🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 42, 43 / Vishnu Sahasranama Contemplation - 42, 43 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 42. అనాది నిధనః, अनादि निधनः, Anādi nidhanaḥ 🌻
ఓం అనాదినిధనాయ నమః | ॐ अनादिनिधनाय नमः | OM Anādinidhanāya namaḥ
ఆదిశ్చ నిధనం చ - ఆదినిధనే. ఆది నిధనే యస్య న విద్యేతే సః అనాది నిధనః ఆదియు నిధనమును (జన్మము, నాశనము) ఎవనికి ఉండవో అతడు.
:: పోతన భాగవతము - మొదటి స్కందము (కుంతీదేవి శ్రీ కృష్ణుని స్తుతించుట) ::
మఱియు భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, రాగాదిరహితుండును, గైవల్యదాన సమర్థుండును, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూతనిగ్రహానుగ్రహకారుండును నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము.
నీవు భక్తులకు కొంగుబంగారానివి. దర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించే వాడివి. ఆత్మారాముడివి. శాంతమూర్తివి. మోక్షప్రదాతవు. కాలస్వరూపుడివి, జగన్నియంతవు. ఆద్యంతాలు లేనివాడవు. సర్వేశ్వరుడవు. సర్వసముడవు. నిగ్రహానుగ్రహ సమర్థుడవు. నీ ప్రభావాన్ని భావించి చేసే నా నమస్కారాలు స్వీకరించు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 42 🌹
📚. Prasad Bharadwaj
🌻 42. Anādi nidhanaḥ 🌻
OM Anādinidhanāya namaḥ
Ādiśca nidhanaṃ ca - ādinidhanē. ādi nidhanē yasya na vidyētē saḥ anādi nidhanaḥ. The one existence that has neither birth nor death.
Śrīmad Bhāgavatam - Canto 1, Chapter 8
Manye tvaṃ kālam īśānam anādi-nidhanaṃ vibhum,
Samaṃ carantaṃ sarvatra bhūtānāṃ yan mithaḥ kaliḥ. (28)
(Kuntīdevī praising Lord Kṛṣṇa) My Lord, I consider Your Lordship to be eternal time, the supreme controller, without beginning and end, the all-pervasive one. In showering Your mercy, You consider everyone to be equal. The dissensions between living beings are due to social intercourse.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥
స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥
Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 43 / Vishnu Sahasranama Contemplation - 43 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 43. ధాతా, धाता, Dhātā 🌻
ఓం ధాత్రే నమః | ॐ धात्रे नमः | OM Dhātre namaḥ
ధత్తేః; అనంతాది రూపేణ విశ్వం బిభర్తి అనంత నాగుడు మొదలగు రూపములతో విశ్వమును ధరించు (మోయు) వాడు. ధారణ పోషణయోః విశ్వమును పోషించువాడు అనియు అర్థము చెప్పదగును. కర్మఫలప్రదాత.
:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామయజురేవ చ ॥ 17 ॥
ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, తాతను, మఱియు తెలిసికొనదగిన వస్తువును, పావనపదార్థమును, ఓంకారమును, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములును అయియున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 43 🌹
📚. Prasad Bharadwaj
🌻 43.Dhātā 🌻
OM Dhātre namaḥ
Dhāraṇa pōṣaṇayoḥ. One who is the support of the universe. Ordainer, dispenser of the results of their actions to the creatures.
Bhagavad Gīta - Chapter 9
Pitā’hamasya jagato mātā dhātā pitāmahaḥ,
Vēdyaṃ pavitra moṃkāra r̥ksāmayajureva ca (17)
Of this world I am the father, mother, ordainer and the grand-father. I am the knowable, the sanctifier, the syllable Om as also R̥k, Sāma and Yajus.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥
స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥
Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
08 Oct 2020
No comments:
Post a Comment