శివగీత - 86 / The Siva-Gita - 86




🌹.   శివగీత - 86 / The Siva-Gita - 86   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 12 🌻


జాగ్గత్స్వప్నసుషుప్త్యాఖ్య - మేవేహాముత్ర లోకయోః |

పశ్చాత్కర్మ వశాదేవ - విస్ఫు లింగా ఇవాన లాత్ 57


జాయన్తే కారణా దేవ - మనో బుద్ద్యాది కానితు |

పయః పూర్ణ ఘటో యద్వ - న్న మిగ్నస్సలిలాశయే 58


తైరేవోద్ద్రతి ఆయాతి - విజ్ఞానాత్మాత థైత్యజాత్ |

విజ్ఞానాత్మా కారణాత్మా - తథా తిష్ఠంస్త థాపిసః 59


దృశ్యతే సత్సు తెష్వేన - నష్టే ష్వాయాత్య దృశ్యతామ్ |

ఏకాకారోర్య మాతత్త - త్కార్యేష్విన పరః పుమాన్ 60


కుటస్థో దృశ్యతే తద్వ - ద్గచ్చ త్యాగచ్చ తీవసః |

మోహమాత్రాంత రాయత్వా - త్సర్వం తస్యో ప పద్యతే 61


దేహాద్య తీత ఆత్మాపి - స్వయ జ్యోతి స్స్వభావతః |

ఏవం జీవ స్వరూపంతే - ప్రోక్తం దశర థాత్మజ 62



ఇతి శ్రీ పద్మ పురాణే శివగీతాయాం దశమోధ్యాయః

ఆ విధముగా మేల్కొన్నప్పుడు మనో బుధ్యాహంకారాది కరణ చతుష్టయము లెల్లప్పుడు అగ్నినుండి మిరుగుడుల మాదిరిగా కారణాత్మ నుండి బయలుదేరి యథాపూర్తిగా సంక్రమించును.

నీటితో నింపబడిన ఘటము నీటిలో మునిగి మరలా ణా నీటితోనే లేవ నెత్త బడి నట్లుగా జీవుడు కారణాత్మ నుండి తన శరీరమున కే వచ్చుచున్నాడు. విజ్ఞానాత్మ రూపమగు కారణాత్మ (ఈశ్వరుడు) సద్వస్తువులందు, దృశ్యుడను మరియు నని నశించ గానే అదృశ్యుడై నట్లుగా నుండును.

ఒకే రూపముగల సూర్యుడు ఎట్లుగా జలాధి భిన్నోపాధులయందు వేర్వేరుగా నగుపడునో అట్లే పరమాత్ముడు కూడ నిరాకారుడై యున్నను సవికారుని (సాకారము)గా నతడు వచ్చచు పోవుచున్నట్లు గోచరించును.

నైసర్గకముగా పరమాత్ముడు స్వయంజ్యోతి యైనప్పటికిన్ని దేహాదులకంటెను భిన్నమగు నాత్మగల వాడైనను మోహమను నంతరాయము కలుగుటచే సమస్తము వానియందే

యున్నట్లుగా గోచరించును.

కనుక రామా! జీవుని విషయమునిట్లు వివరించితిని.

ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గత మైన శివ గీతలో పది యవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   The Siva-Gita - 86   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam - 12
🌻

Mind intellect ego etc originate from the Karanatma (causal body), and spread all over.

The way a pot when immersed in water and left, it again pops out of water, in the same way a Jiva comes back to his body from his Karanatma (eswara).

The sun having one appearance appears differently in different

vessels, the same way the one formless Paramatman, appears in various forms.

Paramatman who is selfilluminating, appears as encompassing everything within himself. O Rama! this explains the concept of Jiva.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj #sivagita #శివగీత



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


08 Oct 2020

No comments:

Post a Comment