6-November-2020 Messages

 1) 🌹 శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 92, 93 / Vishnu Sahasranama Contemplation - 92 93🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 326 🌹
4)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 26 / Sri Devi Mahatyam - Durga Saptasati - 26 🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 95 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 114 🌹
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 101 / Gajanan Maharaj Life History - 101🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 74, 75 / Sri Lalita Chaitanya Vijnanam - 74, 75🌹
9) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 41🌹*
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 453 / Bhagavad-Gita - 453 🌹

11) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 69 📚
12) 🌹. శివ మహా పురాణము - 267 🌹
13) 🌹 Light On The Path - 23🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 154 🌹
15) 🌹. శివగీత - 108 / The Siva-Gita - 108🌹* 
17) 🌹 Seeds Of Consciousness - 217🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 93 🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 56 / Sri Vishnu Sahasranama - 56🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 5 🌴*

05. దైవీ సమ్పద్ విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా |
మా శుచ: సమ్పదం దైవీమభిజాతోసి పాణ్డవ ||

🌷. తాత్పర్యం : 
దైవీగుణములు మోక్షమునకు అనుకూలములై యుండగా అసురగుణములు బంధకారకములగుచున్నవి. ఓ పాండుపుత్రా! నీవు దైవీగుణములతో జన్మించియున్నందున శోకింపకుము.

🌷. భాష్యము :
అర్జునుడు అసురగుణములను కూడి జన్మింపలేదని పలుకుచు శ్రీకృష్ణభగవానుడు అతనిని ఉత్సాహపరచుచున్నాడు. యుద్ధము యొక్క మంచిచెడ్డలను ఆలోచించుచుండుటచే అర్జునుడు యుద్ధమునందు పాల్గొనుట ఎన్నడును ఆసురీస్వభావము కాబోదు. 

భీష్మ, ద్రోణాది గౌరవనీయ పురుషులు వధార్హులా, కాదా యని చింతించుచుండుటను బట్టి అతడు క్రోధము, మిథ్యాహంకారము, పరుషత్వముల ప్రభావమునకు లోనుకాలేదని తెలియుచున్నది. కనుక అర్జునుడు ఆసురీలక్షణములకు చెందినవాడు కాడు. 

వాస్తవమునకు క్షత్రియుడైనవానికి శత్రువుపై బాణములను గుప్పించుటయే దైవీస్వభావము. అట్టి ధర్మము నుండి విరమించుటయే అసురస్వభావము కాగలదు. కనుక అర్జునిని శోకమునకు ఎట్టి కారణము లేదు. వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించువాడు సదా దైవీస్థితి యందే నెలకొనియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 538 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 05 🌴*

05. daivī sampad vimokṣāya
nibandhāyāsurī matā
mā śucaḥ sampadaṁ daivīm
abhijāto ’si pāṇḍava

🌷 Translation : 
The transcendental qualities are conducive to liberation, whereas the demoniac qualities make for bondage. Do not worry, O son of Pāṇḍu, for you are born with the divine qualities.

🌹 Purport :
Lord Kṛṣṇa encouraged Arjuna by telling him that he was not born with demoniac qualities. His involvement in the fight was not demoniac, because he was considering the pros and cons. He was considering whether respectable persons such as Bhīṣma and Droṇa should be killed or not, so he was not acting under the influence of anger, false prestige or harshness. 

Therefore he was not of the quality of the demons. For a kṣatriya, a military man, shooting arrows at the enemy is considered transcendental, and refraining from such a duty is demoniac. Therefore there was no cause for Arjuna to lament. Anyone who performs the regulative principles of the different orders of life is transcendentally situated.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 92, 93 / Vishnu Sahasranama Contemplation - 92, 93 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 92. వ్యాళః, व्यालः, Vyālaḥ 🌻*

*ఓం వ్యాళాయ నమః | ॐ व्यालाय नमः | OM Vyālāya namaḥ*

అశక్యత్వాద్ గ్రహీతుం తం వ్యాలవద్వాల ఉచ్యతే వ్యాలము అనగా క్రూర సర్పము. క్రూర సర్పము ఎట్లు పట్టుకొన శక్యము కాదో అటులే పట్టుకొన శక్యము కానివాడు.

:: భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా ।
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ॥ 53 ॥

నన్ను ఏ రీతిగ నీవు (అర్జునుడు) చూచితివో (విరాట్‌రూపం), అటువంటి రూపముగల నేను వేదములచే (వేదాధ్యయనపరులచే) గాని, తపస్సుచేగాని, దానముచేగాని, యజ్ఞముచేగాని చూచుటకు శక్యుడనుకాను.

అడ ఉద్యమనే వ్యాళః కరువ ఉద్యమించునది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 92🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 92. Vyālaḥ 🌻*

*OM Vyālāya namaḥ*

Aśakyatvād grahītuṃ taṃ vyālavadvāla ucyate / अशक्यत्वाद् ग्रहीतुं तं व्यालवद्वाल उच्यते So called as He cannot be grasped (by the mind) as a serpent which cannot be grasped (by the hand).

Bhagavad Gītā - Chapter 11
Nāhaṃ vedairna tapasā na dānena na cejyayā,
Śakya evaṃvidho draṣṭuṃ dr̥ṣṭavānasi māṃ yathā. (53)

:: श्रीमद्भगवद्गीता - विश्वरूपसंदर्शन योग ::
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥ ५३ ॥

Not through the Vedas, not by austerity, not by gifts, nor even by sacrifice can I be seen in this form as you (Arjuna) have seen Me.

Aḍa udyamane vyālaḥ / अड उद्यमने व्यालः The charging one.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 93 / Vishnu Sahasranama Contemplation - 93🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 93. ప్రత్యయః, प्रत्ययः, Pratyayaḥ 🌻*

*ఓం ప్రత్యయాయ నమః | ॐ प्रत्ययाय नमः | OM Pratyayāya namaḥ*

ప్రజ్ఞానం బ్రహ్మేత్యుపనిషదుక్తేః ప్రత్యయో హరిః 'ప్రజ్ఞానం బ్రహ్మ' అని ఉపనిషత్తున జ్ఞాన రూపముగా బ్రహ్మము చెప్పబడినందున - బ్రహ్మమైన విష్ణువు 'ప్రత్యయః' అని చెప్పబడును.

:: ఐతరేయోపనిషత్ - తృతీయాధ్యాయః ::

ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజాపతిరేతే సర్వే దేవా ఇమాని చ పంచమహాభూతాని పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతీంషీత్యేతానిమాని చక్షుద్రమిశ్రాణీవ । బీజానీతరాణి చేతరాణి చాండజాని చ జరాయుజాని చ స్వేదజాని చోద్భిజ్ఞాని చాశ్వా గావః పురుషా హస్తినో యత్ కిం చేదం ప్రాణి జంగమం చ । ప్రతత్రి చ యచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితత్ । ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా; ప్రజ్ఞానం బ్రహ్మ ॥ 3 ॥

అతడే బ్రహ్మ, అతడే ఇంద్రుడు, అతడే ప్రజాపతి. ఈ దేవతలెల్లరు ఆతడే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనెడు పంచభూతములు, అల్పములగు జంతువులు, విత్తనములు, మిగతా స్థావర జంగమములు, అండజములు, జరాయుజములు, స్వేదజములు, ఉద్భిజములు, గుఱ్ఱము, ఆవు, ఏనుగు, మనుష్యులు, ఇక జంగమములైన ప్రాణులేవికలవో యవి, పక్షులు, మిగతా స్థావరములు అన్నియు ఆ ప్రజ్ఞానేత్రమే. ప్రజ్ఞానమునందే నిలకడ బడసినవి. లోకములు ప్రజ్ఞానేత్రముగనే యున్నవి. ప్రజ్ఞానమునే ఆధారముగ బడసినవి. ప్రజ్ఞానమే బ్రహ్మము.

స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు బ్రహ్మమే. శిలాది స్థావరములు, పక్షులు, ఇంకను సమస్త ప్రాణులును ఆ బ్రహ్మముగనే యున్నవి. సమస్తము ప్రజ్ఞానేత్రము. సమస్తము ప్రజ్ఞానము నందు స్థాపించబడియున్నది. లోకమంతయు ప్రజ్ఞానేత్రము, ప్రజ్ఞయే ప్రతిష్ఠింపబడియున్నది. ప్రజ్ఞానమే బ్రహ్మము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 93🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 93. Pratyayaḥ 🌻*

*OM Pratyayāya namaḥ*

Prajñānaṃ brahmetyupaniṣadukteḥ pratyayo hariḥ / प्रज्ञानं ब्रह्मेत्युपनिषदुक्तेः प्रत्ययो हरिः Consciousness. So called as He is the embodiment of consciousness.

