✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -48 🌻
ఏమయ్యావయ్యా? అంటే నేను.. స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానము చేత, నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నాను. స్వయం సిద్ధముగా ఉన్నాను. ఏ రకమైనటువంటి విచలితమైనటువంటి మనస్సులేనటువంటి వాడిని. మనస్సు నాకు పనిముట్టు. బుద్ధి నాకు పనిముట్టు. మహతత్త్వము నాకు పనిముట్టు.
అవ్యక్తము నాకు పనిముట్టు. నేను ప్రత్యగాత్మ స్వరూపుడను అనేటటువంటి, స్పష్టమైనటువంటి నిర్ణయముతో, స్పష్టమైనటువంటి జ్ఞానముతో, స్పష్టమైనటువంటి అనుభవముతో, స్పష్టమైనటువంటి నిర్ణయంతో తాను వ్యవహరిస్తూ ఉంటాడు. అటువంటి వ్యవహారమంతా కూడా, ఇటువంటి జ్ఞానమంతా కూడా ఈ జ్ఞానమార్గమనేటటువంటి లక్షణము ఎటువంటిదయ్యా అంటే, కత్తి అంచు మీద నడవటం వంటిది.
అంటే అర్థం ఏమిటంటే, ‘అసిధార వ్రతం’ - అంటారన్నమాట! ఏ మాత్రము ఏమరపాటుగా ఉన్నా, రెప్పపాటు ఏమరపాటుతనం ఆవహించినా కత్తి అంచు మీద నడిచేటప్పుడు, కాలు ఎలా తెగిపోతుందో, అలాంటి ప్రమాదాలకు లోనయ్యేటటువంటి అవకాశం ఉన్నది.
మరల బహిర్ముఖంలో పడిపోతూ ఉంటాడు. మరలా కాలము, కాలగతిలో కొట్టుకుపోతూ ఉంటాడు.
కాలగతిలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఆ కర్మవశమున ఏది అవ్వాలో అది అయిపోతూ ఉంటాడు. ఆ సంగత్వ దోషాన్ని పొందుతూ ఉంటాడు. ఆ రకమైనటువంటి మాలిన్య ప్రభావానికి గురౌతాడు. కాబట్టి, నిరంతరాయముగా మెలకువ కలిగి ఉండాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మేలుకొమ్ము, మేలుకొమ్ము, మేలుకొమ్ము.
ఎల్లప్పుడూ మెలకువగా ఉండుము. ఎల్లప్పుడూ ఎఱుక కలిగి ఉండుము. నీదైనటువంటి స్థితిని, నీ స్వస్థితిని, నీయొక్క ఆత్మస్థితిని, నీ యొక్క నిరూపణను, నీ యొక్క స్వస్వరూప జ్ఞాన నిర్ణయాన్ని, నీ స్వప్రకాశిత్వాన్ని ఎల్లప్పుడూ నిలుపుకో!
సర్వకాల సర్వావస్థల యందును, సర్వదా శశ్వధా నిలుపుకో! నిలుపుకో అనేటటువంటి ఉపదేశంగా తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి, అటువంటి ‘అయమస్మి’ అనేటటువంటి లక్ష్యాన్ని తప్పక మానవుడు చేరాలి. ఈ అసిధారా వ్రతాన్ని తాను స్వయంగా స్వీకరించాలి.
ఎవరు ఎవరినీ ఏమీ నియమించలేరు. ఎవరు ఎవరినీ ఒక పరిస్థితికి లొంగేటట్లు చేయలేరు. తనకుతా లొంగి వచ్చుటయే జ్ఞానము.
తనకుతా అంతర్ముఖత్వమును సాధించుటయే జ్ఞానము. తనుకుతా ఆత్మసాక్షాత్కార జ్ఞానదిశగా, మనోబుద్ధులను సంయమింపచేయుటయే జ్ఞానమార్గము. ఇటువంటి జ్ఞానమార్గంలో బాగా పరిశీలనతో, బాగా అవగాహనతో, బాగా పరిజ్ఞానముతో, బాగా సూక్ష్మమైనటువంటి అవగాహనతో, మానవులందరూ తప్పక నడవాలి.
అందులో ముఖ్యముగా సాధకులైన వారు, తప్పక ఈ మార్గంలో పురోగమించాలి. అట్లా ఎవరైతే ఈ అసిధారా వ్రతాన్ని చేపడుతారో వాళ్ళు సూక్ష్మాత్మి సూక్ష్మమైనటువంటి ఆత్మను దర్శింప గలుగుతారు. బుద్ధి గుహ యందు దర్శిస్తారు. హృదయాకాశమునందు దర్శిస్తారు.
కానీ, ఇది కష్టమైనదని విద్వాంసులు చెబుతూఉంటారు. విద్వాంసులు అంటే ఎదిగిన వారు, పండితులు. ఎవరైతే ఈ ఆత్మవిచారణ మార్గంలో ప్రవేశించి, ప్రయాణము చేసి, ఆ అనుభూతిని పొందినటువంటి విద్వాంసులు ఉన్నారో, వారంతా కూడా ఎంత కష్టమైనదైనా సాధించవలసినదే. ‘దుర్లభం మానుష దేహం, దుర్లభం త్రయమేవచ’ అని అంటుంది వివేకచూడామణి.
మూడు దుర్లభం. అంటే కష్టసాధ్యమైనప్పటికీ తప్పక మానవుడు సాధించాలి. అర్థమైందా అండి? కాబట్టి, ‘మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం’ ఈ మూడూ కూడా మానవుడు తప్పక సాధించాలి.
మానవత్వంతో జీవించకపోతే మానవుడవై ప్రయోజనమేముంది? అట్లాగే ముముక్షుత్వం లేకుండా జీవిస్తే మానవ జీవితానికి ప్రయోజనం ఏముంది?
ఈ రెండింటికీ ఆధారభూతమైనటువంటి, సహకారభూతమైనటువంటి, సహకరించేటటువంటి మహాపురుషులను ఆశ్రయించేటటువంటి, శరణాగతి స్థితి లేకపోతే, మహాపురుషుల సంశ్రయం ఆశీర్వచనం లేకపోయినట్లయితే, వారి కృపా విశేషాన్ని పొందక పోయినట్లయితే మానవజన్మ వృధా కదా!
కాబట్టి, ఎంత కష్టమైనా సరే, దుర్లభం త్రయమేవచ. ఈ మూడు సృష్టిలో బాగా కష్టసాధ్యములు. కాబట్టి, తప్పక మానవులందరూ ప్రయత్నించి, ప్రయత్న సాధ్యముగా పొందాలి అని చెప్పి ఉపదేశిస్తున్నారు.
ఈ బోధను తెలుసుకోవడంలో, ఈ పుస్తకంలో ఏవైతే బ్రాకెట్లలో ఇచ్చారో, అవి విశేష వ్యాఖ్యలన్నమాట! ఇక్కడ మనం అర్థం చేసుకోవడం కోసమని మరల ఇచ్చారన్నమాట! పైన చెప్పినటువంటి బోధ వాక్యములకు విశేషవ్యాఖ్యగా ఇచ్చారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Dec 2020
No comments:
Post a Comment