శివగీత - 130 / The Siva-Gita - 130


🌹. శివగీత - 130 / The Siva-Gita - 130 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

చివరి భాగము

అధ్యాయము 18

🌻. జపలక్షణము - 4 🌻



ఏతాం యః ప్రజపేన్నిత్యం - శృణు యాద్వా సమాహితః
ఏకాగ్ర చిత్తో యో మర్త్యో - తస్య ముక్తి : కరే స్థితా 21

అత శ్శ్రుణు ద్వం మునయో - నిత్యమేతాం సమా మితా:,
అనాయాసే నైవ ముక్తి - ర్భవితా నాత్ర సంశయః 22

కాయ క్లేశో మనః క్షోభో - ధన హాన్నిర్మచాత్మనః,
ణ పీడా శ్రవణా దేవ - యస్మాత్కైవల్య మాప్నుయాత్ .

శివగీతా మతో నిత్యం -శృణు ద్వం ముని సత్తమా:,
అద్య ప్రభ్రుతి నస్సూత! - త్వమాచార్య: పితా గురు: 23

అవిద్యా యా: పరం పారం - యస్మాత్తా ర యితాసినః,
ఉత్పాదక బ్రహ్మ దాత్రో - ర్గరీయాన్ బ్రహ్మదః పితా 24

తస్మాత్సూ తాత్మజ ! త్వత్త - స్సత్యం నాన్యోస్తి నో గురు :
ఇత్యుక్త్యా ప్రయయు స్సర్వే - సాయం సంధ్యా ముపాసితుమ్,
స్తువంత స్సూత పత్రం తే -సంతుష్టా గో మతీ తటమ్ 25


ఇతి పద్మ పురాణే శివ గీతాయాం అష్టాదశో ధ్యాయః

అంతటితో రాముడు కృతార్ధుడ నైతి నను కొనెను. ఇట్లు నాచే సంక్లిప్తముగా నీ శివ గీత నుపదేశింప బడినది. ఇట్టి పరమ పవిత్రమైన శివ గీతను ప్రతి దిన మెవరైతే పటింతురో వినెదరో ఏకాగ్ర చిత్తము గల వారెవరో అట్టి వారికి ముక్తి "కరతలామలకము " వంటిదని గ్రహించవలెను.

కావున ఓయీ మునులారా! ఇట్టి శివ గీతను ప్రతి నిత్యము నిర్మలమైన భక్తితో నాలకించండి. అనాయాసముగా ముక్తి లభించును.

దీనికి కాయ క్లేశము గాని, మనస్సునకు క్షోభము గాని, ధనము ఖర్చు గాని, దేహమునకు పీడ గాని లేదు. కేవలము శ్రవణము గావించుటచే తనే మోక్షము లభించును. కనుక మునిపుంగవులారా! శివ గీతను తప్ప కుండా నాలకించండి.

తరువాత ఋషు లిట్లు పలికిరి: ఇటువంటి సూత్ర పౌరాణికా ! నీవే మాకు ఒజ్జవు (గురువు ) తండ్రివి, ఆచార్యుడవు మాయ జ్ఞానమును పార ద్రోలి మమ్ముద్దరించి నాడవు. కన్న తండ్రి ,జ్ఞాన మొసగు వారిలో జ్ఞానప్రదు డైన తండ్రే అధికుడని యున్నది.

కనుక ఓయీ ! సూత పుత్రా ! మాకు నీవే గురు శబ్ద వాచ్యుడవు. అని మిగుల కొని యాడిరి. పురాణ కర్త యగు వ్యాసుడు ఆదేశించెను.

ఇట్లు పలికి వారందరు సాయం సంధ్యా వందనము లాచరింప సూతుని కొని యాడుచు ఆనంద తుందిలురై గోమతీ నదీ తీరమునకు పోయిరి.

ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతంబైన శివ గీత యందు పదెనెనిమదవ అధ్యాయము

శివమ్, భూయాత్, పరి సమాప్తము.

ఓం శాంతి: శాంతి: శాంతి రస్తు

🌹 🌹 🌹 🌹 🌹



🌹 The Siva-Gita - 130 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 18

🌻 Japa Lakshanam - 4 🌻


Suta continued:

Rama felt blessed and satisfied with that discourse. In this way this Shiva Gita has been narrated in a summarized way by me.

Every day one who reads this divine & sacred Shiva Gita or listens to it daily with firm faith and mind; for such a person Mukti (liberation) is Karatalamalakam (dirt of the hands).

Therefore O sages, recall this divine Shiva Gita regularly in your minds with devotion, you would get liberation without putting much efforts.

Purity of body, hearts sorrow etc. do not become a barrier for this Gita study. Similarly to study Shiva Gita there is neither any expenditure of money involved, nor there would be any pain to the body. Just by mere listening to this gives liberation.

Therefore O sages study this Shiva Gita definitely.

Sages said: o great Sage Suta! You are our Guru our Sire and our Acharya (preceptor). You have erased our ignorance and blessed us with knowledge. Between the father and the Guru scriptures rank the Guru higher than the father since he gives knowledge.

Hence O Suta! for us you are the only guru. Salutations! Vyasa said: Having praised Suta in this way, all those Saunaka sages went to Gomati river bank to perform Sayam Sandhya Vandanam austerity.

Here ends the 18th chapter of Shiva Gita from Padma Purana Uttara Khanda.

Here ends the Siva-Gita. 🙏


🌹 🌹 🌹 🌹 🌹


01 Dec 2020

No comments:

Post a Comment