Aitareyopaniṣat - Chapter 3

Eṣa brahmaiṣa iṃdra eṣa prajāpatirete sarve devā imāni ca paṃcamahābhūtāni pr̥thivī vāyurākāśa āpo jyotīṃṣītyetānimāni cakṣudramiśrāṇīva, Bījānītarāṇi cetarāṇi cāṃḍajāni ca jarāyujāni ca svedajāni codbhijñāni cāśvā gāvaḥ puruṣā hastino yat kiṃ cedaṃ prāṇi jaṃgamaṃ ca, Pratatri ca yacca sthāvaraṃ sarvaṃ tat prajñānetraṃ prajñāne pratiṣṭhitat, prajñānetro lokaḥ prajñā pratiṣṭhā; prajñānaṃ brahma. (3)

:: ऐतरेयोपनिषत् - तृतीयाध्यायः ::
एष ब्रह्मैष इंद्र एष प्रजापतिरेते सर्वे देवा इमानि च पंचमहाभूतानि पृथिवी वायुराकाश आपो ज्योतींषीत्येतानिमानि चक्षुद्रमिश्राणीव । बीजानीतराणि चेतराणि चांडजानि च जरायुजानि च स्वेदजानि चोद्भिज्ञानि चाश्वा गावः पुरुषा हस्तिनो यत् किं चेदं प्राणि जंगमं च । प्रतत्रि च यच्च स्थावरं सर्वं तत् प्रज्ञानेत्रं प्रज्ञाने प्रतिष्ठितत् । प्रज्ञानेत्रो लोकः प्रज्ञा प्रतिष्ठा; प्रज्ञानं ब्रह्म ॥ ३ ॥

This One is (the inferior) Brahman; this is Indra, this is Prajāpati; this is all these gods; and this is these five elements viz earth, air, space, water, fire; and this is all these (big creatures), together with the tiny ones, that are the procreators of others and referable in pairs - to wit, those that are born of eggs, of wombs, of moisture, and of the earth, viz horses, cattle, men, elephants, and all the creatures that there are which move or fly and those which do not move. All these are impelled by Consciousness; all these have Consciousness as the giver of their reality; the universe has Consciousness as its eye, and Consciousness is its end. Consciousness is Brahman.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 326 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 48
*🌻 Sripada’s daily routine and darbar - 2 🌻*

People who visited Sripada’s darbar were blessed. Devotees used to bring vegetables, Jowar, Raagi and Rice. Every day there would be ‘annadanam’. But Thursdays’ food would be special. One sweet preparation would be made and distributed on that day. 

Sripada’s heart was very delicate. If anyone came to darbar in distress, he would certainly go back happy. He would say His grace would be there on people reading Sri Datta puranam. Sripada’s love was equal to the love of crore mothers.

In the night, he would not allow anyone to stay in Kurungadda. But he allowed the old sanyasi, who came with me, to stay for some days. He would sometimes tell me to stay in Kurungadda at nights. He told the old sanyasi to go to Kasi to live and leave the body there only.

Cleaning the utensils used for cooking food, and seeing that no devotee had any inconvenience were my duties. Food would be given to all who attended darbar any time. 

If someone said that he already had eaten, He would insist on eating again as it was ‘prasad’. If I said that the cooked items were less and the visitors were more, He would sprinkle the water from His kamandalam on the items. 

Then it would become ‘akshaya’ (inexhaustible). This happened many a time. In the night Gods used to come in different aero planes to Kurungadda and serve ‘Maha Guru’. They would go back after getting His blessings.

 Sometimes some yogis used to come from Himalayas. They also would walk on water and come. Their bodies used to be luminous. Sripada Himself used to serve
food to them.

Sripada used to take only a fistful of rice. He used to say that He would be satisfied if His devotees ate to their satisfaction whether it was rice, jowar or raagi sankati. The washerman Ravidasu had the opportunity of washing the clothes of Sricharana. Even after having His darshan, if some one had not discarded bad habits, he would get strange problems.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 26 / Sri Devi Mahatyam - Durga Saptasati - 26 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 7*
*🌻. చండముండ వధ - 2 🌻*

16. ఆ దైత్య బలమంతా క్షణమాత్రంలో కూల్చివేయబడడం చూసి, చండుడు అతిభయంకరరూపయై ఉన్న ఆ కాళిక మీదకు ఉరికాడు.

17. ఆ మహాసురుడు (చండుడు) అతిభయంకరమైన బాణవర్షంతో, ముండుడు వేనవేలు చక్రాలను విసరివేయడంతో, ఆ భీషణనేత్రను (కాళిని) కప్పివేసారు.

18. ఆ అనేక చక్రాలు ఆమె నోట్లో అదృశ్యమైపోవడం అనేక సూర్యబింబాలు మేఘమధ్యంలో అదృశ్యమైపోతున్నట్లుగా ఉంది.

19. అప్పుడు భయానక గుర్జారావం చేస్తూ, భయంకరమైన నోటిలో దుర్నిరీక్ష్యంగా మెరుస్తున్న పళ్ళతో కాళి అత్యంత రోషంతో భయంకరంగా నవ్వింది.

20. అంతట ఆ (కాళికా) దేవి తన మహాసింహంపై ఎక్కి, చండుని మీదికి ఉరికి, జుట్టుతో పట్టుకొని అతని శిరస్సును ఖడ్గంతో ఛేదించింది.

21. చండుడు కూలడం చూసి ముండుడు కూడా ఆమెపైకి ఉరికాడు. ఆమె అతణ్ణి కూడా రోషంగా తన ఖడ్గంతో కొట్టి నేలగూల్చింది.

22. చండుడు, అత్యంతశౌర్యవంతుడైన ముండుడు కూల్చబడడం చూసి, అప్పటికి చావక మిగిలి ఉన్న సైన్యమంతా సంభ్రమంతో దిక్కులబట్టి పారిపోయింది.

23. కాళి చండముండల శిరస్సులను తన చేతులతో పట్టుకొని చండిక వద్దకు పోయి ప్రచండంగా, బిగ్గరగా నవ్వుతూ ఇలా పలికింది :

24. “ఈ యుద్ధయజ్ఞంలో యజ్ఞపశువులుగా సమర్పింపబడిన చండముండులను నీ వద్దకు తెచ్చాను. శుంభనిశుంభులను నీవు స్వయంగా చంపుతావు.”

25–27. ఋషి పలికెను : అంత తన వద్దకు తేబడిన ఆ చండముండ మహాసురులను చూసి శుభమూర్తియైన చండిక కాళితో మనోజ్ఞంగా ఇలా పలికెను : “నీవు చండముండులను ఇరువురినీ నా వద్దకు తెచ్చావు కనుక దేవీ! నీవు ఇక లోకమందు చాముండ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు.” 

శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమస్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “చండముండవధ” అనే సప్తమాధ్యాయము సమాప్తం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 26 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 7:* 
*🌻 The slaying of Chanda and Munda - 2 🌻*

 16. On seeing all the hosts of asuras laid low in a moment, Chanda rushed against that Kali, who was exceedingly terrible.

17. The great asura (Chanda) with very terrible showers of arrows, and Munda with discuses hurled in thousands covered that terrible-eyed (Devi).

18. Those numerous discuses, disappearing into her mouth, looked like numerous solar orbs disappearing into the midst of a cloud.

19. Thereat Kali, who was roaring frightfully, whose fearful teeth were gleaming within her dreadful mouth, laughed terribly with exceeding fury.

20. Then the Devi, mounting upon her great lion, rushed at Chanda, and seizing him by his hair, severed his head with her sword.

21. Seeing Chanda laid low, Munda also rushed at her. She felled him also the ground, striking him with her sword in her fury.

22. Seeing the most valiant Chanda and Munda laid low, the remaining army there became panicky and fled in all directions.

23. And Kali, holding the heads of Chanda and Munda in her hands, approached Chandika and said, her words mingled with very loud laughter.

24. 'Here have I brought you the heads of Chanda and Munda as two great animal offerings in this sacrifice of battle; Shumbha and Nishumbha, you shall yourself slay.' The Rishi said:

25-27. Thereupon seeing those asuras, Chanda and Munda brought to her, the auspicious Chandika said to Kali these playful words: 'Because you have brought me both Chanda and Munda, you O Devi, shall be famed in the world by the name Chamunda. 

Here ends the seventh chapter called 'The slaying of Chanda and Munda' of Devi-mahatmya in Markandeya purana, during the period of Savarni, the Manu.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 95 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -25 🌻*

 కానీ, “నిశ్చయాత్మకోబుద్ధిః”- బుద్ధి అనేటటువంటిది పనిచేస్తే తప్ప, నిజానికి మానసిక వికలాంగులు అన్న వాళ్ళల్లో, ఈ బుద్ధిలోపం కూడా వచ్చేసింది. 

ఒక మనస్సు లోపమే కాకుండా, బుద్ధి లోపం కూడా కలగడం వల్ల, అటు వివేచన సరిగ్గా లేదు, ఈ నిర్ణయము సరిగ్గా లేదు. దీన్ని ఏమంటారంటే, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ [I hand co-ordination] అని కూడా అంటారు. అంటే, బాగా వృద్ధాప్యం వచ్చేస్తే, ఈ న్యూరలైటిక్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల, నరాలు దెబ్బతినేసిన ప్రాబ్లం వల్ల, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ [I hand co-ordination] డేమేజ్‌ అయిపోతుంది. పార్కిన్‌సన్‌ డిసీస్‌ కూడా అని అంటారు దానిని.

        వీటిలో ఏమౌతుంది? అల్జీమర్‌ డిసీజ్‌ అని కూడా అంటారు. ఇవన్నీ బుద్ధికి వచ్చేటటువంటి సమస్యలు అన్నమాట! వీటిల్లో ఏమౌతుంది? అంటే, ఆ బుద్ధి కేంద్రం డ్యామేజ్‌ అవుతుంది. 

ఎప్పుడైతే అది దెబ్బతిందో అప్పుడు ఏ పనిని సక్రమంగా చేయడానికి కావాల్సినటువంటి నిశ్చయాత్మక జ్ఞానం పనిచేయదు. అంటే జ్ఞాన వ్యవస్థలోనే ఇప్పుడు మూడు నాలుగు అంశాలు చెప్పుకున్నాము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి మూట ఒకటి. మనస్సనే మూట ఒకటి. బుద్ధి అనే మూట ఒకటి. ఇవన్నీ జ్ఞానపరిధిలోనే ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మంగానే ఉన్నాయి. 

ఇవన్నీ సక్రమంగా పని చేస్తేనే, నువ్వు నిర్ణయం చేయగలుగుతున్నావు. పొయ్యి మీద పాలు పెట్టావు, ఎక్కడో ఆలోచిస్తుంటావు, ఏమైపోతుంది? ఈ పాలు పొంగిపోతాయి. నువ్వు పక్కనే ఉన్నావు. కానీ, ఆబ్సంట్‌ మైండ్‌. అంటే అక్కడ లేదు బుద్ధి. ఎక్కడో ఆలోచిస్తోంది. ఏదో వ్యాకులతకు లోనైంది. ఏదో అంశాన్ని గురించి విచారణ చేస్తోంది, తద్వారా ఏమైంది? ఆ వాస్తవికమైనటువంటి స్థితిలో పనిచేయడం లేదు.

        అట్లాగే, చాలా మంది కొత్త కోడలికి పరీక్ష ఏం పెడుతారు? కూరగాయలు తరగడం. ఆవెడ మాట్లాడుతూ ఉంటుంది, అత్తగారు. కోడలుగారు మాట్లాడుతూ కూరగాయలు తరగాలి. ఈవెడకేమో, మాట్లాడితే చేయి తెగిపోతుందేమో ననే భయం. ఎందుకని? దృష్టి అక్కడ పెట్టకపోతే, వంకాయల బదులు వేలు తెగుతుంది. చాలా ప్రమాదం వచ్చేస్తుంది. కానీ, అత్తగారు మాట్లాడకుండా ఉండదు. మాట్లాడుతూ ఉంటుంది. అంటే, ట్రైనింగ్‌ అన్నమాట! శిక్షణ. 

అంటే, ప్రయత్న పూర్వకంగా నువ్వు నిశ్చల బుద్ధిని సంపాదించాలి. ఇంద్రియాలను అప్రయత్నంగా సామాన్య స్థితిలో ఆటోమేటిక్‌ గా పనిచేయాలి. మెషీన్‌లాగా పనిచేయాలి. ఈ శరీరం అనే యంత్రం. ఒక చిన్న యంత్ర వ్యవస్థ లాంటిది. దీన్ని పని చేయిస్తున్నటువంటిది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మక మైనటువంటి జ్ఞానం. దాన్ని పనిచేయిస్తున్నటువంటిద మనస్సనేటటువంటిది సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దానిని పనిచేయిస్తున్నటువంటిది, బుద్ధి అనేటటువంటి నిశ్చయాత్మక జ్ఞానం.

        చూడండి! ఎంత వ్యవస్థ ఏర్పాటు చేయబడిందో మానవ ఉపాధిలో. ఇంత సమర్థమైనటువంటి వ్యవస్థ మన చేతిలో ఉన్నప్పటికి, దీనిని బహిరంగం వైపుకే వాడుకో గలుగుతున్నామంటే, ఎంత అసమర్థులమో అలోచించి చూడండి. ఈ రకమైన వ్యవస్థ ఏదీ కూడా అమీబా నుంచీ మనిషి వరకూ ఉన్నటువంటి జంతుజాలమునకు లేదు. వాటికి మనో వికాసము లేదు, వాటికి బుద్ధి వికాసము లేదు. వాటికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి జ్ఞాన వికాసము లేదు. 

వాటికి గోళక వికాసము వరకూ మాత్రమే ఉంది. అందువల్ల ఏమైంది? అవి గోళకాలనే పరిమితికి మాత్రమే లోబడి జీవించ గలుగుతున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే, ఈ ఆంతరిక వికాసాన్ని కలిగి ఉన్నాడు.మానవుడు ఈ ఇంద్రియాలని ఆ జంతువుల వలెనే, ఆహార నిద్ర భయ మైధునాల కొరకే వినియోగించాడనుకుందాము. ఏమైంది అప్పుడు? వాటికి మనకి పెద్ద తేడా ఏముంది?

పొద్దున్న లేచాము, అంట్లు తోముకున్నాము. అన్నీ తయారు చేసుకున్నాము. కూరగాయలు పండ్లు రెడీ చేసుకున్నాము. వంట వండుకున్నాము. తినేశాం. భోంచేశాము, హాయిగా తృప్తిగా పడుకున్నాము. మళ్ళా విశ్రాంతి తీసుకున్నాము. మళ్ళా లేచాము. మళ్ళా ఏదన్నా తిన్నాము, తాగాము. మళ్ళా పడుకున్నాము. మళ్ళా లేచాము. మళ్ళా తిన్నాము, తాగాము. మళ్ళా పడుకున్నాము. ఇదే పని కదా! కాబట్టి, ఇదే రకంగా గనక మనము జంతువుల వలే జీవించామే అనుకోండి. అప్పుడు ఏమైంది? జీవితంలో సగభాగమేమో నిద్రకు పోయింది. మిగిలిన సగభాగమేమో చిత్తుశుద్ధి లేకపోయింది. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 115 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
107

Pingala Naga was very surprised seeing Lord Datta’s actions. In the meanwhile, all the elderly saints were shouting slogans of victory to Lord Datta. All the elderly saints were present. 

They were very happy, shouting slogans of victory to the Lord and prostrating to him. It was then that Pingala Naga had an eye-opener – when elderly saints and Yateeshwaras came in large crowds and prostrated to him while chanting mantras, performed Abhishekam, worshiped and praised him. That’s when he woke up. It was as if he was asleep while standing, like some people sleep with their eyes open during Shivaratri. 

Some people can sleep while standing, some sleep while sitting. Some people are actually able to sleep while standing, they lean against the wall and doze off. Some people fall asleep while driving their motorbike and kill themselves. Some doze off while driving their car. Some people doze off while cooking, burning their hands in the process. 

There doesn’t seem to be a regimen to sleeping. That’s how it is. The problem is with the food you eat. Leave that aside, why come to this world, let’s go back to that world. 

Pingala Naga had an eye-opening revelation. He thought straight. He felt the Lord was laughing at him and laughing at the saints too. Pingala Naga felt that there were a lot of hidden meanings in 
that laughter. “True, he is laughing at me. I am foolish, arrogant and lazy. I came here with devotion, but I had lot of doubts. That is why he is laughing at me. He’s laughing looking at the saints.

He is probably smiling at them because they are chanting mantras and are helping with the yagna. Wow, there are a lot of meanings and signals in his laughter. I feel like there are a lot of 
secrets in this laughter. I cannot understand those secrets. But, I can understand one thing. I understand one secret hidden in this laughter. It is because the Lord is so great that all the saints are following him wherever he goes, they are listening to his discourses. I will also ask Swamy (Lord) and understand the principle of Siva”.

All those present were asking the Lord spiritual questions and learning, just like how people these days ask Swamiji about the ups and downs in their lives. Of course, no one ever asks Swamiji a spiritual question. Here, Pingala Naga wanted to ask the Lord about the principle of Siva. “That is the reason I came here”, he thought. At that time, Datta Swamy was seated under Amalaka tree (Indian gooseberry or Phyllantus Emblica). Pingala Naga approached the Lord and prostrated to him. 

He felt the time was right for him place his doubts in front of the Lord. Prostrating, he proceeded to ask the Lord. “Swamy, the Vedas and other scriptures have established 4 varnas (classes) and 4 stages in a man’s life. All these saints are following the Dharmic order established by the Vedas. 

But, your actions are defying that Dharma”, he asked bravely. “Still, the saints are holding you in the highest regard, they are worshiping you. Swamy, I can’t understand the subtle Dharmic principles here”. 

 Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 99 / Sri Gajanan Maharaj Life History - 99 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 19వ అధ్యాయము - 7 🌻*

 ఆత్మారాం శ్రీమహారాజుతోనే ఉండడం కొనసాగించాడు. తేనెటీగ తేనెను ఎలా వదలగలదు ? జాలంబ్ నుండి రోజూ షేగాం వచ్చి తనసేవలు అందించేవాడు. అతని భక్తి ఎటువంటిదంటే, శ్రీమహారాజు భౌతిక ప్రపంచం వదిలేకాకూడా, ఆత్మారాం షేగాంలో ఉండి రోజూ సమాధికి పూజలు చేసాడు. 

ఈసేవలకోసం అతను ఏవిధమయిన తనఖా స్వీకరించలేదు. పైగా తన ఆస్థి అయిన ఇల్లు, కొంచెం స్థలం మందిర ట్రస్టుకి ఇచ్చివేసాడు. ఎవరు చేసిన దానం విలువ కాదు, కానీ ఎంతభక్తితో చేస్తారన్నది ముఖ్యం. శబరి రేగిపళ్ళు అర్పించడం ద్వారా శ్రీరాముని కృపను పొందింది, అదే ఇక్కడ కూడా జరిగింది. 

స్వామి దత్తాత్రేయకేదార్, నారాయణజాంకర్ మరియు పాలమీద జీవించే దుదాహరిబువా వీళ్ళందరికీ శ్రీమహారాజుమీద నిజమయిన భక్తి ఉండేది. ఇప్పుడు బాలాపూరు తాలుకాలో మోరుగాం భాకరేకు చెందిన మారుతీపంతు పత్వారి కధ వినండి. పొలంలో పంటకాపాడే సేవకు / పనికి మారుతిపంతుకు తిమాజీమాలి ఉన్నాడు. 

ఒకరోజు రాత్రి ఆపంట మోపును కాపలాకాస్తూ నిద్రపోయాడు. ఆ సమయంలో కొన్ని గాడిదలు పొలంలో చొరబడి, ధాన్యంతినడం మొదలు పెట్టాయి, కానీ మారుతి భక్తుడు అవడంవల్ల శ్రీమహారాజు పరుగున వెళ్ళి ధాన్యం రక్షించారు. అకస్మాత్తుగా పొలంలో ప్రత్యక్షంఅయి తిమజీని లేవమని పిలిచి, తిమాజీ లేచిన తరువాత శ్రీమహారాజు పొలంనుండి అదృశ్యం అయ్యారు. అతను ఆగాడిదలను చూసి, వాటిని బయటకు తరిమి వేసాడు, కానీ తన యజమానికి ఈ నష్టంవల్ల వచ్చే కోపం గురించి ఆలోచించాడు. 

ఈ విధంగా ధాన్యం సంరక్షణలో తన విఫలత్వానికి తను యజమానికి చేసిన నమ్మకద్రోహాన్ని అతను గ్రహించాడు. సుమారు సగంవరకు ఆగుట్టలో నుండి ధాన్యం ఆగాడిదలు ఆరగించాయి. ఈవిధమయిన పనిఎడల తన నిర్లక్ష్యానికి ఏకారణం సాకుగా అతనికి కనిపించలేదు. తమ యజమాని బాగోగులు లక్ష్య పెట్టకుండా, దురుసుగా, అవినీతిగా ఉండే ప్రస్తుత పనివాళ్ళలా కాకుండా, ఆరోజులలో పనివాళ్ళు ఎటువంటి బాధ్యతతో ఉండేవారో చూడండి. 

తిమాజీ అటువంటి వాడుకాదు. ఈ నష్టానికి అతను దుఖించి తనని క్షమించుకుందుకు ఏకారణం తెలుసుకోలేకపోయాడు. ఈ నష్టానికి తను బాధ్యత వహించి తన యజమానిని క్షమించమని అర్ధించేందుకు నిశ్చయించుకున్నాడు. తన యజమాని తనని ఖచ్చితంగా క్షమిస్తాడని అతనికి నమ్మకం. 

అతను తన యజమాని దగ్గరకు వెళ్ళి పాదాలు పట్టుకొని........ ఓ స్వామీ, నానిద్ర మీకు గొప్ప నష్టాన్ని కలిగించింది. నేను నిద్రపోతూ ఉండగా గాడిదలు సగంవరకు ధాన్యం ఆరగించాయి, దయచేసి పొలానికి వచ్చి నష్టం ఎంతఅయిందో అంచనా వెయ్యండి, అప్పుడే నాకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు. దానికి తనకు పొలానికి వెళ్ళేందుకు సమయంలేదనీ, తను శ్రీగజానన్ మహారాజు దర్శనానికి షేగాం వెళుతున్నానని మారుతి అతనితో అన్నాడు. 

అక్కడ నుండి తిరిగి వచ్చిన తరువాత పొలానికి వస్తానని వాగ్దానం చేసాడు. మారుతి ఉదయం 10 గం.కు షేగాం చేరాడు. శ్రీమహారాజు ఆసనంమీద కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరలో జగ్గుపాటిల్, బాలాభమ్ ఉన్నారు. మారుతిని చూసి నవ్వుతూ, నిన్న రాత్రి నీకోసం నేనుచాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. మీరు నా భక్తులయి సోమరిపోతు పనివాళ్ళని పనిలో పెట్టి, మీరు హాయుగా ఇంటిదగ్గర నిద్రపోతూ, నాచేత కాపలావాడి పని చేయిస్తారు. 

మారుతీ నిన్నరాత్రి తిమాజీ నిద్రపోయేసరికి గాడిదలు నీపొలంలో చేరి ధాన్యం తినడం మొదలు పెట్టాయి. నేను వెళ్ళి తిమోజీని లేపి, ధాన్యం కాపాడవలసింది అనిచెప్పి వెనక్కి వచ్చాను అని శ్రీమహారాజు అన్నారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 99 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 19 - part 7 🌻

Atmaram continued to stay with Shri Gajanan Maharaj . How can a honeybee leave the honey? Daily he used to come to Shegaon from Jalamb and offer his services. So much was his devotion that when Shri Gajanan Maharaj left the material world, Atmaram stayed at Shegaon only for the daily worship of the Samadhi. 

He did not accept any remuneration for this service, but on the contrary gave away his own property, which was a house and some land, to the trust of the temple. It is not the value of the offering one makes, but the devotion that counts. Shabari gained the grace of Shri Ram by offering jujube fruits only, the same thing happened here also. 

Swami Dattatreya Kedar, Narayan Jamkar, and Dudhahari Bua who lived on milk only, had sincere devotion for Shri Gajanan Maharaj . Now listen to the story of Marutipant Patwari of Morgaon Bhakre in Balapur Taluka. This Marutipant had Timaji Mali in his service for the protection of crops in the field. 

One night, while keeping a watch on the heap of grains in the field, he fell asleep. At that time some donkeys entered the field and started eating the grains. But since Maruti was a sincere devotee, Shri Gajanan Maharaj had to rush to the field and save the grains. He suddenly appeared in the field and called Timaji to wake up. Timaji woke up and Shri Gajanan Maharaj disappeared from the field. 

He saw the donkeys and drove them away, but then thought of his master's likely wrath due to this loss. He realised the betrayal of the trust of his master in failing to protect the grains. The donkeys had consumed nearly half the heap of grains, and he could not find any excuse for his negligence of duty. 

See, how the servants had a sense of responsibility in those days, as against the present day servants who never care for the interest of their masters, and over and above are arrogant and dishonest. Timaji was not like that. He was unhappy over the loss and could not find any reason to excuse himself. He decided to own up to the responsibility for the loss and beg for pardon from his master, who he was sure, would forgive him. Timaji went to his master and touching his feet said, 

O Sir, my sleep has put you to a great loss. The donkeys, while I was sleeping, consumed half the heap of grains. Kindly come to the field to assess the loss and then only I will feel relieved. Thereupon Maruti said that he had no time to go to the field, as he was to go to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj. 

He however promised to visit the field on his return from there. Maruti reached Shegaon at about ten in the morning. Shri Gajanan Maharaj was sitting on the Asana and Jagu Patil and Balabhau were sitting near him. Seeing Maruti Shri Gajanan Maharaj smilingly said, I had to go through a lot of trouble for you last night. You become my devotee and make me do the job of a watchman by employing lazy servants and yourself sleeping comfortably at home. 

Maruti, last night Timaji fell asleep and several donkeys entered your fields and started eating all your grains. So I woke Timaji and alerted him to protect the grains.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 41 / Sri Lalitha Sahasra Nama Stotram - 41 🌹*
*ప్రసాద్ భరద్వాజ*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 74, 75 / Sri Lalitha Chaitanya Vijnanam - 74, 75 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |*
*మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ‖ 29 ‖*

*🌻 74. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా 🌻*

భండుని లలితాదేవి తన శక్తి సేనలతో కలిసి వధించగా భండ పుత్రులను ఆమె పుత్రికయైన బాల విక్రమించి సంహరించినది. భండ పుత్రులను వధించిన బాల విక్రమమును చూచి ఆనందించునది అని పై నామమునకు అర్థము.

