17-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 581 / Bhagavad-Gita - 581🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 172, 173 / Vishnu Sahasranama Contemplation - 172, 173🌹
3) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 134🌹
4) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 8 🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 155 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 80 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 151 / Sri Lalita Chaitanya Vijnanam - 151 🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 492 / Bhagavad-Gita - 492 🌹

09) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 100 📚
10) 🌹. శివ మహా పురాణము - 298 🌹 
11) 🌹 Light On The Path - 53🌹
12) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 185🌹 
13) 🌹 Seeds Of Consciousness - 249 🌹   
14) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 124 🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 88 / Sri Vishnu Sahasranama - 88🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 581 / Bhagavad-Gita - 581 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 25 🌴*

25. తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతప:క్రియా: |
దానక్రియాశ్చ వివిధా: క్రియన్తే మోక్షకాంక్షిభి: ||

🌷. తాత్పర్యం : 
ఫలాపేక్షరహితముగా ప్రతివారును యజ్ఞము, తపస్సు, దానములను ‘తత్’ అను పదమును గూడి ఒనరింపవలెను. భౌతికబంధనము నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మికకర్మల ముఖ్య ప్రయోజనము.

🌷. భాష్యము :
దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి ఉద్ధరింపబడవలెనన్నచో మనుజుడు భౌతికలాభము కొరకై వర్తించరాదు. అనగా భగవద్ధామమును చేరుట యనెడి చరమలాభమును కొరకే సమస్త కర్మలను ఒనరింపవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 581 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 25 🌴*

25. tad ity anabhisandhāya
phalaṁ yajña-tapaḥ-kriyāḥ
dāna-kriyāś ca vividhāḥ
kriyante mokṣa-kāṅkṣibhiḥ

🌷 Translation : 
Without desiring fruitive results, one should perform various kinds of sacrifice, penance and charity with the word tat. The purpose of such transcendental activities is to get free from material entanglement.

🌹 Purport :
To be elevated to the spiritual position, one should not act for any material gain. Acts should be performed for the ultimate gain of being transferred to the spiritual kingdom, back to home, back to Godhead.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 172, 173 / Vishnu Sahasranama Contemplation - 172, 173 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 172. మహాబలః, महाबलः, Mahābalaḥ🌻*

*ఓం మహాబలాయ నమః | ॐ महाबलाय नमः | OM Mahābalāya namaḥ*

మహత్ బలం యస్య బలము కలవారందరిలోను బలవంతుడు అనదగిన గొప్ప బలము ఎవనిదో అట్టివాడు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
క. బలయుతులకు దుర్బలులకు, బల మెవ్వఁడు నీకు నాకు బ్రహ్మాదులకున్‍
    బల మెవ్వఁడు ప్రాణులకును, బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా! (264)

లోకంలో బలవంతులకూ, బలహీనులకూ ఎవడు బలమో - నీకూ, నాకూ, బ్రహ్మాది దేవతలకూ ఎవడు బలమో; సమస్త ప్రాణికోటికీ ఎవడు బలమో ఆ పరాత్పరుడే నాకూ బలము. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 172🌹*
📚. Prasad Bharadwaj

*🌻172. Mahābalaḥ🌻*

*OM Mahābalāya namaḥ*

Mahat balaṃ yasya / महत् बलं यस्य The strongest among all who have strength.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Śrīprahlāda uvāca
Na kevalaṃ me bhavatśca rājansa vai balaṃ balināṃ cāpareṣām,
Pare’vare’mī sthirajṅgamā ye brahmādayo yena vaśaṃ praṇītāḥ (7)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे अष्टमोऽध्यायः ::
श्रीप्रह्लाद उवाच
न केवलं मे भवत्श्च राजन्स वै बलं बलिनां चापरेषाम् ।
परेऽवरेऽमी स्थिरज्ङ्गमा ये ब्रह्मादयो येन वशं प्रणीताः ॥ ७ ॥

Prahlada said: My dear King, the source of my strength, of which you are asking, is also the source of yours. Indeed, the original source of all kinds of strength is one. He is not only your strength or mine, but the only strength for everyone. Without Him, no one can get any strength. Whether moving or not moving, superior or inferior, everyone, including Lord Brahma, is controlled by the strength of His.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 173 / Vishnu Sahasranama Contemplation - 173🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻173. మహాబుద్ధిః, महाबुद्धिः, Mahābuddhiḥ🌻*

*ఓం మహాబుద్ధయే నమః | ॐ महाबुद्धये नमः | OM Mahābuddhaye namaḥ*

మహతీ బుద్ధిః యస్య సః గొప్పదియగు బుద్ధి ఎవనిదో అట్టివాడు. బుద్ధిమంతులలోనెల్ల బుద్ధిమంతుడు.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ॥ 10 ॥

ఓ అర్జునా! నన్ను ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగ నెరుంగుము. మఱియు బుద్ధిమంతులయొక్క బుద్ధియు, ధీరులయొక్క ధైర్యమును నేనే అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 173🌹*
📚. Prasad Bharadwaj

*🌻173. Mahābuddhiḥ🌻*

*OM Mahābuddhaye namaḥ*

Mahatī buddhiḥ yasya saḥ / महती बुद्धिः यस्य सः The wisest among the wise. As He is more intelligent than the intelligent, He is Mahābuddhiḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 7
Bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha sanātanam,
Buddhirbuddhimatāmasmi tejastejasvināmaham. (10)

:: श्रीमद्भगवद्गीत - विज्ञान योग ::
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥ १० ॥

O Pārtha! Know Me to be the eternal seed of all beings. I am the intellect of the intelligent, I am the courage of the courageous.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥

Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 134 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 64 🌻*

అసలు రోజు మొత్తం మీద ‘నేను ఈశ్వరుడు’ అనే తలపు కలుగుతోందా? కలగటం లేదు కదా! నేను అది అయ్యి ఉంటే, నాకు అది తోచి ఉండాలి కదా! నా సహజ స్థితిలో నాకది ఎప్పటికీ తోచడం లేదు కదా! నేనేదో మూడడుగులు, నాలుగడుగులు వెడల్పు ఉన్నటువంటి మనిషిగానే, మానవ శరీరంగానే తోస్తున్నానే గాని, నాకు ‘నేను ఈశ్వరుడను’ అన్న తలపే రావడం లేదు కదా! మరి ఎట్లా అవుతాను నేను? అనేటటువంటి సందేహం అందరికి ఉండవచ్చు. అందుకని ప్రతి ఒక్కదానిని సనాతన ధర్మంలో ‘నాహం కర్త, హరిః కర్త’ - అనే పద్ధతిగా ప్రార్ధన చేయమన్నారు. దీనికి ‘నిష్కామ కర్మ’ అని పేరు.

