12 🌻
తీర్థ వ్రతము ఆచార నేమము
భావన లేనిది ఏమి ఫలితము
వ్యర్థ ఉపాదులు వృధా ప్రయాసము
చేస్తున్నావు ప్రతిష్ఠ కోసము
భావబలమున పట్టగలము
భావన లేనిది పట్టజాలము
భావము తోడనే శ్రీహరి లభ్యము
అర చేతిలో ఉసిరిక చందము
భూమిన పడిన పాదరసము
తీయవలెనన్న అతి ప్రయాసము
ఇతర సాధనలు అదే విధము
అయి పోగలవు అనితర సాధ్యము
జ్ఞానదేవులు తెలిపిరి వినుము
నివృత్తినాథుని కృపా ప్రసాదము;
ఒసగిరి దయతో నిర్గుణ దైవము
చేతికి అందెను హరి సంపూర్ణము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment