భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 205


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 205 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. చ్యవనమహర్షి-సుకన్య - 2 🌻


07. అశ్వినీ దేవతలు తనింటికి ప్రత్యేకంగా వచ్చి, తన భార్యతో మాట్లాడి తనయందు ఇంత అనుగ్రహం చూపించి, తనకు యవ్వనాన్ని ఇచ్చారుకదా అని వారికి ప్రత్యుపకారం చేయదలచి “సోమయాగంలో మిమ్మల్ని సోమపీథులను చేసేటటువంటి పని నేను చేస్తాను” అని వాగ్ధానం చేసాడు చ్యవనుడు.

08. అపకారికికూడా ఉపకారం చేసి తనకున్నటువంటి అభేద భావాన్ని చాటిచెప్పాడు. మన ఋషులలో ఇదే మనకు గ్రంచవలసిన రహస్యం. ఎదుటి వాళ్ళలోని రజస్తమోగుణాల ప్రకోపములను అణచివేయటంకోసం కోపం నటించి శాపాయుధంతో ఎదుటివాళ్ళను సరిఅయిన దారిలోపెట్టి, వెంటనే తమ ఆయుధాన్ని ఉపసమ్హరించుకునే మహాశక్తిసంపన్నులు వాళ్ళు. వాళ్ళకు, మనకు పోలికలేదు.

09. ఒకదానితో మరొకటి పొసగని మాటలు అనేకం ఉంటాయి పురాణం నిండా. అవి సమస్యలే! ఎందుచేతనంటే ఆ రోజుల్లో పురాణాలు అనేకమంది వ్రాసారు. మనకు ఆ రోజుల్లో సెంట్రల్‌లైబ్రరీలుగాని, గ్రంధాలపై హక్కులుగానీ ఏమీ లేనటువంటి కాలంలో పురాణాలు బ్రతికి నేటివరకూ ఉన్నాయంటే ఆశ్చర్యమే!

10. వేలవేల సంవత్సరాలు ఈ పురాణాలు, ప్రెస్‌లు లేకపోయినా ఇంకా బ్రతికుండటం ఆశ్చర్యం కాదా! ఆ రోజుల్లో గ్రంధాలు ఎలా వ్యాప్తి చెందాయంటే – ఉదాహరణకు ఒక పురాణం ఒకరింట్లో ఉన్నదని తెలిస్తే, దక్షిణభారతదేశంలో ఎక్కడో వారి ఇల్లు ఉందంటే, అది తెలుసుకోవాలన్న ఆసక్తిగలవారి గ్రామం మరేక్కడో ఉత్తరభారతం అయినప్పటికీ; అంతదూరమూ నడిచివచ్చి, ఆ గ్రంధానికి నకలు వ్రాసుకోవడం జరిగేది.

11. అన్నిరోజులూ ఆ ఇంటి గృహస్థే వారికి భోజనంపెట్టడమూ జరిగేది! అదీ వ్యవస్ఠ. ఒక ప్రతికి ఇంకొకప్రతి తయారయ్యేసరికి ఒకఏడాది పడితే, ఆ ఏడాది పొడుగునా మరొకరు భోజనం పెట్టటం! ఇప్పుడు పుస్తకాల ముద్రణ చాలాఖర్చుతో కూడుకున్నదని మనమంతా అనుకుంటున్నాము. కాని గతంతో పోలిస్తే ఇది ఏపాటిది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2021

No comments:

Post a Comment