భండాసురుని లలితాదేవి సంహరించగ అతని పుత్రులు ముప్పదిమంది దేవతలపై దండెత్తిరి. అపుడు లలితాదేవి కుమార్తెయైన బాల ముప్పదిమంది అసురులను సంహరించినది. ఆ మహా యుద్ధమున బాల పరాక్రమమును గమనించి లలితాదేవి ప్రీతి చెందినది అని సామాన్య అర్థము.

'బాల' అనగా అమ్మ యొక్క విమర్శనా శక్తి. భండ పుత్రులందరు బంధన హేతువులు. పంచేంద్రియముల ద్వారా బహిరంగమున సృష్టిని అనుభూతి చెందుచున్న జీవునికి అమ్మ ఆకర్షణలు అమితముగ నుండును. సృష్టి ఆకర్షణమునకు లోనైనవారు బంధముల చిక్కుకుందురు. రకరకముల జీవులు సృష్టియందు ఇట్లు చిక్కుకొనుట చేతనే దివ్య జీవనమును కోల్పోయినారు. బంధములు తొలగవలె నన్నను, యికపై కలుగ రాదనుకొన్నను జీవుడాశ్రయించ వలసినది శ్రీ బాలనే. 

శ్రీ బాల అమ్మవారి శిశురూపము. ఐదేండ్ల శిశువును బాల, లేక బాలుడు అందురు. బాలకృష్ణుని ఆరాధన, ఐదేండ్ల కుమారస్వామి ఆరాధన శ్రీ బాల ఆరాధన యొక్కటియే. జీవునికి ఐదేండ్ల వయస్సు వచ్చిన దగ్గరనుండి అతనికి విచక్షణా శక్తి నందించవలెను. యింద్రియము లన్నియు రుద్రుని వశమున నుండుటచే పదకొండు సంవత్సరముల పాటు ఈ శిక్షణను శ్రద్ధతో నిర్వర్తించుకొన్న జీవుడు ప్రౌఢ యగును. అనగా 16 సం||ల వాడగును.

అంతవరకును వలసిన శిక్షణ విచక్షణయే. ఈ విచక్షణ బాల నారాధించినచో కలుగును. లేక బాలకృష్ణుడు, కుమారి అయినను కావచ్చును. ఇట్లు చిన్నతనముననే విచక్షణను, విమర్శించుకొను శక్తిని అమ్మ అనుగ్రహముగ పొందినవారు బంధములకు లోనుగారు. అనగా భండ పుత్రులు వారి నేమియు చేయరు. 

అమ్మ బాలారూపము నిట్లు అవగాహన చేసుకొని ఆరాధించి జితేంద్రియత్వమును పొందుట ఋషులందించిన మార్గము. అట్లు జితేంద్రియులైన వారిని చూచి కూడ అమ్మ ఆనందము చెందును. అదియును బాలా విక్రమమే. జీవుని యందు బాల విక్రమించినదని అర్థము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 74 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Bhaṇḍaputra- vadhodyukta- bālā-vikrama-nanditā* *भण्डपुत्र-वधोद्युक्त-बाला-विक्रम-नन्दिता (74) 🌻*

Bālā is daughter of Lalitai and is nine years old. Bhandāsura had thirty sons. In spite of Lalitai advising Her daughter not to go to the battle field, Bālā prevailed upon her mother and waged a war against all the thirty sons of Bhandāsura and destroyed them. 

In Śrī Vidya cult, the first initiation is always the mantra of Bālā. If one attains siddhi in Bālā mantra, he can attain super natural powers by using rare herbs.  

Certain herbs have divine qualities and are capable of conferring superhuman powers to a person provided he has attained siddhi in Bālā mantra. 

Bālā is the aṅga devata of Lalitāmbikā. Lalitai, Mantrinī and Vārāhī have aṅga devi-s, upāṅga devi-s and pratyaṅga devi-s.  

Annapūrna Devi is upāṅga Devi and Aśvārūdā Devi is the pratyaṅga Devi of Lalitāmbikā. (aṅga, upāṅga and pratyaṅga refer to gross, subtle and subtler limbs of Devi)

The sons of Bhadāsura represent the thirty tattva-s. Unless we cross these tattva-s, realization cannot take place. A small effort (referring to Bālā) from us will destroy the evil effects of the tattva-s.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 75 / Sri Lalitha Chaitanya Vijnanam - 75 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |*
*మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ‖ 29 ‖*

75. 'మంత్రిణ్యంబావిరచిత విషంగ వధతోషితా'

విషంగుని మంత్రిణ్యంబ వధించిన తీరును చూచి సంతోషించిన అమ్మవారని అర్థము. 

విషంగుడు, విశుక్రుడు అను ఇద్దరసురులు భండుని ఎడమ కుడి భుజములనుండి పుట్టిరి. వీరు సృష్టి యందలి ద్వంద్వములందు చిక్కిన వారు. 

సృష్టియందు బంధితులగుచున్నారు. బంధ మజ్ఞాన వశమున కలుగును. అజ్ఞానమే అసురత్వము. పాపము-పుణ్యము, దుఃఖము - సంతోషము, అసౌకర్యము - సౌకర్యము, నష్టము - లాభము, మరణము - జననము, దరిద్ర్యము - సంపద. ఇట్లెన్నో ద్వంద్వములు కలవు. 

ఈ జంటల యందు మొదటిది దుఃఖహేతువు. అదియే ఎడమ భుజమందలి అజ్ఞానము. అజ్ఞాన పూరితమైన ఎడమ భుజము విషంగుడని బ్రహ్మపురాణము తెలుపుచున్నది. ద్వంద్వములు మిథునరాశి ప్రభావము కలిగినవి. మిథునము కవలలకు సంకేతము. పై ద్వంద్వములే కవలలు. అందు ఎడమ తత్త్వము వామాచారము. దుఃఖహేతువు. అది జీవునియందు నశించవలె నన్నచో శ్రీ లలితాదేవిని మంత్రిణీ స్వరూపముగ ఆరాధింపవలెను.

ముందు నామములలో మంత్రిణి యనగా శ్యామలాదేవి అని తెలిపియుంటిమి. శ్యామలాదేవి బుద్ధి లోకమున మంత్ర మాధారముగా సేవించ బడుచు నుండును. ద్వంద్వాతీత స్థితిని పొందవలె నన్నచో భ్రూమధ్యమున గురుముఖమున పొందిన మంత్రమును మననము చేయుచు అమ్మ ఆరాధన కొనసాగవలెను. శ్యామల మానవ దేహమందలి విషపూరితమగు భావములను కోరికలను, చేష్టలను, మాటలను హరింపగల శక్తి కలది.

 శ్రీ కాళిదాసు విరచిత 'శ్యామలా దండకము' ప్రతినిత్యము భక్తితో పఠించుచు అమ్మ దివ్యరూపమును, భ్రూమధ్యమున దర్శించు ప్రయత్నము చేయువారి యందు విషంగుడు మరణించ గలడు. అందుచే శ్యామల ఆరాధ్య దైవము. ఆమె సర్వ మంత్రములకు మూలము. ఆమె శ్రీచక్ర బిందువు చుట్టును. ఉండు మొదటి త్రికోణము. 

విషంగుని వధించిన అట్టి శ్యామలామూర్తిని చూచి అమ్మ తుష్టి చెందినదని అర్థము. శ్యామలాదేవి గేయచక్రమను రథమును ఎక్కిన అమ్మను ఆరాధించు చుండునని, శ్యామల అనుగ్రహము పొందినవారు ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు అర్హత కలిగియుందురని కూడ గుర్తింపవలెను. ఆమెయే 'త్రిపురశక్తి.'

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 75 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mantriṇyambā- viracita- viśaṅgavadha-toṣitā* मन्त्रिण्यम्बा-विरचित-विशङ्गवध-तोषिता (75) 🌻*

She was delighted with the destruction of demon Viśaṅgavadha by Mantrinī (ṣyamalā) Devi. Viśaṅga and Viśukra are the two brothers of Bhandāsura. There were created by Bhandāsura from his shoulders. 

There is bīja ‘vi’ (वि) in this nāma . The root of this bīja is the alphabet ‘va’ (व). Va indicates two things. It helps in attaining super natural powers. Secondly it eradicates evil influences. Mantrinī Devi represents the potency of mantra-s.  

Viśaṅga means desires arising out of the evil effects of sensory organs. Mantrinī Devi destroys such desires of the devotees of Lalitāmbikā.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 453 / Bhagavad-Gita - 453 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -10 🌴*

10. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మచేయుట ద్వారా నీవు పూర్ణశక్తిని పొందగలవు.

