శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 25, 26 / Sri Lalitha Chaitanya Vijnanam - 25, 26

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 16 🌹


🌹.   శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 25, 26 / Sri Lalitha Chaitanya Vijnanam - 25, 26   🌹

సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్



సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

10. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వల

కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర

🌻 25. 'శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా' 🌻

శుద్ధవిద్య లేక శ్రీ విద్య లేక షోడశీ విద్య. పరా, పశ్యంతి, మధ్యము. అది క్రమముగా వైఖరీ రూపమై ముఖము నుండి బహిర్గతమై గురువు నుండి శిష్యునకు విస్తరించును.

శబ్ద బ్రహ్మమునకు రూపము బీజము. అట్టి బీజములోని అభివృద్ధియే పరావాక్కు. దాని అంకురిత దశయే పశ్యంతి. విచ్చుకొనియు వ్యక్తముగాక యుండు ఆకుల జంట మధ్యమ. రెండు దళములు విడివడి, వికసించి, మధ్య నుండి వేరు మొలకగా నిలచుట వైఖరీ. దీనినే అంకుర మందురు. అట్టి అంకురమునకు, రెండు వరుసల దంత పంక్తులకు సామ్యముగలదు.

హల్లులు చేరని పదునారు అచ్చులు శుద్ధవిద్య. ఈ అచ్చులకు తాళువుల సంపర్కము లేదు. పదునారు అచ్చులునూ అంకురములు. ఆకుల జంట లేక పైతాళువు లేక క్రింది తాళువుల దంతములు శివశక్తులు. అట్టి ముప్పది రెండు అంకురములే ముప్పది రెండు దంతములుగ నున్నవని తెలియవలెను.

అక్షరములను చక్కగ ఉచ్చరించుట, స్పష్టముగ పలుక గలుగుట శుద్ధవిద్యకు ప్రాథమిక అర్హత. ఒత్తులు పలుకలేని వారు, ఇ, జు పలుకలేని వారు, శ, ష, స అక్షరాలను స్పష్టముగ పలుకలేనివారు ఆ జన్మమున శుద్ధ విద్య నందలేరు. ఇట్లు పలుకగల్గు సామర్ధ్యము గలవారినే శ్రీ విద్యకు గాని, వేద విద్యకుగాని గురువు లెన్నుకొందురు. అర్హత లేని వారియందు విద్య భాసించదు.

వారి వారి అర్హతలను బట్టి అర్హమైన విద్యల నందించువాడే సద్గురువు.

శుద్ధ విద్యాంకురము పొందినవారిని బ్రాహ్మణుడందురు. వారు విద్యాంకుర రూపులు. వారి పంక్తిద్వయముచే శుద్ధవిద్య ప్రపంచమున ప్రకాశించును. వారు దేవీ ముఖము నుండి బయల్పడిన వారే. అందుచే దేవీ దంతములతో సాటిలేని వారని భావము. ఈ అంశమునే బ్రాహ్మణాస్య ముఖమాసీత్' అని పురుషసూక్తము గానము చేయు చున్నది.

శుద్ధవిద్యకు ముప్పది రెండు దీక్షలు ప్రసిద్ధముగ నున్నవని తంత్రశాస్త్రము తెలుపుచున్నది. ఈ ముప్పది రెండు దీక్షలే ముప్పది రెండు దంతములు. దీక్షలు పొందిన వారందరూ కూడా ద్విజులని శాస్త్రము తెలుపుచున్నది. ఈ శుద్ధవిద్యా దీక్షయందలి ముప్పది రెండు దీక్షలునూ దీక్షిత అంతఃకరణలై నిర్వర్తించినవారు పురుషశ్రేష్ఠులు.

వారినే దేవీ ఉపాసకులు అనుట తగును.

ద్విజపంక్తి యనుటలో విశేషార్థమేమన, రెండవసారి జన్మించిన పంక్తులని అర్థము. బాలదంతములు (పాల పండ్లు) వూడి, మరల దంతములు వచ్చును గనుక ఈ దంతములు ద్విజ దంతములు.

అవిద్యా మలముతో కూడినటువంటి జ్ఞానము నశించి, శుద్ధవిద్యతో కూడిన జ్ఞానము ఉదయించుట కూడా ద్విజత్వముగ చెప్పబడును.

