భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 88


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 88 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 10
🌻

రెండవ భూమిక

377. సూక్ష్మ ప్రపంచమందలి రెండవ భూమికయందు మానవ స్థితి లో నున్న భగవంతుడు పూర్తిగా సూక్ష్మ శరీర చైతన్యము కలవాడై యుండును.

378. దేవలోకము నుండి ఘనమైన శుభవార్తలు వచ్చు చుండును.

379. సూక్ష్మప్రపంచము యొక్క అనంతప్రాణశక్తి యొక్క చైతన్యమందు మొదటి భూమికలోకన్న అధికమగు ఎఱుకతో నుండును స్థూలదేహముయొక్క గాని మనస్సుయొక్క గాని చైతన్యము పూర్తిగా లేనివాడై యున్నందున భౌతిక-మానసిక అనుభవములు లేనివాడగును.

కనుక సూక్ష్మభూమిక నుండి మనశ్శరీరముల రెండింటిని ప్రత్యక్షముగా ఉపయోగించడు. అవి రెండు నూ పరోక్షముగా వినియోగపడుచుండును.

380. ఈ మానవ స్థితి యందున్న భగవంతుడు స్థూలదేహ చైతన్యము గల సామాన్యునివలెనే బాహ్యమునకు కాన్పించును. సామాన్యునివలెనే తినును, త్రాగును, నిద్రించును, చూచును, అనుభూతి పొందును, వినును, ఆలోచనలు, వాంఛలు, చిత్తవికారములు కలిగియుండును. సూక్ష్మశరీముయొక్క సూక్ష్మేంద్రియ జ్ఞానములైన చూచుట, ఆఘ్రాణించుట, వినుటయనెడు సరికొత్త సూక్ష్మ సంస్కారములను సృష్టించును.

చిన్నచిన్న శక్తులను ప్రదర్శించు శక్తిగలవాడగును.

ఉదా:- మ్రోడును చిగురింప జేయగల్గును పచ్చని చెట్టును మ్రోడుచేయును,రైళ్ళను,మోటారుకార్లను నిలుపగల్గును ఎండిపోయిన నూతిలో జలమును నింపును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


01 Nov 2020

No comments:

Post a Comment