శ్రీ విష్ణు సహస్ర నామములు - 32 / Sri Vishnu Sahasra Namavali - 32


🌹.   శ్రీ విష్ణు సహస్ర నామములు - 32 / Sri Vishnu Sahasra Namavali - 32   🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కర్కాటక రాశి - పుష్యమి నక్షత్ర 4 పాద శ్లోకం


🌷 32. భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః |

కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ‖ 32 ‖ 🌷


🍀. భూతభవ్య భవన్నాథః -
గడచిన, జరుగుతున్న, రాబోవు కాలములకు అధిపతి.

🍀. పవనః -
వాయువు, ప్రాణము, సర్వవ్యాపకుడు.

🍀. పావనః -
పవిత్రమైనవాడు, అన్నింటినీ పావనము చేయువాడు.

🍀. అనలః -
అగ్ని, పాపములను దహించువాడు.

🍀. కామహా -
కామములను (తగని కోరికలను) దహింపచేయువాడు.

🍀. కామకృత్ -
అభీష్టములను నెరవేర్చువాడు, తగిన కోరికలను ప్రసాదించువాడు.

🍀. కాంతః -
మనస్సును దోచువాడు, మనోహర రూపుడు, సమ్మోహ పరచువాడు.

🍀. కామః -
ప్రేమ స్వరూపుడు, కోరదగినవాడు, మన్మధుడు.

🍀. కామప్రదః -
కోరికలు తీర్చువాడు, వరములు ప్రసాదించువాడు.

🍀. ప్రభుః -
అందరికంటె అధికుడు, అందరిని పాలించువాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Vishnu Sahasra Namavali - 32  🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


Sloka for Karkataka Rasi, Pushyami 4th Padam

🌷 32. bhūta bhavya bhavan nāthaḥ pavanaḥ pāvanōnalaḥ |
kāmahā kāmakṛt kāmtaḥ kānaḥ kāmapradaḥ prabhuḥ || 32 || 🌷


🌻 Bhūta-bhavya- bhavan-nāthaḥ:
One who is the master for all the beings of the past, future and present.

🌻 Pavanaḥ:
One who is the purifier.

🌻 Pāvanaḥ:
One who causes movement.

🌻 Analaḥ:
The Jivatma is called Anala because it recognizes Ana or Prana as Himself.

🌻 Kāmahā:
One who destroys the desire-nature in seekers after liberation.

🌻 Kāmakṛt:
One who fulfils the wants of pure minded devotees.

🌻 Kantaḥ:
One who is extremely beautiful.

🌻 Kāmaḥ:
One who is sought after by those who desire to attain the four supreme values of life.

🌻 Kāmapradaḥ:
One who liberally fulfils the desires of devotees.

🌻 Prabhuḥ:
One who surpasses all.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


08 Oct 2020

No comments:

Post a Comment