శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 175 / Sri Lalitha Chaitanya Vijnanam - 175
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 175 / Sri Lalitha Chaitanya Vijnanam - 175 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖
🌻 175. 'భవనాశినీ' 🌻
జనన మరణములను నశింపజేయునది శ్రీదేవి అని అర్థము.
జనన మరణములు లేని జీవులకు అవి యున్నట్లుగా తోచుటే అజ్ఞానము. ఈ అజ్ఞానమునుండి శ్రీమాత తన భక్తులను ఉద్ధరించును. జ్ఞానభిక్ష నొసగి అజ్ఞానము నశింపజేయును. దేహి, దేహములు మనిషి, అతని దుసుల వంటివి.
దుస్తులు మార్చునట్లుగా జీవుడు దేహమును మార్చును. దుస్తుల కాయుర్దాయ మున్నది. అవి ఒక జీవితకాలమున ఎన్నియోమార్లు మార్చబడు చున్నవి. చివికి, చినిగి, నశించు దుస్తులవలన మనిషికి దుఃఖము కలుగుచున్నదా? మరియొక దుస్తులను ఏర్పరచుకొనునేగాని, దుస్తులతోపాటు నశింపడు. అట్టివే దేహములు. అవి నశించుట కాల క్రమమున జరుగును. జీవుడు నశించుట యుండదు. కాలక్రమమున అతనికి కారణము, సూక్ష్మము, భౌతికము అను దేహములు ఏర్పడును.
అందున్నపుడు వానివలన కలుగు ఆకర్షణకు లోనైనపుడు, వానిదైన స్వభావమేర్పడును. వివిధములగు కోరిక లేర్పడును. అవి కారణముగ లింగ శరీరము, కామ శరీరము కూడ ఏర్పడును. ఇవి వికృతములు, స్వయంకృతములు. శ్రీదేవి ఇచ్చిన కారణ, సూక్ష్మ, భౌతిక శరీరములు ప్రకృతములు కాగ, స్వభావము, కోరికలు కారణముగ ఏర్పరచుకున్న లింగదేహము, కామదేహము వికృతములై బాధించును. వీని వలన అజ్ఞానము జనించును.
నిప్పువలన పుట్టిన పొగ నిప్పును కప్పినట్లు, జ్ఞాన మజ్ఞానముచే కప్పబడును. అట్టి అజ్ఞానమునుండి బయల్పడుటకు జ్ఞానము ప్రధానము. జ్ఞానమునకు కర్తవ్య కర్మాచరణము ప్రధానము.
విధియుక్తమైన కర్మలనాచరించుచు దైవము నారాధించుచు జీవించు సంకల్పము, దైవానుగ్రహము వలననే స్థిరపడి నిలబడును. అందువలన శ్రీమాత ఆరాధనము మరణాది అవస్థలనుండి భక్తుల నుద్ధరించ గలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 175 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Bhavanaśinī भवनशिनी (175) 🌻
She destroys the cycles of birth and death of Her devotees. This cycle of birth and death is called saṃsāra. This nāma means that when She is worshipped in Her formless form, one becomes free of bondages. Bondage is the cause for saṃsāra or bondage itself is saṃsāra.
Kṛṣṇa says, (Bhagavad Gīta XII.6 and 7) “Those who depending exclusively on me, and surrendering all action to me, worship me constantly meditating on me with single minded devotion absolves them from the ocean of birth and death.” This also defines a true devotee.
It is also said that if one performs caṇḍī homa on ninth lunar day (navami tithi) he is absolved of the afflictions of saṃsāra.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment