✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 68 🌻
పృథ్వి పంచకంలో
భూమిలో భూమి - మృత్యువు కదా!
గు: భూమిలో భూమి - మృత్యవు
శి: మృత్యు దేవత అండీ !
భూమిలో జలము - బ్రహ్మ... బ్రహ్మము
బ్రహ్మము అంటే చతుర్ముఖ బ్రహ్మ గారు. సృష్టి చేసేటటువంటి బ్రహ్మ గారు.
భూమిలో అగ్ని - విష్ణువు,
విష్ణువు - ఈయన పోషక కర్త, స్థితి కర్త.
భూమిలో వాయువు - ఇంద్రుడు,
ఇంద్రుడు - ఈయన ఇంద్రియాధిష్ఠాన దేవత.
భూమిలో ఆకాశము - అగ్ని, అగ్ని!
ఇట్లా మొట్టమొదట ప్రాథమికంగా చిట్టచివరి భూపంచకంలో, పృథ్వి పంచకంలో, పృథ్వీ తత్వ పంచకంలో వీళ్ళు ఏర్పడ్డారు. ఇదే ఆఖరుగా ఏర్పడ్డారు. ఇది... అదే ఆకాశ పంచకానికి వచ్చామనుకోండి....
అది జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము
జ్ఞాతకేమో గురుమూర్తి,
మనస్సుకేమో చంద్రుడు, చంద్రుడు!
బుద్ధికి బృహస్పతి, బృహస్పతి!
చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు!
అహంకారమునకు రుద్రుడు.
ఈ రకంగా ఇంద్రియాదిష్ఠాన దేవతలంతా ఏర్పడ్డారు. ఆ చివర ఆకాశ పంచకము. ఈ చివర పృథ్వి పంచకము. మధ్యలో జలపంచకము. జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము. అంతే కదా! జల పంచకములో ఎవరు ఏర్పడ్డారు?
జలములో ఆకాశము - సదాశివుడు,
జలములో వాయువు - ఈశ్వరుడు, ఈశ్వరుడు!
జలములో అగ్ని - రుద్రుడు,
జలములో జలము - విష్ణువు,
జలములో పృథ్వి - బ్రహ్మ.
అది చూడండి. మరలా క్రింద చెప్పిన పేర్లే, అటు ఇటుగా మారినాయి. వాటి వాటి యొక్క స్థితి భేదాన్ని అనుసరించి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, పృథ్వి ఆ తత్త్వముల యొక్క సంయోజనీయత ద్వారా. అయితే, మూలముగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే, పృథ్విలో పృథ్వి, జలములో జలము, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశము. ఇవి చాలా బలవత్తరమైనటువంటివి. ఎందుకంటే వాటిలో అర్థభాగములు ఉన్నాయి కాబట్టి.
అర్థభాగమేమో అపంచీకృతంగా ఉంది. అర్థభాగమేమో పంచీకృతమయ్యింది. అందువల్లనే ఆ పంచకమంతా కూడా దానిలోకి ఆకర్షించబడుతుంది. పృథ్వీ తత్వం చేత ఆవరించబడుతున్నటువంటి శరీరమే నేననే వారందరూ మృత్యుదేవత ముఖములో పడక తప్పదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Dec 2020
No comments:
Post a Comment