🌷. భాష్యము :
భక్తియోగమునందలి నియమములను సైతము విధిగా గురువు నిర్దేశమునందు పాటింపలేనివాడు భగవానుని కొరకు కర్మ చేయట ద్వారా ఈ పూర్ణత్వస్థితిని చేరగలడు. ఆ కర్మను ఏ విధముగా నొనరింపవలెనో ఏకాదశాధ్యాయపు ఏబదిఐదవ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అనగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమము సాగించు భక్తులకు సహాయము చేయవచ్చును. 

భక్తియోగనియమములను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను మనుజుడు ఇట్టి ప్రచారకార్యక్రమమునకు సహాయము నందింపవచ్చును. లోకములో ప్రతికార్యక్రమమునకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమ లనునని అవసరములు. 

ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే, కృష్ణుని సేవకొరకు కూడా ఇవన్నియు అవసరములై యున్నవి. కాని ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతికస్థితిలో కర్మ స్వీయప్రీతికై ఒనరింపబడగా, రెండవదానిలో అది కృష్ణుని ప్రీత్యర్థమై ఒనరింపబడును. అట్లు కృష్ణప్రీత్యర్థమై ఒనరింపబడునదే ఆధ్యాత్మిక కర్మము. 

ఎవరైనను ధనమును అధికముగా కలిగియున్నచో కృష్ణభక్తుని ప్రచారము చేయుటకు కార్యాలయముగాని, మందిరమునుగాని నిర్మింపవచ్చును లేదా కృష్ణసంబంధవిజ్ఞానము ముద్రించుటలో తోడ్పడవచ్చును. ఈ విధమైన కృష్ణపరకర్మలు పలుగలవు. మనుజుడు అట్టి కర్మల యందు అనురక్తుడు కావలెను. 

ఒకవేళ మనుజుడు తన కర్మల ఫలముగా లభించినదానిని సంపూర్ణముగా త్యాగము చేయలేకున్నచో దాని యందు కొంతశాతమునైనను కృష్ణభక్తి ప్రచారమునకై దానము చేయవచ్చును. 

ఈ విధముగా కృష్ణచైతన్యోద్యమ ప్రచారము స్వచ్ఛందముగా చేయబడు సేవ మనుజుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ప్రేమస్థాయికి గొనిపోవును. అంతట అతడు పరిపూర్ణుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 453 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 10 🌴*

10. abhyāse ’py asamartho ’si
mat-karma-paramo bhava
mad-artham api karmāṇi
kurvan siddhim avāpsyasi

🌷 Translation : 
If you cannot practice the regulations of bhakti-yoga, then just try to work for Me, because by working for Me you will come to the perfect stage.

🌹 Purport :
One who is not able even to practice the regulative principles of bhakti-yoga, under the guidance of a spiritual master, can still be drawn to this perfectional stage by working for the Supreme Lord. How to do this work has already been explained in the fifty-fifth verse of the Eleventh Chapter. 

One should be sympathetic to the propagation of Kṛṣṇa consciousness. There are many devotees who are engaged in the propagation of Kṛṣṇa consciousness, and they require help. 

So, even if one cannot directly practice the regulative principles of bhakti-yoga, he can try to help such work. Every endeavor requires land, capital, organization and labor. 

Just as in business one requires a place to stay, some capital to use, some labor and some organization to expand, so the same is required in the service of Kṛṣṇa. The only difference is that in materialism one works for sense gratification. 

The same work, however, can be performed for the satisfaction of Kṛṣṇa, and that is spiritual activity. If one has sufficient money, he can help in building an office or temple for propagating Kṛṣṇa consciousness. Or he can help with publications. 

There are various fields of activity, and one should be interested in such activities. If one cannot sacrifice the results of his activities, the same person can still sacrifice some percentage to propagate Kṛṣṇa consciousness. 

This voluntary service to the cause of Kṛṣṇa consciousness will help one to rise to a higher state of love for God, whereupon one becomes perfect.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 69 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 7. రక్షణ - అవతరించుటకు కాలధర్మము నిష్పత్తి చెందుటయే కారణము. అపుడు జరుగునవి మూడు కార్యములు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనము. అవతరించనపుడు కూడ సాధు జనులకు రక్షణ యున్నది. అపుడు దైవము తాత్కాలికముగ జీవులలో ప్రవేశించి, శిష్టరక్షణ చేసి అంతర్జాన మగుచుండును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 8 📚*

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 8

“సాధుజనులను పరిరక్షించుటకు, దుష్కృత్యములు చేయువారిని నిర్మూలించుటకు, ధర్మ సంస్థాపనము చేయుటకు ప్రతి యుగమునందు నేనవతరించు చున్నాను" అని భగవానుడు పలికెను.

సాధుజనులనగా సన్మార్గమున నడచు వినయవంతులు. వీరియందు అహింస, ఋజు ప్రవర్తనము, దొంగబుద్ధి లేకుండుట, కాని వాని కాశపడకుండుట, శుచి, శౌచము, సంతోషము, జ్ఞానాసక్తి, ఈశ్వరునికి సమర్పణ చెంది జీవించుట సహజముగ నుండును. అట్టివారు సాధువులు. వారిని భగవంతుడు పరిరక్షించును. పరి అను పదము కారణముగ సర్వకాలముల యందు అని అర్థము. ఇట్టి వారిని అధర్మము హింసించ లేదు. 

దండకవనమున గల ఋషులలో అగస్త్యాది ఋషులను అధర్మము తాకలేదు. ఇతర తపస్వి జనులను, మునులను తాకినది. ఇందలి రహస్యమును తెలియవలెను. అగస్త్యాది ఋషులకు పరిరక్షణమున్నది. ఇతరులకు రక్షణము కలుగుచు, కలుగక యుండును.

కారణము వారి యందలి సత్వగుణము యొక్క స్థితి. సత్వగుణము కూడ త్రిగుణములలో నొకటియే. కావున ఆసురీ తత్వమగు రజస్తమస్సులు తాకును. ముముక్షుజనులు సత్యాతీతమగు నిత్య సత్వమందుందురు. అట్టి వారిని రజస్సు, తమస్సులు స్పృశించలేవు. భగవంతుడు పరిరక్షణ చేయును. ఇందు తెలుపబడిన పరిరక్షణ ఎల్లప్పుడు నుండును. ధర్మాధర్మముల పాళ్ళు తప్పినపుడు దానికి కారణమగు దుర్మార్గులను శిక్షించి, సత్వగుణులను కాపాడును.

అవతరించుటకు కాలధర్మము నిష్పత్తి చెందుటయే కారణము. అపుడు జరుగునవి మూడు కార్యములు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనము. అవతరించనపుడు కూడ సాధు జనులకు రక్షణ యున్నది. అపుడు దైవము తాత్కాలికముగ జీవులలో ప్రవేశించి, శిష్టరక్షణ చేసి అంతర్జాన మగుచుండును. 

ఉదాహరణకు సత్పురుషుడొకడు, కర్మవశాత్తు అపాయమునకు గురియై మార్గ మధ్యమున స్పృహతప్పి పడియున్నప్పుడు ఆ మార్గమున బోవు జీవులలో ధర్మము ప్రవేశించి, వానిని గొనిపోయి సురక్షితముగ ఒక వైద్యాలయములో ప్రవేశింప జేయుదురు. 

అట్లే దొంగ యొకడు సత్పురుషుని ధనము దొంగిలించుకొని పారిపోవు చున్నప్పుడు పలువురి రూపమున దైవమే దొంగను పట్టి, దండించి, ధనమును సత్పురుషున కిచ్చును. సృష్టి అంతయు వాసుదేవరూపమే గనుక వాసుదేవుడెప్పుడును ఇట్లు జీవులను రక్షించుచునే యుండును. ఇట్టి రక్షణ కవతార మక్కరలేదు. 

పై తెలిపిన అపాయములు దుష్టులకు జరిగినచో అట్టి సహాయము లభించదు. పై కారణముగ సత్ప్రవర్తన కలిగియున్న వారికి రక్షణ ఎప్పుడును కలుగును. అవతారము మాత్రము ధర్మగ్లాని కారణముగనే దిగివచ్చునని తెలియవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 266 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
62. అధ్యాయము - 17

*🌻. సతీ కల్యాణము -1 🌻*

నారదుడిట్లు పలికెను -

నీవు రుద్రుని వద్దకు వెళ్లిన తరువాత ఏమి వృత్తాంతము జరిగినది? తండ్రీ! హరుడు స్వయముగా ఏమి చేసినాడు?(1)

బ్రహ్మఇట్లు పలికెను -

తరువాత నేను ప్రసన్నుడనై పరమేశ్వరుడగు శివుని దోడ్కొని వచ్చుటకై, హిమవత్పర్వము నందున్న ఆ మహాదేవుని వద్దకు వెళ్లితిని (2). సృష్టి కర్తనగు నేను వచ్చుచుండుటను గాంచి ఆ వృషభధ్వజుడు తన మనస్సులో సతీ దేవిని పొందే విషయములో అనేక సంశయములకు దావిచ్చెను (3). అపుడు హరుడు ప్రాకృత జనుని వలె లోకపు తీరును పాటించే లీలను చే గొన్నవాడై సతీదేవియందలి ప్రేమతో, నన్ను ఉద్దేశించి ప్రీతిపూర్వకముగా వెంటనే ఇట్లు పలికెను (4).

