ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 121, 122 / Sri Lalitha Chaitanya Vijnanam - 121, 122 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖
🌻 121. 'భయాపహా' 🌻
భయమును అపహరించునది శ్రీదేవి అని అర్థము.
భయమున్న చోట భక్తి లేనట్లే. సమస్తమును రక్షించు దైవము జీవులను రక్షింపడా? భగవంతుడు సర్వజగద్రక్షకుడని తెలిసియు, తనను రక్షించునో రక్షింపడో అని భావించుట, నమ్మకమునకు సంబంధించినది. తనపై తనకు నమ్మకమున్నచో దైవముపై కూడ నమ్మక ముండును. దైవమును ప్రార్థించువారు భయమునకు లొంగుట విశ్వాస లోపమే.
శ్రీదేవిని ప్రార్థించుట వలన భయము హరించు బడునని ఈ నామము యొక్క అర్థము. అట్లే ఇతర దేవతల విషయమున కూడ తెలుపుదురు. భక్తి మార్గమున జ్ఞానోదయ మగుచుండగ భయమను చీకటికి ఆస్కారము లేదు. సూర్యోదయమున చీకటి యుండలేదు కదా!
కావున భయపడు వారికి దైవారాధనము ఒక చక్కని పరిష్కారము. ఆరాధించువారు భయమును గూర్చి ఆలోచింప నవసరము లేదు. ప్రగాఢ విశ్వాసముతో ఆరాధించుటొక్కటే మార్గము. సమస్త భయములకు శ్రీదేవి ఆరాధన పరిష్కారమని తెలియవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 121 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bhayāpahā भयापहा (121) 🌻
She dispels fear.
Taittirīya Upaniṣad (II.9) says “having known the Brahman, he is not afraid of anything as there is none by his side”. He is with the Brahman who is always a witness; therefore Upaniṣad says that there is none with him.
Bṛhadāraṇayaka Upaniṣad (I.iv.2) says, “If there is nothing else except me, where is the question of fear”. The cause of fear is the existence of a second person. The existence of second person is felt only out of ignorance. In fact, there is no second in this universe. It is only the same Supreme Self within, who prevails in everybody which is mistaken for the second. This happens out of māyā.
The very recitation of Her name will dispel fear. Viṣṇu Sahasranāma nāma 935 is ‘bhāyapahā’.
Saundarya Laharī (verse 4) says, “Your feet are by themselves powerful to protect those in grip of fear.” But Śaṇkarā says that cycle of birth and death afflicted with saṁsāra (bondage) is known as fear. Śaṇkarā’s interpretation of fear is also confirmed by Sage Durvāsā in his Śrī Śakti Mahimnaḥ. He says jarāṁṛuti nivāraya, praying relief from the fear of birth and death.
Those who worship Her do not have the fear of birth and death. Mere recitation of Her name will dispel this fear.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 122 / Sri Lalitha Chaitanya Vijnanam - 122 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖
🌻 122. 'శాంభవీ' 🌻
శంభువు భార్య శ్రీలలిత అని అర్థము.
శంభువు అనగా పరమ శివుడు. అతడు శ్రీలలితచే నిర్మితమగు నవావరణ సృష్టి చక్రమందు ఎచట స్థితిగొని యున్నను, శమము శాంతితోనే యుండును. అతడు శంకరుడు కదా! శంభువాతడే. శివుడు అనుటలో శుభము కలిగించువాడని తెలియును. ఎక్కడ శమము, శాంతియున్నవో అచట ప్రజ్ఞ స్థిరత్వము చెందియుండును.
సృష్టికి స్థిరత్వము కలిగించువాడు కూడ శంభుడే. అన్నిటిని అమ్మ సృష్టి చేయగా దానియందు స్థిరముగా నిలిచి స్థిరత్వము నందించు వాడు శంభుడు. ఉండువాడు శంభుడు కాగ క్రీడించునది శాంభవి.
అతడు లేని ఆమె లేదు. శాంభవీ దేవి శాంతి దాంతులను, శమమును ప్రసాదించ గలదు. అట్లనుగ్రహము పొందినవారు శివతత్వమున నిలుపగలరు. అట్టివారామెకు ప్రియులు.
శాంభవీ దీక్షాపరులు లోపలను, బయటను క్రీడించుచున్న శివశక్తులను మాత్రమే దర్శించుచుందురు. ఇట్టివారు సంసార చక్రమున బడరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 122 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Śāṃbhavī शांभवी (122) 🌻
Śiva is known as Śāṃbhu and His wife is Śāṃbhavī. Viṣṇu Sahasranāma nāma 38 is Śāṃbhavae which is interpreted as ‘the one who gives comforts to devotees’. In that way both Śiva and Lalitāmbikā give comfort to their devotees.
There is a mudra called śāṁbhavi mudra which is generally used in Kuṇḍalinī meditation. Focusing both the eye balls internally towards ājña cakra and lifting the consciousness upwards, by correspondingly raising the eye balls is śāṁbhavi mudrā. There are other interpretations also.
There are three types of dīkṣā-s (initiations) and one among them is śāṁbhavi dīkṣā. The other two are śākti and māntri.
Worshippers of Śiva are called śambhavā-s. She is the mother of śambhavā-s. Saundarya Laharī (verse 34) says, śarīraṁ tvaṁ śambhoḥ meaning ‘You (Śaktī) are the body of Śiva. The next verse says śiva yuvāti bhāvena meaning ‘assuming the role of Śiva’s wife’. Such narrations are in plenty to affirm that She always remains as a part of Śiva, both physically and mentally.
Śāṃbhavī also refers to a young girl of eight years. There is a ritual by name kanyā pūja explained in Devi Bhāgavata (III.25 and 26) about worshipping Her in the form of girls of of different ages. If such a ritual is performed as per the prescribed method, it is said that the devotee will become prosperous and wealthy.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
01 Dec 2020
No comments:
Post a Comment