    ఈ ‘నైష్కర్మ్యసిద్ధి’ ని సాధించకుండా, ఈ నిష్కామకర్మను సాధించకుండా మానవుడు ఈ అభిమానాన్ని ఏమీ చేయలేడు. అప్పుడు ప్రతీ ఒక్కరూ తప్పక సాధించవలసినటువంటి మొట్టమొదటి నియమము, సిద్ధి ఏమిటయ్యా అంటే, నిష్కామకర్మ. సర్వకర్మఫలములను నాకర్పించుము - అంటున్నాడు భగవద్గీతలో. ‘సర్వధర్మాన్‌ పరిత్యజ్య’ - అని కూడా అంటున్నాడు. ‘మాం ఏకం శరణం వ్రజ’ – శరణాగతుడవై చేయి. నీవు లేనివాడుగా చేయి. లేక ఉన్నవాడుగా వ్యవహరించు. 

ఇదేమిటండీ, ఉన్నవాడుగా వ్యవహరించాలంటేనే నానా తిప్పలు పడుతుంటే, లేక ఉన్నవాడిగా ఎట్లా వ్యవహరిస్తారు అంటే, నీ గాఢనిద్రావస్థలో నువ్వు లేవు కదా! అయినా సామాన్య వ్యవహారం చేస్తూనే ఉన్నావుగా! మరి అప్పుడు ఏమైనా విశేషాలు ఉన్నాయా? కర్మఫలం ఉన్నదా? లేదు కదా! అట్లే మెలకువలో, స్వప్నంలో కూడా సామాన్య వ్యవహారం చెయ్యి. కర్తవ్యం వరకే చెయ్యి. ధర్మం వరకే చెయ్యి. నేను కర్తను కాదని చెయ్యి. నేను భోక్తను కాదని చెయ్యి. కర్త ఈశ్వరుడు. నేను అన్న స్థానంలో ప్రతీ ఒక్కరూ కూడా ఈశ్వరుడిని పెట్టుకోవాలి.

    అందరు తల్లులు పిల్లలని పెంచుతూ ఉంటారు. నేనే ఈ పిల్లవాడిని కన్నానండి. నానా కష్టాలు పడి పెంచానండి. ఈ పిల్లవాడి చిన్నప్పుడు ఎవ్వరి సహాయం అందలేదండి. నేను అలా కష్టపడ్డానండీ, నేను ఇలా కష్టపడ్డానండి, ఎన్ని కష్టాలుపడో పిల్లవాడిని పెంచుకున్నానండి. అని పిల్లవాని తోటి మమకారానుబంధాన్ని కలిగి ఉంటారు. ఇది స్త్రీ సహజమైనటువంటి, ప్రకృతి సహజమైనటువంటి లక్షణముగా మనం స్వీకరిస్తాము. 

అయితే ఇందులో సత్యం ఎంత ఉందని మనం ఎప్పుడైనా విచారించామా? అలా విచారణ చేస్తే ఏమౌతుందంటే, ఆత్మవిచారణ దృక్పథంతో చూచినప్పడు, సర్వజీవులను సృష్టిస్తున్నవాడు ఎవడు? ఈశ్వరుడు కదా! సర్వ జీవులను పోషిస్తున్నవాడు ఎవడు? ఈశ్వరుడే కదా! మరి నేను కన్నాను అనటంలో అక్కడ నిమిత్తమాత్రపు ధర్మమే ఉంది కాని, వాస్తవికమైనటువంటి సత్యము లేదు. అట్లే, నేను పోషించాను, నేను పెంచాను అనడంలో కూడా నిమిత్తమాత్రపు ధర్మము, నిమిత్తమాత్రపు కర్తవ్యమే కలదు కాబట్టి. (అయితే) నీవేమి చేయడం లేదు అని అక్కడ చెప్పడం లేదు. కాని, ‘ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా చేస్తున్నాను’ - అనే భావన వల్ల ఈ అభిమానపు తెరను తొలగించుకోగలుగుతాము.

    అనేకమంది మనకు జీవితంలో సహకరిస్తూఉంటారు. అనేకమంది సహాయాన్ని మనం పొందుతూ ఉంటాము. పొందినప్పుడల్లా ఎవరు సహాయం చేశారమ్మా నీకు? అని నేను అడిగితే ‘ఈశ్వరానుగ్రహం’ అండి, దేవుని దయవలన నేను ఈ పనిని పూర్తిచేయగలిగాను. పూర్తి చేయగలిగాను అనడంలో కూడా అహం ఉంటుందన్నమాట. ఈ పని పూర్తి చేయబడింది. ఈ పని పూర్తి చేయడం జరిగింది. కేవలం ఈ సృష్టిలో అన్ని పనులు జరగటమే ఉంది కానీ, చేయడం లేదు. ఆ సమయానికి అన్నీ కలిసి వస్తే, అది జరుగుతోంది. ఏ ఒక్కటి లోపించినా కూడా అది జరగడం లేదు. 

మరి అట్లా కుదురుస్తున్నటువంటి కాలానికి, అలా కుదురుస్తున్నటువంటి కాలరూపుడైన ఈశ్వరుడికి, అలా ఫలితాలు వచ్చేటట్లుగా చేస్తున్నటువంటి కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడికి చెందాలే కాని, నీకు చెందటం అసమంజసం కదా! అన్యాయం కదా! అధర్మం కదా! మరి ఆ రకమైనటువంటి అభిమానాన్ని భుజాన వేసుకోవడం వల్ల, ‘మమకారము, అహంకారము’ - ఈ రెండూ బలపడుతున్నాయి. తద్వారా ‘ఈ జగత్తు నాకు భోగ్యమైనటువంటిది. 

నేను అనుభవించడానికి తగినటువంటిది’ అనేటటువంటి దృష్టితో జగత్తును చూస్తున్నాము. ఓహో! ఇది చాలా బాగుంది. ఇది ప్రియం. ఇది అప్రియం. ఈ ప్రియము, అప్రియము.... ప్రియం మోదం ప్రమోదాలుగా మారి, మోహంగా మారి, అనుభూతమౌతూ, బంధించుతూ, అభిమానగ్రస్థమయ్యేటట్లు చేస్తూ, మెల్లగా నడిపిస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 8 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 8 🍀*

సంతాంచే సంగతీ మనోమార్గ గతీ!
ఆకళావా శ్రీపతీ యేడే పంథే!!
రామకృష్ణ వాచా భావ హా జీవాచా!
ఆత్మాజో శివాచా రామజప్!!
ఏకతత్త్వ నామ్ సాధితీ సాధన్!
ద్వైతాచే బంధన్ నబాధిజే!!
నామామృత గోడీ వైష్ణవా లాధలీ! !
యోగియా సాధలీ జీవనకళా!!
సత్వర ఉచ్ఛార్ ప్రహ్లాదీ బింబలా!
ఉద్ధవా లాధలా కృష్ణ దాతా!!
జ్ఞానదేవ మణే నామ హే సులభై!
సర్వత్ర దుర్లభ్ విరళా జాణే!!

భావము:
సంతుల సాంగత్యము చేసి మనసును వేగిరపర్చుము శ్రీపతిని పట్టుటకు ఈ నామ మార్గము చాలా సులభము.. భావముతో రామ కృష్ణ నామము నాలుకతో పఠించడము జీవుడి ధర్మము. శివుని ఆత్మ రాముడు, కావున శివుడు రామ నామ జపము చేయుచున్నాడు. 

నామము ఏక తత్వము, సాధనము ఇదే, సాధ్యము కూడ ఈ నామమే, ఇలా తెలుసుకున్న వారిని ద్వైతము బంధించి బాధించదు..

నామామృతములోని మాధుర్యాన్ని వైష్ణవులు పొందినారు. యోగులు జీవించే కళలు సాధించగల్గినారు.. ప్రహ్లాదుడికి హరినామము హృదయములో నాటు కొనుటచే సత్వరమే ఉచ్చరించగల్గినాడు. 

దాతయైన శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి లభించినాడు. నామము సులభ సాధనము. నామ జపము చేయువారు మాత్రము దుర్లభము. ఎక్కడనో ఒక్క భక్తుడున్నాడు. కనుగొనుమని జ్ఞానదేవులు అంటున్నారు.

*🌻. నామ సుధ -8 🌻*

సంతులతో సాంగత్యము చేయుము
గతి తప్పిన మనసును అరికట్టుము
వేగిరపడి శ్రీపతిని పట్టుము
ఈ పంతము ఎన్నటికీ మానకుము
రామకృష్ణ నామమునే పాడుము
ఈ నామమే జీవుడి భావము
శివుని ఆత్మ రాముడని ఎరుగుము
అందుకే జపించు శివుడా నామము
ఒక్కటే తత్వము భక్తుడి భావము
సాధనతో సాధ్యము ఆ నామము
తొలగి పోయినది బంధము
ఇక నుండి బాధించదు ద్వైతము
మధురమైన నామామృతము
సులభముగ వైష్ణవులకు లభ్యము
కష్టించితే జీవన పర్యంతము
యోగులకు జీవనకళ సాధ్యము
స్మరించెను ప్రహ్లాదుడు సత్వరము
నాటుకున్నది దైవ భావము
ఉద్దవునికి అయినాడు లభ్యము
దాతయైన శ్రీకృష్ణుడు ప్రాప్తము
జ్ఞానదేవుడన్నాడు ఆ నామము
అన్నింటిలో ఈ సాధన సులభము
సాధించే సాధకులు దుర్లభము
ఉన్నారు ఏ ఒక్కరో కనుగొనుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 155 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
147

The fascinating Guru Principle has been described in the Guru Gita. We are being instructed to think about and visualize every sentence, every description in the Guru Gita. How long should one go on thinking about it? Until one reaches the stage where he has no thoughts. This stage is the highest level for thoughts. In that state, there is nothing to think about, because both have become one. The process is nothing something that can be described, nor is the state something that can be described.

Everyone says, “I have nothing in my mind. My mind is very calm”. When you say that, it means that your mind has not become calm . People keep saying all the time, “I am living for Swamiji”, “I am living for Swamiji”, “I am living for Swamiji”. When they say that is when you know that they are not living for Swamiji, but for themselves. 

Then, they keep reminding others, “I have nothing in my mind, I have no thoughts”. Such people have thoughts running like bullet trains. It’s a clear sign that your mind hasn’t become still. When one says, “I have nothing in my mind”, it means there is something in their mind. If you actually reach the state where your mind is calm, you will not say that your mind is calm. One who has actually attained this state, will look like an ordinary worldly man to the outside world, but will have a completely still mind inside.

 Such a person would have attained the state that either one of the 64 Gurus of Lord Dattatreya did. It means that he cannot announce his state to the world. He won’t talk about whether he’s achieved that state or whether he is already in that state or whether he is going to achieve that state. He won’t talk about any of these.

Some practicants say, “Oh what a bliss! I attained that state of bliss”. True. He did achieve a great state, but the Sadguru always knows what state the disciple is in. If the disciple is talking about his bliss, it is obvious that he is still a practicant, that he has not climbed the final step and that he still needs to continue his spiritual practice. But, ordinary beings who are not aware of this are in awe of this seeker and fall at his feet to offer salutations. That makes the seeker fal from his Yogic state. A lot of people may praise this seeker, “You are so devoted, you are such a senior devotee, you have been following Guru for so many years, you’ve dedicated all your wealth and belongings to Guru, your service is exemplary”. Such praise marks the beginning of the downfall of that seeker. 

The seeker feels proud and falls from his Yogic state. A true disciple should disregard such praise and stay away from such people. He should not engage in discussion with such people. But, the disciple wants this discussion, because he wants to know about these unnecessary things, he wants to know of things that don’t even concern him, he has to make up things and talk about them, he gains a sense of security in engaging in these discussion with these people and eventually falls from his Yogic state. 

Ego takes over. Let’s find out about the state of such a person. To avoid that state, you should all study Guru Gita and reach that state of no thoughts and ultimately climb the final step. That is why, let’s see what Lord Siva is teaching us here.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 151 / Sri Lalitha Chaitanya Vijnanam - 151 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |*
*నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖*

*🌻151. 'నిరంతరా'🌻*

అంతరము లేనిది శ్రీమాత అని అర్థము.

అంతరమనగా భేదమని ఒక అర్థము. ఆమె యందు ఎట్టి భేదములు లేవు. ఆమె పరమప్రేమ స్వరూపిణి గనుక, భేదబుద్ధి లేక అందరిని తగువిధముగా ఆదరించును. తాము, ఇతరులు అను భావము గలవారికి భేదబుద్ధి యుండును. శ్రీదేవికి తనవారు, ఇతరులు అను భావము లేదు. సర్వము నందు ఆత్మదర్శనము చేయువారు నిరంతరము భేదబుద్ధి లేక ఆత్మ యందే యుందురు.

వారికి అనాత్మయగు వస్తువు గోచరింపదు. అంతరమనగా ఎడము అని గూడ అర్థము గలదు. రెండు వస్తువుల మధ్య ఎడమను ఖాళీ చోటుగ మనము భావింతుము. నిజముగ ఆ చోటు యందు వ్యాపించి యున్నది శుద్ధచైతన్యమే. 

అంతరిక్షము అనగా శుద్ధచైతన్యముచే ఆవరింపబడిన చోటు. అది వస్తువుల యందు, వస్తువుల నడుమ కూడ వ్యాపించి యున్నది. అది నిండి యుండని చోటు లేదు. అట్టి ఖాళీ చోటును అంతరమని అందురు. ఖాళీ చోటునందు శుద్ధచైతన్యమును చూచుట అంతరీక్షణ మగును. అట్లు చూచిన ఋషులు ఆ చోటును అంతరిక్షము అని పిలిచిరి. 

ఇట్లు శ్రీమాతను యందు, తన పరిసరముల యందు గల చోటుగ చూచుట ఒక విశిష్టమగు ఆరాధనము. రూపములను చూచు అలవాటు గలవారు చోటును చూడలేరు. చోటును చూడగల ఋషులు రూపము నందు కూడ చోటును చూడగలరు. తమ యందు, అన్ని భూతముల యందు, చోటునందు, శుద్ధ చైతన్యమే గోచరించును. ఇట్లు అంతరీక్షణమును చూచువారు ముక్తులు. అచట వీక్షింపబడు దేవి 'నిరంతరా'. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 151 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nirantarā निरन्तरा (151) 🌻*

Antara has many meanings such as in the middle, inside, within, among, between, on the way, by the way, near, nearly, almost, in the meantime, now and then, for some time, between, during, without, etc. She is without such divisions. Brahman will neither divide nor multiply, as He does not change. It is permanent. 

Taittirīya Upaniṣad (II.7) says “If he makes even a smallest discrimination from the Brahman, he is afraid of the Brahman” (discriminating self from the Brahman). Here the fear means rebirth. The point driven home is the omnipresent nature of the Brahman.  

The Brahman within all living beings, be it a plant, an insect, an animal or a human is the same, irrespective of the gross form. The time, distance and religion do not modify the Brahman. But it is the ignorance that make one consider Brahman as someone different from what he perceives.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 492 / Bhagavad-Gita - 492 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 2 🌴*

02. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా: |
సర్గే(పి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ ||

🌷. తాత్పర్యం : 
ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్టితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యథ నొందడు.

🌷. భాష్యము :
సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మనుజుడు శ్రీకృష్ణభగవానునితో గుణరీతి ఏకత్వమును పొంది జన్మమృత్యుపరంపర నుండి ముక్తిని బడయును. అంతియేగాని ఆత్మగా అతడెన్నడును తన వ్యక్తిత్వమును కోల్పోవడు. కనుకనే ఆధ్యాత్మికజగత్తు నందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నిలిచి, ఆ పరమపురుషుని పాదపద్మములనే సదా దర్శింపగోరుదురని వేదవాజ్మయమున తెలుపబడినది.

 అనగా ముక్తినొందిన పిదపయు భక్తులు తమ నిజస్వరూపమును మరియు వ్యక్తిత్వమును కోల్పోవరు. ఈ భౌతికజగమునందు మనము సంపాదించిన జ్ఞానమంతయు త్రిగుణములచే మలినమై యుండును. త్రిగుణములచే మలినపడని జ్ఞానమే ఆధ్యాత్మికజ్ఞానము. అట్టి దివ్యమైన ఆధ్యాత్మికజ్ఞానమునందు స్థితుడైనంతనే మనుజుడు దేవదేవునితో సమానస్థాయిలో నిలుచును. ఆధ్యాత్మికజగమును గూర్చిన జ్ఞానము లేనటువంటి నిరాకారవాదులు భౌతికజగత్తు కర్మల నుండి ముక్తినొందినంతనే వైవిధ్యమన్నది లేకుండ ఆత్మ రూపరహితమగునని పలుకుదురు. 