ఈశ్వరుడిట్లు పలికెను -

దేవతలలో పెద్దవైన ఓ బ్రహ్మా! నా మనస్సు వియోగ దుఃఖముచే బ్రద్దలు కాకముందే చెప్పుము. నీ కుమారుడు సతీ విషయములో ఏమి చేయును?(5). 

హే సురజ్యేష్ఠా! ఈ సతీవియోగము తన్మూలకమగు జ్వరము అధికముగా పెరుగుచున్నదై నన్ను చాల హింసించుచున్నది. ఇట్టి దుఃఖము ఇతర ప్రాణులను వీడి నన్ను పట్టుకున్నది (6). 

హే బ్రహ్మన్‌! నేను నిరంతరము సతినే ధ్యానించుచున్నాను. నేనేమి చేయవలయునో చెప్పుము. చేసెదను. నేనామెకు దూరము గాకుండా వెంటనే ఆమెను పొందే విధానమును ఆచరింపుము (7).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదమహర్షీ! ఈ తీరున లోక ప్రవృత్తితో నిండియున్న రుద్రుని మాటను విని నేనా శివుని ఓదార్చుచూ ఇట్లు పలికితిని (8). 

హే వృషభధ్వజా! సతి విషయములోనా కుమారుడు చెప్పిన మాటల నాలకింపుము. నీకు సాధ్యము కానిది లేదు. ఈ కార్యము సిద్ధించిన దని నిశ్చయించుము (9). 

నా కుమార్తె శివుని కొరకై తనువును దాల్చినది. ఆమెను ఆయనకు సమర్పించవలెను. ఈ కార్యము నాకు అభిష్టము. నీ ఆదేశము చే అది మరింత అభిష్టమగు చున్నది (10). 

నా కుమార్తె దీని కొరకై స్వయముగా శంభుని ఆరాధించి యున్నది.ఆ శివుడు కూడా నన్ను సతి కొరకు ప్రార్థించుచున్నాడు. కాన ఆమెను శివునికిచ్చి వివాహమును చేయవలెను (11). 

హే బ్రహ్మన్‌! శంభుడు శుభలగ్నములో సుమహూర్తములో కన్యా భిక్ష కొరకు నా వద్దకు వచ్చు గాక! నేను నా కుమార్తెను ఇచ్చి వివాహమును చేయగలను(12).

హే వృషభధ్వజా!దక్షడు నాతో ఇట్లు పలికినాడు. కాన నీవు శుభముహూర్తములో ఆతని గృహమునకు వెళ్లి ఆమెను తీసుకురమ్ము(13). ఈ నా మాటను విని భక్తవత్సలుడగు రుద్రుడు లోకప్రవృత్తి నాశ్రయించి నవ్వెను. ఓ మహర్షీ! ఆయన నాతో ఇట్లనెను (14).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 23 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 3 - THE FIRST RULE
🌻KILL OUT AMBITION - 2 🌻

92. When one speaks to those who desire to be part of the universal life, the very first thing that one must tell them is to kill out that which makes for separateness. There would, however, be no gain in putting such an ideal before the ordinary man. 

He cannot leap at once from the worldly life into a spiritual life in which he is in full activity, but nevertheless doing nothing connected with the personal or the individual self. If you tell an ordinary man of the world to kill out ambition, and if he does it, the effect will not be a desirable one, for he will fall into lethargy and do nothing.

93. Suppose a man is further on than that, is on the probationary path; how should he read this rule about ambition? Most wisely by applying the word kill to the lower form of ambition; he should in fact understand it to mean transmute. He should get rid of ambition for the things of the world, but put before himself something higher for which he can be ambitious. 

That would be the desire for spiritual knowledge and growth. At this stage a man does not get rid of ambition totally; he enters an intermediate state, and will make great progress if he puts before himself as his goal the attainment of spiritual knowledge and the object of finding the Master and ultimately becoming a Master himself. Really these are all ambitions, but they will help him to shake off many of the lower shackles which enwrap his personality.

94. This quality of ambition which the disciple has to kill out had its uses in his earlier evolution. It was a means to make the man’s individuality firm and steady. In the earlier stages he grew by his isolation. It was then requisite for the evolution of the physical and mental bodies that there should be competition and fighting; all those stages of combat and fight were necessary in order to build up the individual, to make him strong so that he could hold his own centre. 

He had to have a place defended from outside aggression, in which he could develop his strength. He also needed such worldly position as ambition seeks, just as when you are building a house you need scaffolding. Ambition had many uses in the earlier stages – to build up the walls and make them denser, to strengthen the will, and to help to raise the man step by step. 

A man in whom ambition predominates also kills out sexual and other lower desires, because they hinder him in his intellectual growth and his search for power, and thus he dominates his lower passions. In the early stage man thus needs ambition as a means of growth.

95. You would not say to the man of the world: Kill out ambition,” because ambition stimulates him and draws out his faculties. But when as a disciple the man is to grow into the spiritual life, he must get rid of the walls that he built round himself in earlier stages. 

As after a house is built the scaffolding must be taken away, so the later part of the man’s evolution consists in rendering the walls translucent, so that all life may pass through them. Therefore these rules are for disciples, not for the men of the world.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 154 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 28 🌻*

197. దురాత్ములు, పాపం చేస్తున్న వాళ్ళు కూడా కొందరు, చిరంజీవులుగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు పుణ్యం చాలా ఉంటుంది. అది పూర్వపుణ్యం. 

198. ఇప్పుడు చేసేదే పాపం, వాడి చిట్టాలో ఉన్న అపరిమితమయిన పుణ్యం క్షయిస్తే తప్ప వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆ పుణ్యంకూడా పోవాలంటే వాడిచేత ఏదో తక్షణమైన మహాపాపం ఒకటి చేయించాలి. 

199. అట్టి పాపం చేసినపుడు పూర్వపుణ్యం వెంటనే ఖర్చయేటటువంటి పాపచిమితన వాడిలో ప్రవేశపెట్టి, వాడిచేత ఏదో పెద్దపాపం చేయించి వాడిపుణ్యం ఖర్చు పెట్టించి, వాడిని చంపించి లోకోపకారం చేస్తారు నారదమహర్షి వంటి కర్మతత్త్వవిదులు.

200. “ఈ లోకంలో మనుష్యుడు జీవితకాలంలో, ఎప్పుడైనా ఒక్కమారైనా ముక్తిని కోరకపోతే, ఆ మునుష్యుడు ప్రతీజన్మలోకూడా ముక్తికి దూరమైపోతూ ఉంటాడు. ‘నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా!’ అని ముక్తికోరకపోతే, అది ఏ నాటికీ లభించదు. 

201. ‘నేను పుణ్యాలు చేస్తూనే ఉన్నాను, యజ్ఞాలు చేస్తున్నాను. నాకు ప్రతీజన్మలోనూ ఆయుర్దాయం బాగానే ఉంది. సుఖంగానే ఉన్నాను. నాకు ముక్తెందుకు?’ అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. 

202. వాడు ఆ ముక్తికి మరింతగా దూరమైపోతూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఏ కొంచమైనా కోరిక ఉండితీరాలి. అలా ముక్తియందు కోరికలేనివాళ్ళకు, ఆ కోరికను వాళ్ళ హృదయాల్లో కలుగజేయవలసిన ధర్మం బ్రహ్మణులదే సుమా! ఎప్పుడో వినగవినగా ముక్తియందు వాళ్ళకు కాంక్ష కలుగవచ్చు. 

203. అయినా ఆ వెంటనే వాళ్ళు అందుకు ఉద్యుక్తులు కాకపోవచ్చు. ఆ భావనలో ప్రవేశించకపోవచ్చు. ఎప్పుడో ఒక్కక్షణం, అపరిమితమైన దుఃఖం కలిగినప్పుడు, లేదా ఇతరుల దుఃఖాన్ని చూచినప్పుడు, ‘ఈ జన్మకు ముక్తి ముఖ్యంకదా, దానికంటే గొప్పవస్తువు లేదు’ అనే ఒకభావం నువ్వు కలిగించాలి. అది నీ ధర్మం” అని శుకుడికి బోధచేసాడు నారదమహర్షి.

204. తీసుకోవటం అనేది సంసారంలో మోక్షానికి వ్యతిరేకదిశలో వెళ్ళే మార్గం. మోక్షానికి సమీపవర్తి కాదు. ‘సర్వారంభ పరిత్యాగం’ అనేది సులభమైన మాటకాదు. భగవద్గీతలో భగవంతుడు వాడిన మాట అది. 

