కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 95


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 95 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -25
🌻

కానీ, “నిశ్చయాత్మకోబుద్ధిః”- బుద్ధి అనేటటువంటిది పనిచేస్తే తప్ప, నిజానికి మానసిక వికలాంగులు అన్న వాళ్ళల్లో, ఈ బుద్ధిలోపం కూడా వచ్చేసింది.

ఒక మనస్సు లోపమే కాకుండా, బుద్ధి లోపం కూడా కలగడం వల్ల, అటు వివేచన సరిగ్గా లేదు, ఈ నిర్ణయము సరిగ్గా లేదు. దీన్ని ఏమంటారంటే, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ [I hand co-ordination] అని కూడా అంటారు. అంటే, బాగా వృద్ధాప్యం వచ్చేస్తే, ఈ న్యూరలైటిక్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల, నరాలు దెబ్బతినేసిన ప్రాబ్లం వల్ల, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ [I hand co-ordination] డేమేజ్‌ అయిపోతుంది. పార్కిన్‌సన్‌ డిసీస్‌ కూడా అని అంటారు దానిని.

వీటిలో ఏమౌతుంది? అల్జీమర్‌ డిసీజ్‌ అని కూడా అంటారు. ఇవన్నీ బుద్ధికి వచ్చేటటువంటి సమస్యలు అన్నమాట! వీటిల్లో ఏమౌతుంది? అంటే, ఆ బుద్ధి కేంద్రం డ్యామేజ్‌ అవుతుంది.

ఎప్పుడైతే అది దెబ్బతిందో అప్పుడు ఏ పనిని సక్రమంగా చేయడానికి కావాల్సినటువంటి నిశ్చయాత్మక జ్ఞానం పనిచేయదు. అంటే జ్ఞాన వ్యవస్థలోనే ఇప్పుడు మూడు నాలుగు అంశాలు చెప్పుకున్నాము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి మూట ఒకటి. మనస్సనే మూట ఒకటి. బుద్ధి అనే మూట ఒకటి. ఇవన్నీ జ్ఞానపరిధిలోనే ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మంగానే ఉన్నాయి.

ఇవన్నీ సక్రమంగా పని చేస్తేనే, నువ్వు నిర్ణయం చేయగలుగుతున్నావు. పొయ్యి మీద పాలు పెట్టావు, ఎక్కడో ఆలోచిస్తుంటావు, ఏమైపోతుంది? ఈ పాలు పొంగిపోతాయి. నువ్వు పక్కనే ఉన్నావు. కానీ, ఆబ్సంట్‌ మైండ్‌. అంటే అక్కడ లేదు బుద్ధి. ఎక్కడో ఆలోచిస్తోంది. ఏదో వ్యాకులతకు లోనైంది. ఏదో అంశాన్ని గురించి విచారణ చేస్తోంది, తద్వారా ఏమైంది? ఆ వాస్తవికమైనటువంటి స్థితిలో పనిచేయడం లేదు.

అట్లాగే, చాలా మంది కొత్త కోడలికి పరీక్ష ఏం పెడుతారు? కూరగాయలు తరగడం. ఆవెడ మాట్లాడుతూ ఉంటుంది, అత్తగారు. కోడలుగారు మాట్లాడుతూ కూరగాయలు తరగాలి. ఈవెడకేమో, మాట్లాడితే చేయి తెగిపోతుందేమో ననే భయం. ఎందుకని? దృష్టి అక్కడ పెట్టకపోతే, వంకాయల బదులు వేలు తెగుతుంది. చాలా ప్రమాదం వచ్చేస్తుంది. కానీ, అత్తగారు మాట్లాడకుండా ఉండదు. మాట్లాడుతూ ఉంటుంది. అంటే, ట్రైనింగ్‌ అన్నమాట! శిక్షణ.

అంటే, ప్రయత్న పూర్వకంగా నువ్వు నిశ్చల బుద్ధిని సంపాదించాలి. ఇంద్రియాలను అప్రయత్నంగా సామాన్య స్థితిలో ఆటోమేటిక్‌ గా పనిచేయాలి. మెషీన్‌లాగా పనిచేయాలి. ఈ శరీరం అనే యంత్రం. ఒక చిన్న యంత్ర వ్యవస్థ లాంటిది. దీన్ని పని చేయిస్తున్నటువంటిది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మక మైనటువంటి జ్ఞానం. దాన్ని పనిచేయిస్తున్నటువంటిద మనస్సనేటటువంటిది సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దానిని పనిచేయిస్తున్నటువంటిది, బుద్ధి అనేటటువంటి నిశ్చయాత్మక జ్ఞానం.

చూడండి! ఎంత వ్యవస్థ ఏర్పాటు చేయబడిందో మానవ ఉపాధిలో. ఇంత సమర్థమైనటువంటి వ్యవస్థ మన చేతిలో ఉన్నప్పటికి, దీనిని బహిరంగం వైపుకే వాడుకో గలుగుతున్నామంటే, ఎంత అసమర్థులమో అలోచించి చూడండి. ఈ రకమైన వ్యవస్థ ఏదీ కూడా అమీబా నుంచీ మనిషి వరకూ ఉన్నటువంటి జంతుజాలమునకు లేదు. వాటికి మనో వికాసము లేదు, వాటికి బుద్ధి వికాసము లేదు. వాటికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి జ్ఞాన వికాసము లేదు.

వాటికి గోళక వికాసము వరకూ మాత్రమే ఉంది. అందువల్ల ఏమైంది? అవి గోళకాలనే పరిమితికి మాత్రమే లోబడి జీవించ గలుగుతున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే, ఈ ఆంతరిక వికాసాన్ని కలిగి ఉన్నాడు.మానవుడు ఈ ఇంద్రియాలని ఆ జంతువుల వలెనే, ఆహార నిద్ర భయ మైధునాల కొరకే వినియోగించాడనుకుందాము. ఏమైంది అప్పుడు? వాటికి మనకి పెద్ద తేడా ఏముంది?

పొద్దున్న లేచాము, అంట్లు తోముకున్నాము. అన్నీ తయారు చేసుకున్నాము. కూరగాయలు పండ్లు రెడీ చేసుకున్నాము. వంట వండుకున్నాము. తినేశాం. భోంచేశాము, హాయిగా తృప్తిగా పడుకున్నాము. మళ్ళా విశ్రాంతి తీసుకున్నాము. మళ్ళా లేచాము. మళ్ళా ఏదన్నా తిన్నాము, తాగాము. మళ్ళా పడుకున్నాము. మళ్ళా లేచాము. మళ్ళా తిన్నాము, తాగాము. మళ్ళా పడుకున్నాము. ఇదే పని కదా! కాబట్టి, ఇదే రకంగా గనక మనము జంతువుల వలే జీవించామే అనుకోండి. అప్పుడు ఏమైంది? జీవితంలో సగభాగమేమో నిద్రకు పోయింది. మిగిలిన సగభాగమేమో చిత్తుశుద్ధి లేకపోయింది. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/



06 Nov 2020

No comments:

Post a Comment