వీరినే బ్రాహ్మణులని, మరల పుట్టినవారని తెలుపుదురు. మొదట, మలమూత్రాదులతో కూడిన శరీరము నందు పుట్టిన జీవుడు విద్యా సాధనము ద్వారా వెలుగు శరీరమున పుట్టుటను మరల పుట్టుట అందురు. వీరికి దేహాత్మ భావనము లేక కేవలము జీవాత్మ భావనయే యుండును. అట్టి వారి మనస్సున భేదభావనము లుండవు. భేద భావనలు లేకపోవుటయే శుద్ధ విద్యకు తార్కాణము. ఇట్టివారికే పరాశక్తి సుసాధ్యము. ఇతరులకు దుర్లభము.

పైన తెలిపిన విధముగా దంతములు గలవారి చిరునవ్వు ప్రకాశవంతముగ, ఆకర్షణీయముగ, సమ్మోహనముగ నుండును. ఆ మహిమ వారి దంతముల నుండి ఉద్భవించు ఉజ్వల ప్రకాశమే. అమ్మ దంతములు మరింత మహోజ్వలముగ ప్రకాశించి సమ్మోహితులను చేయగలవని భావము.

నేను, నీవు, అతడు అను భేదములేని విద్యయే శుద్ధ విద్య. శ్రీవిద్యకు అట్టి భేదము లేదు గనుక అది శుద్ధవిద్య యగుచున్నది. విద్య-శుద్ధ విద్యగాను, అశుద్ధ (అవిద్య) విద్యగాను సృష్టియం దుండును.

అవిద్య యను మలములకు విరోధియైన శుద్ధ విద్య, షోడశీ రూపమైన విధ్య. అనగా పదునారు బీజాక్షరములతో కూడిన విద్య. ఈ బీజాక్షరములు మెరికల వంటివి. వీటినే పదహారు దంతముల జంట వరుసగా, అమ్మవారి దంతములను వర్ణించుట ఋషి సమన్వయము. అట్టి దంతముల వరుస మిక్కిలి ప్రకాశవంతముగా నున్నది.

ఉజ్వలమైన పదహారు దంతముల వరుసను నీయొక్క శుద్ధ విద్యాంకురములుగ కలిగిన దేవి యని ఈ నామము స్తోత్రము చేయుచున్నది. పదహారు దంతములు పై వరుస యందు, పదహారు దంతములు క్రింది వరుస యందు హెచ్చుతగ్గులు లేక కలిగినవారే ఈ బీజాక్షరములనెడి విద్యాంకురములను చక్కగా ఉచ్చరించగలరు. ఇతరులకు సాధ్యపడదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 25   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 25. Śuddha- vidhyāṅkurākāra- dhvijapakṅti-dvayojvalā शुद्ध-विध्याङ्कुराकार-ध्विजपक्ङ्ति-द्वयोज्वला (25) 🌻

Her teeth appear like Śuddha-vidyā, which means Śrī Vidyā. Śrī Vidyā is considered as the most secret and powerful ritual worship of Lalitāmbikā. This involves a lot of rituals and each ritual has its own meaning and interpretation.

Śuddha means pure, vidyā means knowledge and Śuddha-vidyā means pure knowledge. This is considered pure because this upāsana mārg or the cult of Śrī Vidyā worship emphasizes the non-duality, ‘I am That’ concept.

The ṣodaśī mantra is considered as the seed for Śrī Vidyā. It has sixteen bīja-s. When a seed grows into a sprout, it has two leaves. Therefore 16 x 2 gives 32, the number of teeth in human beings.

Even though teeth have two rows placed in upper and lower jaws, the jaws are attached to each other internally. In the same way soul (jīva) and (Brahman) God are considered as different out of ignorance when both remain the same. Śrī Vidyā worship is to be done in seclusion, understanding the significance and meanings of the procedures. Then only the worship yields results.

In the mantra initiation procedures of Devi, there are thirty two types of dīkśa (types of initiation). Yet another interpretation is also possible. This Sahasranāmam starts only with 32 letters out of the 51 alphabets in Sanskrit.

This 32 represents Her teeth. This could also mean that the initiation into Śrī Vidyā cult is to be done verbally by Guru to his disciple.

{Further reading on Śuddha-vidyā: This is the fifth tattva, counting from Śiva. In this tattva, the consciousness of both “I” and “This” is equally predominant.

Though the germinal universe is seen differently, yet identity runs through it as a thread. There is identity in diversity at this stage. Kriya is predominant tattva here. The consciousness of this state is ‘I am, I and also this’.

Vidyā tattva consists of Śuddha-vidyā, sahaja vidyā and kañcuka (limited knowledge). Vidyātattva consists of śuddhavidyā, sahajavidyā and vidyākañcuka. Śuddhavidyā here is the same as sadvidyā (fifth tattva), while sahajavidyā is natural knowledge (not a tattva).

Natural knowledge implies the emergence of His Freedom. As sahajavidyā (natural knowledge) is also known as śuddhavidyā (pure knowledge).}

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 26 / Sri Lalitha Chaitanya Vijnanam - 26 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

10. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వల

కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర

🌻 26. 'కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా' 🌻

కర్పూర వీటిక యనగా యాలకులు, లవంగములు, పచ్చ కర్పూరము, కస్తూరి, నాగకేసరములు, జాజికాయ, వక్కలు మొదలగు వాటి పొడి తమలపాకులతో పాటు కూర్పబడినది. దీనినే తాంబూలము అందురు. అట్టి తాంబూల సువాసన తన పది దిక్కుల యందు వస్త్రముగా గలది అని భావము. దేవి ఆవిర్భావము చెందిన వెనుక ఆమె ముఖము నుండి ప్రసరించు సువాసన పది దిక్కుల యందు దేవతల నేర్పరచెను.

వీరినే వరుసగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరఋతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఇంద్రా విష్ణువు, అగ్నా విష్ణువు అందురు. దేవి తాంబూల సువాసన నుండి ఏర్పడిన యీ దిగ్గేవతలు కేవలము ఆ సువాసనల యందు ఆసక్తి కలవారై తమ తమ కార్యములను నిర్వర్తించు చున్నారని కవి భావము.

దేవి తాంబూలపు సువాసన దశదిశలకూ వ్యాపించుటచే ఆమోద' అను పదమును మంత్రమున వాడిరి. ఆ సువాసనా వ్యాపనమునకు దిగంతరము లన్నియూ సమాకర్షణము చెందుచున్నవని భావము.

సాధకుని నోరు కూడా యిట్లు సువాసనలు పొందినచో ఆ నోటియందు అమ్మవారు నివాసమున్నట్లే! సుశబ్దములు పలుకు నోటి యందు సువాసన యుండును. నోటి దుర్వాసన నోటి వినియోగపు తీరును మార్చు కొనమని సందేశమిచ్చును. కేవలము ఖరీదైన పండ్లపొడి, పేష్టులతో నోటి దుర్వాసన నరికట్టలేము కదా!

సమ్యగ్భాషణమే నోటి సువాసనా రహస్యము. అట్టివారికి దిగ్గేవతల సహకార ముండునని కూడా తెలియవలెను. వాక్కుయే సమస్త సృష్టినీ ధరించి యున్నది గాన, వాక్కును సరి చూచుకొనువారు సువాసన వలన దిక్కుల రక్షణ కలిగియున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Lalitha Chaitanya Vijnanam - 26  🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 26. Karpūravīṭikāmodha- samākarṣi-digantarā कर्पूरवीटिकामोध-समाकर्षि-दिगन्तरा (26) 🌻

Karpūravītikā is a combination of fragrant ingredients, used to chew along with the betel leaves. The ingredients used are – saffron, cardamom, clove, camphor, kastūri, nutmeg and mace or myristica fragrans or jātipattrī (arillus of the nut also known as myristica officinalis).

The ingredients are finely powdered and mixed with powdered sugar candy. This Karpūravītikā powder when used with betel leaves for chewing gives immense fragrance and delicious taste).

When She chews this, it provides fragrance to the entire universe. Please refer nāma 559 also. In Lalitā Triśatī (containing 300 nāma-s based on Pañcadaśī mantra) nāma 14 also coveys the same meaning.

Possibly this could mean that She attracts ignorant men by this fragrance. Knowledgeable men can reach Her by devotion whereas ignorant men require inducement to obtain Her grace. This inducement is the fragrance mentioned here.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


08 Oct 2020

No comments:

Post a Comment