205. సర్వారంగ పరిత్యాగం అంటే, ఏ కార్యక్రమమూ ఆరంభించని సోమరితనం అని అర్థం కాదు. ఫలమందు అనాసక్తి, తానుకర్తగా ఆరంభించనివాడని అర్థం. అట్టివాడు ఉత్కృష్టమైన జ్ఞానస్థితికి వెళతాడు. ఎందుకంటే, నేను చేస్తున్నాననే భావన పుణ్యాన్నో, పాపాన్నో ఇస్తుంది. 

206. అందుకే మోక్షేఛ్ఛఉన్నవాడికి, మనస్సులో నిస్సంగుడివై ఉండమని బోధించడమే సరియైనది అని చెప్పాడు నారదుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 108 / The Siva-Gita - 108 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 14
*🌻. పంచ కోశో పాసన - 4 🌻*

సాతు జ్ఞానేంద్రి యైస్సార్ధం - విజ్ఞాన మయ కోశతః,
ఇహ కర్త్రుత్వాభి మానీస - ఏవతు ణ సంశయః 16
ఇహ ముత్ర గతిస్తస్య - జీవో వ్యావహారికః,
వ్యోమాది సాత్త్వికం శేభ్యో- జాయంతే దింద్రి యాణితు 17
వ్యోమ్న శ్శ్రోత్రం భ్రువో ఘ్రాణం - జలాజ్జి హ్వాధ తేజసః,
చక్షుర్వా యోస్త్వ గుత్పన్నా - తేషాం భౌతిక తాతతః 18
వ్యోమాదీనం సమస్తానాం - సాత్వికాం శేభ్య ఏవతు,
జాయతే బుద్ది మనసీ - బుద్ధి: స్యాన్నిశ్చ యాత్మికా 19
వాక్పాణి పాద పాయూ పస్థాని - కర్మేంద్రి యాణి తు,
వ్యోమాదీ నిరజోం శేభ్యో - వ్యస్తే భ్యస్తాన్య నుక్రమాత్ 20

ఈ లోకమున సర్వ కార్యము లందును నేనే చేయుచున్నాను అను కర్త్రుత్వాభిమానము ఐహిక, సారత్రిక గతులు, సత్కార్మా చరణము మొదలగునవి యన్నియు నా విజ్ఞాన కోశాంతర్గ తతునకే వర్తించును. వీడే జీవుడని వ్యవహరింప బడుచున్నాడు.  

పంచ ఆహా భూతంబుల సాత్విక భాగముల నుండి జ్ఞానేంద్రియములు పుట్టు చున్నవి. ఆకాశము నుండి శ్రోత్రేంద్రియము భూమి నుండి జ్ఞానేంద్రియము, జలము నుండి జిహ్వేంద్రియము, తేజస్సు నుండి చక్షరింద్రియము, వాయువు నుండి త్వగింద్రియములు పుట్టుచున్నవి. 

పంచ భూతముల నుండి పుట్టినవి కనుకనే పాంచ భౌతికములని పేర్లున్నవి. (వ్యవహరించ నగును) 

ఈ పంచ మహా భూతముల యొక్క సాత్విక భాగముల నుండే బుద్ది మనస్సు పుట్టినవి. అందు బుద్ది నిశ్చయాత్మకము. మనస్సు సంశాయాత్మకము, ఇట్టి పంచ మహా భూతములు వ్యస్తము లైన రజోంశముల నుండి వేర్వేరుగా పాణి , పాయువు, ఉపస్థ యను కర్మేంద్రియములు ఉద్భవించినవి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹  

*🌹 The Siva-Gita - 108 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 14
*🌻 Panchakoshopasana - 4 🌻*

The feeling of ''I'm the one who is the cause of all the karmas of this universe ', Aihika (this world's), Paratrika (of heaven), good deeds etc. everything belongs to the Vijnanakosamayam. 

He is being called as Jiva. Jnanendriyas (sense organs) are generated from the Satvika (pure) portions of the panchamahabhutas (five divine elements). Srotrendriyam was generated from sky.

From earth came Jnanendriyam, from water came the Jihvendriyam, from fire came Chakshuendriyam, from Air came twakendriyam. Because these have taken birth from Panchabhutas, they are called as Paanchabhoutikam.

Again from the Satwik nature of these panchabhutas Buddhi (intellect) and manas (mind) have taken birth. 

In that the Buddhi is the one which makes teh decisions (nishchayatmakam). Manas is fickle (Sanshayatmakam). from the Rajas quality of the Panchabhutas Pani, Padam, Vayu, Upastha etc. karmendriyas (motor organs) got generated. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 217 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 66. Who has the knowledge 'I am'? Somebody in you knows the knowledge 'I am', 'you are'. Who is it? 🌻*

As you stay focused on the 'I am,' the question "Who is watching the 'I am'?" will occur to you. There has to be something in you that knows the 'I am' or that 'you are'. 

How come 'you were not' and now 'you are'? 

This transition from 'I am not' to 'I am', how did it occur? Was there any volition in it or did it occur spontaneously? Who is it that knows this appearance and disappearance of 'I am'?
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 93 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 15 🌻*

393. సృష్టిలో చిన్నదిగాని గొప్పదిగాని ఏమి జరిగినను అది భగవత్సంకల్పము ప్రకారమే జరుగును.

394. సూక్ష్మలోక మందలి నాల్గవ భూమిక యందలి అనంత ప్రాణము, భౌతిక ప్రపంచమందలి అణుశక్తి వంటిది మాత్రముకాదు. సమస్తజీవనాధారమగు శ్వాస సంభందమైన ప్రాణము.

ఈ అనంత ప్రాణశక్తి సమస్త వస్తువులు సజీవములగుటకు కారణాభ్యతమగును. ఈ భూమికయందు మానవస్థితిలోనున్న భగవంతుడు ధూళినుండి సజీవ వస్తువులను సృజించగలడు.

ఈ ప్రాణసతి ఎంత అనంతమై యునప్పటికీ, భగవంతుని అనంతశక్తితో సరికాదు. భగవంతుని అంతాసక్తి ప్రకృతిలో అనంత ప్రాణశక్తిగా రూపాంతరమందిన అనంతశక్తియొక్క పరిమిత లక్షణము.

395. సూక్ష్మలోక మందలి నాల్గవ భూమిక యొక్క చైతన్యము కలిగిన మానవ స్థితిలోనున్న భగవంతుడు అనంత ప్రాణశక్తిభాండారమునకు అధిపతి. మనోమయ ప్రపంచముయొక్క మానసికలక్షణములైన తీవ్ర వాంఛలను, తీవ్ర వికారములను, తీవ్రభావములను తీర్చుకొనుటకు ఉద్యుక్తుడైయుండును. తీవ్రవాంఛలచే దహింపబడుచుండును. తన అధీనమందున్న అనంత ప్రాణశక్తిని ప్రయోగించుటకు కుతూహులుడై యుండును. ఊత్కృష్ట స్థాయిలో మానసికతలము నుండి వాంఛలుదయించు చుండును.

 సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 56 / Sri Vishnu Sahasra Namavali - 56 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*🌻 56. అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |*
*ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ‖ 56 ‖ 🌻*

*చిత్త నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం* 

 🍀 521) అజ: - 
పుట్టుకలేనివాడు.

🍀 522) మహార్హ: - 
విశేష పూజకు అర్హుడైనవాడు.

🍀 523) స్వాభావ్య: - 
నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.

🍀 524) జితమిత్ర: - 
శత్రువులను జయించినవాడు.

🍀 525) ప్రమోదన: - 
సదా ఆనందమునందుండువాడు.

🍀 526) ఆనంద: - 
ఆనందమే తన స్వరూపముగా గలవాడు.

🍀 527) నందన: - 
సర్వులకు ఆనందము నొసగువాడు.

🍀 528) నంద: - 
విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.

🍀 529) సత్యధర్మా - 
సత్య, ధర్మ స్వరూపుడు.

🍀 530) త్రివిక్రమ: - 
మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 56 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*🌻 56. ajō mahārhaḥ svābhāvyō jitāmitraḥ pramōdanaḥ |*
*ānandō nandanō nandaḥ satyadharmā trivikramaḥ || 56 || 🌻*

🌻 521. Ajaḥ: 
'A' means Mahavishnu. So the word means one who is born of Vishnu i.e. Kama Deva.

🌻 522. Mahārhaḥ: 
One who is fit for worship.

🌻 523. Svābhāvyaḥ: 
Being eternally perfect He is naturally without a beginning.

🌻 524. Jitāmitraḥ: 
One who has conquered the inner enemies like attachment, anger, etc. as also external enemies like Ravana, Kumbhakarna etc.

🌻 525. Pramōdanaḥ: 
One who is always joyous as He is absorbed in immortal Bliss.

🌻 526. Ānandaḥ: 
One whose form is Ananda or Bliss.

🌻 527. Nandanaḥ: 
One who gives delight.

🌻 528. Nandaḥ: 
One endowed with all perfections.

🌻 529. Satyadharmā: 
One whose knowledge and other attributes are true.

🌻 530. Trivikramaḥ: 
One whose three strides covered the whole world.

Continues...
🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment