భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 93


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 93 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 15 🌻

393. సృష్టిలో చిన్నదిగాని గొప్పదిగాని ఏమి జరిగినను అది భగవత్సంకల్పము ప్రకారమే జరుగును.

394. సూక్ష్మలోక మందలి నాల్గవ భూమిక యందలి అనంత ప్రాణము, భౌతిక ప్రపంచమందలి అణుశక్తి వంటిది మాత్రముకాదు. సమస్తజీవనాధారమగు శ్వాస సంభందమైన ప్రాణము.

ఈ అనంత ప్రాణశక్తి సమస్త వస్తువులు సజీవములగుటకు కారణాభ్యతమగును. ఈ భూమికయందు మానవస్థితిలోనున్న భగవంతుడు ధూళినుండి సజీవ వస్తువులను సృజించగలడు.

ఈ ప్రాణసతి ఎంత అనంతమై యునప్పటికీ, భగవంతుని అనంతశక్తితో సరికాదు. భగవంతుని అంతాసక్తి ప్రకృతిలో అనంత ప్రాణశక్తిగా రూపాంతరమందిన అనంతశక్తియొక్క పరిమిత లక్షణము.

395. సూక్ష్మలోక మందలి నాల్గవ భూమిక యొక్క చైతన్యము కలిగిన మానవ స్థితిలోనున్న భగవంతుడు అనంత ప్రాణశక్తిభాండారమునకు అధిపతి. మనోమయ ప్రపంచముయొక్క మానసికలక్షణములైన తీవ్ర వాంఛలను, తీవ్ర వికారములను, తీవ్రభావములను తీర్చుకొనుటకు ఉద్యుక్తుడైయుండును. తీవ్రవాంఛలచే దహింపబడుచుండును. తన అధీనమందున్న అనంత ప్రాణశక్తిని ప్రయోగించుటకు కుతూహులుడై యుండును. ఊత్కృష్ట స్థాయిలో మానసికతలము నుండి వాంఛలుదయించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/


06 Nov 2020

No comments:

Post a Comment