✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 23 🌻
581. పరమాత్మ స్థితి యందున్న భగవంతుడు పరాత్పర స్థితిలోనికి వెనుకకు మఱలడు. తాను అనంత జ్ఞాన శక్యానందములైన అనంత అస్తిత్వమై యుంటిననియు, ఉన్నాననియు ఉందుననియు అతనికి తెలియును, పరాత్పర స్థితి తన యొక్క మూల స్థితియని కూడా తానెరుగును.
582. ఏకత్వ అస్తిత్వము:- ఎఱుక గల అద్వైత స్థితి - పంచ ఆవిష్కరణలలో నిధి యొకటి. సత్య గోళములో ఎఱుకతో కూడిన ఏకత్వము.
583. సిద్ధ పురుషులైన సద్గురువు, అవతారపురుషుడు, తమ ఉద్యోగాననంతరము దేహములను చాలించిన తరువాత ఈ స్థితిలో B స్థితిలో నిష్క్రమింతురు.
584. సత్య గోళము:-
ఈ గోళము స్వయం రక్షకమైనది. శాశ్వతతత్వములో "అహం బ్రహ్మాస్మి" యనెడు భగవంతుని స్థితియందు ఎఱుక కలిగియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Jan 2021
No comments:
Post a Comment