కాని వాస్తవమునకు భౌతికజగమునందు భౌతికత్వమున వైవిధ్యమున్నట్లే ఆధ్యాత్మికజగత్తు నందు కూడా వైవిధ్యమున్నది. ఈ విషయమున అజ్ఞానులైనవారే ఆధ్యాత్మికస్థితి వైవిద్యమునకు విరుద్ధమని తలతురు. కాని నిజమునకు ముక్తి పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికజగమున ఆధ్యాత్మికరూపమును పొందును. అట్టి ఆధ్యాత్మికజగమున పలు ఆధ్యాత్మిక కర్మలు గలవు. అచ్చటి ఆధ్యాత్మికస్థితియే భక్తిమయ జీవనమనబడును. అట్టి ఆధ్యాత్మికస్థితి గుణరహితమనియు, ప్రతియొక్కరు అచ్చట భగవానునితో గుణరీతిని సమానమై యుందురనియు చెప్పబడినది. 

అటువంటి జ్ఞానసముపార్జనమునకు మనుజుడు ఆధ్యాత్మికగుణములను వృద్ధి చేసికొన వలయును. ఆ రీతి ఆధ్యాత్మికగుణములను వృద్ధిచేసికొనిన వాడు భౌతికజగత్తు సృష్టిచే గాని, ప్రలయముచే గాని వ్యథనొందడు.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 492 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 02 🌴*

02. idaṁ jñānam upāśritya
mama sādharmyam āgatāḥ
sarge ’pi nopajāyante
pralaye na vyathanti ca

🌷 Translation : 
By becoming fixed in this knowledge, one can attain to the transcendental nature like My own. Thus established, one is not born at the time of creation or disturbed at the time of dissolution.

🌹 Purport :
After acquiring perfect transcendental knowledge, one acquires qualitative equality with the Supreme Personality of Godhead, becoming free from the repetition of birth and death. One does not, however, lose his identity as an individual soul. It is understood from Vedic literature that the liberated souls who have reached the transcendental planets of the spiritual sky always look to the lotus feet of the Supreme Lord, being engaged in His transcendental loving service. So, even after liberation, the devotees do not lose their individual identities.

Generally, in the material world, whatever knowledge we get is contaminated by the three modes of material nature. Knowledge which is not contaminated by the three modes of nature is called transcendental knowledge. As soon as one is situated in that transcendental knowledge, he is on the same platform as the Supreme Person.

However, just as there is material variegatedness in this world, in the spiritual world there is also variegatedness. Those in ignorance of this think that spiritual existence is opposed to material variety. But actually, in the spiritual sky, one attains a spiritual form. There are spiritual activities, and the spiritual situation is called devotional life. 

That atmosphere is said to be uncontaminated, and there one is equal in quality with the Supreme Lord. To obtain such knowledge, one must develop all the spiritual qualities. One who thus develops the spiritual qualities is not affected either by the creation or by the destruction of the material world.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -100 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 28. యజ్ఞార్థ జీవనము - యజ్ఞార్థ కర్మలు యజ్ఞార్థముగ తెలుసుకొని ఆచరించినచో కర్మము నుండి ముక్తుడై నిలుతువు. జీవుడు కర్మబద్ధుడు. బద్దతకు కారణము ఫలాసక్తియే. ఫలమునందాసక్తి గొన్న మనసును, కర్తవ్యమునందాసక్తి గలుగునట్లు చేయుట ముఖ్యము. శ్రీకృష్ణుడు కర్మ యందు కర్తవ్యమును చూడమని, తనకు వలసినది చూడవలదని, కర్తవ్యమును మాత్రమే నిర్వర్తించినచో కర్మమంటదని, యిప్పటివరకు అంటిన కర్మ కూడ నశించునని తెలిపినాడు. 🍀*

32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధితాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే || 32

ఈ ప్రకారముగ అనేక విధములైన యజ్ఞములు బ్రహ్మాదుల ముఖము నుండి సవిస్తరముగ చెప్పబడి యున్నవి. ఇవి యన్నియు వివిధములగు యజ్ఞార్థ కర్మలు. వానిని యజ్ఞార్థముగ తెలుసుకొని ఆచరించినచో కర్మము నుండి ముక్తుడై నిలుతువు.

జీవుడు కర్మబద్ధుడు. బద్దతకు కారణము ఫలాసక్తియే. ఫలమునందాసక్తి గొన్న మనసును, కర్తవ్యమునందాసక్తి గలుగునట్లు చేయుట ముఖ్యము. 

శ్రీకృష్ణుడు కర్మ యందు కర్తవ్యమును చూడమని, తనకు వలసినది చూడవలదని, కర్తవ్యమును మాత్రమే నిర్వర్తించినచో కర్మమంటదని, యిప్పటివరకు అంటిన కర్మ కూడ నశించునని తెలిపినాడు. ఈ అధ్యాయమునకు వేదవ్యాస మహర్షి జ్ఞానయోగమని పేరిడుట ఆసక్తికరము. నిజమగు జ్ఞానము కర్మబంధ విమోచన జ్ఞానమే కదా!

దైవారాధన చేసినను, బ్రహ్మయజ్ఞము చేసినను, ద్రవ్యయజ్ఞము చేసినను, భగవంతుడు తెలిపిన 12 రకముల యజ్ఞము లన్నియు చేసినను బంధములే కలుగుచు నుండును గాని, విముక్తి చాల మందికి కలుగదు. 

కారణము, చేయు విషయమునందు మమకార మోహములు కలుగుట, ఆ కార్యములు తనవిగా భావించుట, అందలి ఫలితములు ద్రవ్యరూపమునగాని, కీర్తి రూపమున గాని తనకే దక్కవలె ననిపించుట, యివన్నియు బంధములే. అందులకే సత్కార్యములు చేయువారు కూడ బంధవిముక్తులు కాలేక యున్నారు.

విముక్తి కల్గించని యజ్ఞములు, యాగములు, సేవా కార్యక్రమములు ప్రస్తుతము జ్ఞానము కలిగిన మానవులను కూడ బంధించియున్నవి. జ్ఞానులు కూడ అజ్ఞానులవలె, ఫలాసక్తి కలిగి పరుగులెత్తుట, తాము చేయు కార్యములందు వ్యామోహపడుట, తమ కార్యములు నెరవేరవలెనని పట్టుదలతో పలువిధములైన సాధనములను ఉపయోగించుట జరుగుచునున్నది. అజ్ఞానులు - జ్ఞానులు ఒకే రకముగ విమోచనారహిత మార్గముల నడచు చున్నారు. 

ఇది ప్రకృతి చేయు యింద్రజాలము. దానికి కృష్ణు డందించిన పరిష్కారము యజ్ఞార్థ జీవనము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 298 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
72. అధ్యాయము - 27

*🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 2 🌻*

దీక్షితుడై, రక్షాబంధనోత్సవమును నిర్వర్తించి, స్వస్తి పుణ్యాహవాచనమును చేసిన దక్షుడు భార్యతో గూడి ఆ సమయములో మిక్కిలి ప్రకాశించెను (21). శంభుడు కపాలధారి గనుక, ఆయనకు యజ్ఞార్హత లేదని నిశ్చయించి, దురాత్ముడగు దక్షుడు ఆ యజ్ఞమునందు శివుని ఆహ్వానించలేదు (22). 

దోషదర్శియగు దక్షుడు, సతి తన కుమారైయే అయిననూ, కపాలధారి యొక్క భార్య అను కారణముచే యజ్ఞమునకు ఆహ్వానించలేదు (23). ఈ విధముగా దక్షయజ్ఞమహోత్సవము కొనసాగుచుండెను. యజ్ఞనియుక్తులైన వారందరు తమ తమ కార్యములయందు నిమగ్నులైరి (24). ఇంతలో శివభక్తుడగుదధీచుడు అచట శంకర ప్రభువు కానారాక పోవుటచే ఉద్వేగముతో నిండిన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (25).

దేవ ప్రముఖులారా! ఋషి ప్రముఖులారా! మీరందరు నా మాటను ఆనందముతో వినుడు. ఈ యజ్ఞముహోత్సవమునందు శంభుడు ఏల రాలేదు?(26) ఈ దేవ ప్రభువులు, గొప్ప మునులు, లోకపాలురు కూడ వచ్చినారు గదా! కాని మహాత్ముడగు ఆ పినాకి లేనిదే ఈ యజ్ఞము అధికముగా శోభించుటలేదు (27). మంగళములన్నియు ఎవని వలన కలుగునవి గొప్ప విద్వాంసులు చెప్పెదరో, అట్టి ఆ పురాణ పురుషుడు, వృషధ్వజుడు,నీలకంఠుడు అగు పరమేశ్వరుడు ఇచట కానరాలేదు (28).

ఓ దక్షా! ఎవ్వనిచే స్వీకరింపబడిన అమంగళములు కూడా మంగళములగునో, అట్టి శివుడు తన పదిహేను నేత్రములతో చూడగా మహానగరములైననూ వెంటనే మంగళమయములగును (29). కావున, నీవు స్వయముగా పరమేశ్వరుని ఆహ్వానించవలెను. లేదా, బ్రహ్మచే గాని, సర్వ సమర్థుడగు విష్ణువుచే గాని వెంటనే ఆహ్వానింపజేయుము (30). యజ్ఞసిద్ధికొరకై ఇప్పుడు ఇంద్రుడుగాని, లోకపాలురు గాని, విప్రులుగాని, సిద్ధులుగాని ఆ శంకరుని తప్పని సరిగా తోడ్కోని రావలెను (31). మహేశ్వర దేవుడు ఉన్న చోటికి మీరందరు వెళ్లుడు. సతీ దేవితో సహా శంభుని వెనువెంటనే తోడ్కొని రండు (32).

దేవ దేవుడు, సాంబుడు, పరమాత్మయగు శంభుడు ఇచటకు వచ్చినచో సర్వము పవిత్రమగును (33). శివుని స్మరించుటచే, నామమును ఉచ్చరించుటచే యజ్ఞము పరిపూర్ణము, సుకృతము అగును. కాన సర్వ ప్రయత్నములను చేసి శివుని ఇచటకు తీసుకుని రండు (34). శంకరుడు ఇచటకు వచ్చినచో యజ్ఞము పావనమగును. అట్లు గానిచో యజ్ఞము పూర్ణము కాబోదు. నేను సత్యమును పలుకుచున్నాను (35).

బ్రహ్మ ఇట్లు పలికెను -

మూఢబుధ్ది, క్రోధావిష్టుడనగు దక్షుడు ఆయన యొక్క ఆ మాటలను విని చిరునవ్వును నటిస్తూ వెంటనే ఇట్లు పలికెను (36). విష్ణువు దేవతలకు ఆధారము. సనాతన ధర్మము ఆయన యందు ప్రతిష్ఠితమై యున్నది. అట్టి విష్ణువును నేను సాదరముగా రప్పించితిని. ఈ యజ్ఞమునకు ఏమి లోటు వచ్చినది?(37). 

