🌹. శివగీత - 104 / The Siva-Gita - 104 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ద్వాదశాధ్యాయము
🌻. మోక్ష యోగము - 5 🌻
యదా సర్వ్ ప్రముచ్యంతే - కామాయే స్యవశంగతాః,
అధ మర్త్యో మృతో భవ - త్యేతావ దను శాసనమ్ 31
మోక్షసన హివాసోప్తి - న గ్రామాంత రమే వవా,
అజ్ఞాన హృదయ గ్రంధి - నాశో మోక్ష ఇతి స్మృతః 32
వృక్ష్యా గ్రచ్యుత పాదోయ - స్సత దైవ పత త్యదః ,
తద్వజ్ఞా నవతో ముక్తి - ర్జాయతే నిశ్చితా పితు. 33
తీర్ధే చండాలగే హేవా - యది వానష్ట చేతనః,
పరిత్యజన్ దేహ మేవం - జ్ఞానాదేవ విముచ్యతే. 34
సంవీతో యేకే నాశ్న -న్భక్ష్యం వాభక్ష్య మేవవా,
శయానో యత్ర కుత్రాపి - సర్వాత్మా ముచ్యతే త్రసః 35
క్షీరా దుద్ద్రుత మాజ్యం య - తిక్షప్తం పయసి తత్పునః,
నతే నైవైక తాం యాతి -సంసారే జ్ఞానవాం స్తదా 36
నిత్యం పటతి యోధ్యాయ - మిమం రామా ! శృణోతివా ,
సముచ్యతే దేహబందా -దనాయా సేవ రాఘవ! 37
తత స్సంయత చిత్తస్త్వం - నిత్యం పట మహీపతే!
అనాయాసేన తే నైవ - సర్వధా మోక్ష మాప్స్యసి 38
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం త్రయోదశో ధ్యాయః
ఎప్పుడైతే వీడి యధీనము నందున్న సమస్త వాసనలు వదలబడుచున్నవో అప్పుడా మానవుడు ముక్తిని పొందునని విధించ బడినది, మోక్షమున కావాసమైనది. గ్రామాంతర మేదోకాదు, అజ్ఞాన మనెడు చిత్తగ్రంధి మోక్షమని యాదేశించ బడినది.
కాలు జారడముతోనే చెట్టు పై నుండి కింద బడిన మాదిరిగా జ్ఞానోదయము ఏర్పడగానే మకత్ ఇక రత లామలక మగుట నిశ్చయము. పుణ్య క్షేత్రమందు గాని చండాలుని గృహమునందు గాని చైతన్యమును వీడి దేహమును వదలనను జ్ఞానముతోనే ముక్తి నిశ్చయముగా నేర్పడును.
ఉత్తమాధములలో నెవ్వనితో కూడి యున్నను ఎక్కడ పరుండినను భక్ష్యా భక్ష్యములను భక్షించి నను జ్ఞానియగు వాడు ముక్తిని తప్పకుండా పొందును. సంసారము నందే యున్నను జ్ఞాని పాలనుండ దీయబడిన వెన్నవలె మరల పాలలో కలియునట్లుగా సంసారములో కలసి యుండడని భావము. (ఇక్కడ శ్రీ మహాత్మా బసవేశ్వరుని వచనము ప్రసంగ సంగత మైనది.)
వెన్న కరిగి నెయ్యిగా మారిన పిదప మళ్ళీ వెన్న యగునా? అట్లే శైవము నుండి వీర శైవుడైన పిదప మళ్ళీ శైవుడు కాడని యర్ధము. ఓ రామా ! ప్రతి దిన మీ యధ్యాయము నెవ్వరు పటించు చున్నారో, వినుచున్నారో అట్టి వారు తప్పక దేహ బంధము నుండి అనాయాసముగా ముక్తిని పొందుదురు.
కనుక జితేన్ద్రి యుడవై నిశ్చల మనస్సుతో నీ యధ్యాయము పటించుము దాని చే నీకనా యాస ముక్తి పొందుదురు . కనుక జితేంద్రి యుడవై నిశ్చల మనస్సుతో నీ యధ్యాయము పటించుము . దానిచే నీకనాయాస ముక్తి లభించును.
ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతమైన శ్రీ శివ గీత యందు పదమూడవ అధ్యాయము సమాప్తము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 104 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 13
🌻 Moksha Yoga - 5 🌻
When all the Vasanas present under his control gets discarded, then the Jiva gains liberation. Moksham is nothing but gaining knowledge of the self. The way with a slip of the feet falling from top of the tree to bottom becomes inevitable, similarly for a person who attained self knowledge, Moksham becomes inevitable.
The supreme consciousness doesn't leave one's self whether he is in a sacred place of pilgrimage or in an untouchable's house; this state of mind when attained, he gains liberation for sure.
Mixing with good & bad people, sleeping anywhere, eating the prohibited items, or whatever is done by a Jnani he remains untouched and his liberation remains sureshot. It implies even if a Jnani remains in samsaara, as like as cream separated from milk never dissolves in milk again, the Jnani also never falls in samsaara again.
O Rama!
One who reads or listens this chapter on 'Moksha Yoga' everyday such a one would surely get detached with the bondages of samsaara and would gain liberation. Therefore subduing your senses, with a firm mind study this chapter. With this without much efforts liberation can be obtained.
Here ends the 13th chapter of Shiva Gita from Padma Purana Uttara Khanda.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
01 Nov 2020
No comments:
Post a Comment