ఎవనియందు వేదములు, యజ్ఞములు, వివిధ కర్మలు సర్వము ప్రతిష్ఠితమైయున్నవో, అట్టి విష్ణువు ఇచటకు వచ్చియున్నాడు (38). లోకములకు పితామహుడగు బ్రహ్మ వేదములతో, ఉపనిషత్తులతో, వివిధ శాస్త్రములతో గూడి సత్యలోకమునుండి విచ్చేసినాడు (39).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 53 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 4 - THE 3rd RULE
*🌻 Kill out desire of comfort. - Be happy as those are who live for happiness. - 10 🌻*

228. Later there comes a stage when self-reliance means reliance upon the Higher Self. The man no longer relies either on the skill of his hand, the fleetness of his foot and the strength of his muscles, or on his intellectual powers, but comes to realize that there is a strength of the spirit which is greater far than all these outer manifestations, and when this stage is reached he soon begins to see that the strength of his spirit is the strength of the infinite that lies behind it, because it is one with God Himself. Thus our self-reliance at last becomes reliance on Him – on the mighty Power behind.

We are He, and in relying on God we are relying on ourselves, because each of us is a spark of the Divine, and the Godhead is in us. We only need to realize that and to unfold it, and then the self on which we rely becomes the great Self which is the All.

229. This idea of the separated self is ingrained in us and is part of the very ego which is the one permanent thing about us as far as we know. 

We have still to learn that there is the Monad; that will seem the true Self when we have laid aside the individuality. Yet when that time comes we shall see far more clearly than we do now that those Monads are only sparks of the Eternal Flame. 

We know it now theoretically, and true realization of it will come to all in due course; it has come to some already. I have explained before that when the consciousness is focused in the highest part of the causal body it is possible to look up the line that joins the Monad and the ego. 

Looking up that line into the Monad of which we know so little, and beyond it, we can see and know with a definiteness and certainty that no words can express down here, that all we have thought of as the Self and as belonging to us, is not we, but He; that if we had any intellect, any devotion or affection, it was not we at all, but it was the intellect, the devotion, the love which is God, which was showing itself forth through us.

 When a man has had that experience he can never be quite the same again; he cannot come down again in the same way to the personal point of view, because he knows with the certainty that convinces. 

Some experience like that is needed to counteract the result of the development of the separated self which at present is a great trouble and causes us much sorrow and suffering by obscuring our view of Life. 

We are in this curious position that our self-development is due to the idea of separateness up to a certain point, and it is only when we have reached that point that it becomes an evil, and we have to get rid of it. Humanity has now reached a stage where it ought to be realizing that. 

That is why the duty of unselfishness is impressed upon us so strongly by all occult and high religious teaching. Humanity as a whole needs that. It is still in the selfish stage, trying to grasp this and that for itself. The whole of our strength must be turned against that tendency.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 185 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. విశ్వామిత్రమహర్షి - 5 🌻*

28. సత్వగుణంచేత-పుణ్యశీలి కాబట్టి-వైశ్యుడిస్తాడు, క్షత్రియుడు క్షాత్ర గుణంతో ఇస్తాడు. బ్రాహ్మణుడు లోభగుణం కలిగి ఉంటాడు భయస్థుడు కాబట్టి. సత్వగుణంచేత ఇతడు దాత కాలేడు అనిచెప్పి, అనేక స్మృతులలో కూడా ఉంది. అయితే ఎవ్వరూ చేయలేని దానం బ్రాహ్మణుడిని చేయమని స్మృతిలో ఒకచోట చెప్పబడింది. తపస్సుచేసి దానిని దానంచెయ్యమని ఉంది.

29. అందులోనూ, తపస్సుచేసి ఆ ఫంలాన్ని ధారపోస్తే సహజంగా ముక్తి లభిస్తుంది. అందుకనే బ్రాహ్మణుడు చేసేవన్నీకూడా లోకానుగ్రహంకోసమే అంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆ ఫలాన్ని లోకపాలకులైన ఈశ్వరుడు-బ్రహ్మలకు, పరమేశ్వరభావనతో అర్పణం చెయ్యటం-పరమేశ్వరార్పణం. అలా చేస్తే లోకానికి క్షేమం కలుగుతుందని, అలా చెయ్యమని చెప్పారు. (బ్రాహ్మణుడు ధనం నిల్వపెట్టుకోకూడదు అని ఒక సూచన)

30. ఆ మాటకొస్తే ఐశ్వర్యవంతులయిన బ్రాహ్మణులున్నారు, తపోవృత్తియందుండేటటువంటి బ్రాహ్మణులు; అంతేగాక లోకంలో, సంఘంలో ప్రవర్తించే బ్రాహ్మణులు కూడా ఉన్నారు. తరువాత యుగములు మారినకొద్దీ వాళ్ళల్లో అనేక మార్పులు వచ్చాయి. అనేక ధర్మాలు బ్రాహ్మ్యంలో క్షాత్రం, క్షాత్రంలో బ్రాహ్మణ్యం ఇలాగ సంకీర్ణమయిన ధర్మములు వచ్చాయి. 

31. ఈ యుగానికి ఈ ధర్మమని అలాగ కచ్చితంగా గీతలుగీసి విడిగా చూపించటానికి లేదు. క్షాత్రలక్షణం కలిగిన బ్రాహ్మణులు, బ్రాహ్మణుడయిన క్షత్రియుడు, ఇలాగ చెప్పుకుంటుంటే అనేక ధర్మములు ఒకదానిక్తో ఒకటి కలిసిపోతాయి. కలిలో ప్రధానమయినది, అందరూ విధిగా నిర్వర్తించవలసింది సత్యధర్మము. కలిలో అంతఃశౌచము చెప్పబడింది.

32. మనోబుద్ధి చిత్తముల శుచి ముఖ్యం. వందమాట్లు స్నానంచేసి, అంతఃకరణలో శౌచంలేనటువంటివాడు వ్యర్థుడు. శరీరానికి శుచి అనేమాట అసలు వర్తించనే వర్తించదు. ఎన్నిసార్లు స్నానంచేసినా లోపల మాలిన్యం అనేది ఉండనేఉంది కదా! స్నానంచేసేది కేవలం చర్మం మాత్రమే కదా! స్నానంవలన లోపలి వస్తువు క్షాళనమవుతుందా! చర్మాన్ని శుభ్రపరచుకోవడమే స్నానం అవుతుందిగాని, దీనివలన శుచిని పొందాడని అనుకోవటం పొరపాటే అవుతుంది. 

33. పూర్వయుగాలలో శరీరకశౌచముకూడా చాలా గొప్పగా ఉండేది. యోగబలంచేత వాళ్ళు నిరాహారులుగా ఉండేవాళ్ళు. ఆహారం లేకుండా ఎందుకు తపస్సు చేయాలి? శౌచంతో నిరాహారంగా తపస్సుచేయటం వాళ్ళ ఉద్దేశ్యం. నిత్యమూ ఆహారంతీసుకునే శరీరంలో శౌచమేలేదు, శుచి ఉండదు కాబట్టి; పరిపూర్ణమయిన శౌచవిధితో శరీరం తపస్సుయందు వినియోగించాలి. 

34. అంటే ఆహారం తీసుకోకుండా ఉండటమే! శరీరం అనేది ప్రాణానికి చిన్న గూడులాంటిది. శుష్కించిన శరీరం, దమించబడిన ఇంద్రియాలు, మహోగ్రమైనటువంటి అంతఃకరణ -ఇదీ తపస్సుయొక్క స్థితి. శరీరాన్ని క్షయింపచేస్తే, మనుష్యుని లోపలుండే అంతరంగబలం క్షీణిస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు. శరీరం శుష్కించటం వేరు. లోపల బలం, నేను అనే అహంకారం, జీవునియందున్న ప్రాణశక్తి, దాంట్లో ఉండే బలంవేరు. అది తపస్సుతో పెరుగుతుంది. శరీరం క్షీణిస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 249 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 98. In deep meditation, infused only with the knowledge 'I am', it will be intuitively revealed to you as to how this 'I amness' came to be. 🌻*

The Guru once again highlights the importance of meditation for the 'Sadhak' (aspirant); and this, too, is not something to be done casually but in a very deep way. 

What is meant by deep? Deep means that you know nothing but the sense 'I am' for a prolonged, uninterrupted period of time. 

Success may or may not come early, but come it will if you are completely infused with the knowledge 'I am' with enormous sincerity and earnestness. And what will be revealed to you? The 'I amness' itself will tell its story and you will come to know how it came to be. 

Or, paradoxically speaking, how the 'I am' never came to be or never was in the first place! It is always the Absolute that was, is, and will be for ever; the 'I am' was only an illusion that appeared on it.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 124 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 3 🌻*

516. నిర్వికల్ప సమాధి అనగా "నేను నిస్సందేహంగా భగవంతుడను" ... అనెడు స్వానుభవము.

Notes :- బ్రహ్మమ్ = భగవంతుడు
బ్రహ్మీ భూతుడు = భగవంతుడైనవాడు
బ్రహ్మీ భూతుడు = "దివ్య అహం"
= దివ్య చైతన్యము (మైనస్ ) పరిమిత చైతన్యము.

517. "నేను భగవంతుడను" అనెడి నిర్వికల్ప సమాధిస్థితి అనుభవమును పొందుచున్న వారిని "బ్రహ్మి భూతుడు" అందురు. వీరు భగవంతుని అనంత స్వభావత్రయమైన అనంత జ్ఞాన - శక్తీ - ఆనందములు, తమయొక్క అనంత స్వస్వభావమేనని, అనుభూతి నొందెదరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 88 / Sri Vishnu Sahasra Namavali - 88 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*శ్రవణం నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 88. సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రుతాపనః !*
*న్యగ్రోధోదుంబరోశ్వత్థ శ్చాణూరాంధ్ర నిషూదనః !! 88 !! 🍀*

🍀 817. సులభః - 
సులభముగా లభ్యమగువాడు.

🍀 818. సువ్రతః - 
మంచి వ్రతము గలవాడు.

🍀 819. సిద్ధః - 
సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై విరాజిల్లువాడు.

🍀 820. శత్రుజిత్ - 
శత్రువులను జయించువాడు.

🍀 821. శత్రుతాపనః - 
సజ్జనులకు విరోధులైన వారిని హరించువాడు.

🍀 822. న్యగ్రోధః - 
సర్వభూతములను మాయచే ఆవరించినవాడు.

🍀 823. ఉదుంబరః - 
అన్నముచేత విశ్వమును పోషించువాడు.

🍀 824. అశ్వత్ధః - 
అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.

🍀 825. చాణూరాంధ్ర నిషూదనః - 
చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 88 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Sravana 4th Padam*

*🌻 88. sulabhaḥ suvrataḥ siddhaḥ śatrujicchatrutāpanaḥ |*
*nyagrōdhōdumbarōśvatthaścāṇūrāndhraniṣūdanaḥ || 88 || 🌻*

🌻 817. Sulabhaḥ: 
One who is attained easily by offering trifles like leaf, flower, and fruits etc., with devotion.

🌻 818. Suvrataḥ:
 'Vratati' means enjoys. So, one who enjoys pure offerings. It can also mean one who is a non-enjoyer, that is, a mere witness.

🌻 819. Siddhaḥ: 
One whose objects are always attained, that is, omnipotent and unobstructed by any other will.

🌻 820. Śatrujit: 
Conqueror of all forces of evil.

🌻 821. Śatrutāpanaḥ: 
One who destroys the enemies of the Devas.

🌻 822. Nyagrodhaḥ: 
That which remains above all and grows downward. That is, He is the source of everything that is manifest.

🌻 823. Udumbaraḥ: 
One who as the Supreme cause is 'above the sky', that is, superior to all.

🌻 824. Aśvatthaḥ: 
That which does not last even for the next day.

🌻 825. Cāṇūrāndhra-niṣūdanaḥ: 
One who destroyed a valiant fighter Chanura belonging to the race of Andhra.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment