శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 151 / Sri Lalitha Chaitanya Vijnanam - 151


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 151 / Sri Lalitha Chaitanya Vijnanam - 151 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖



🌻151. 'నిరంతరా'🌻

అంతరము లేనిది శ్రీమాత అని అర్థము.

అంతరమనగా భేదమని ఒక అర్థము. ఆమె యందు ఎట్టి భేదములు లేవు. ఆమె పరమప్రేమ స్వరూపిణి గనుక, భేదబుద్ధి లేక అందరిని తగువిధముగా ఆదరించును. తాము, ఇతరులు అను భావము గలవారికి భేదబుద్ధి యుండును. శ్రీదేవికి తనవారు, ఇతరులు అను భావము లేదు. సర్వము నందు ఆత్మదర్శనము చేయువారు నిరంతరము భేదబుద్ధి లేక ఆత్మ యందే యుందురు.

వారికి అనాత్మయగు వస్తువు గోచరింపదు. అంతరమనగా ఎడము అని గూడ అర్థము గలదు. రెండు వస్తువుల మధ్య ఎడమను ఖాళీ చోటుగ మనము భావింతుము. నిజముగ ఆ చోటు యందు వ్యాపించి యున్నది శుద్ధచైతన్యమే.

అంతరిక్షము అనగా శుద్ధచైతన్యముచే ఆవరింపబడిన చోటు. అది వస్తువుల యందు, వస్తువుల నడుమ కూడ వ్యాపించి యున్నది. అది నిండి యుండని చోటు లేదు. అట్టి ఖాళీ చోటును అంతరమని అందురు. ఖాళీ చోటునందు శుద్ధచైతన్యమును చూచుట అంతరీక్షణ మగును. అట్లు చూచిన ఋషులు ఆ చోటును అంతరిక్షము అని పిలిచిరి.

ఇట్లు శ్రీమాతను యందు, తన పరిసరముల యందు గల చోటుగ చూచుట ఒక విశిష్టమగు ఆరాధనము. రూపములను చూచు అలవాటు గలవారు చోటును చూడలేరు. చోటును చూడగల ఋషులు రూపము నందు కూడ చోటును చూడగలరు. తమ యందు, అన్ని భూతముల యందు, చోటునందు, శుద్ధ చైతన్యమే గోచరించును. ఇట్లు అంతరీక్షణమును చూచువారు ముక్తులు. అచట వీక్షింపబడు దేవి 'నిరంతరా'.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 151 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirantarā निरन्तरा (151) 🌻

Antara has many meanings such as in the middle, inside, within, among, between, on the way, by the way, near, nearly, almost, in the meantime, now and then, for some time, between, during, without, etc. She is without such divisions. Brahman will neither divide nor multiply, as He does not change. It is permanent.

Taittirīya Upaniṣad (II.7) says “If he makes even a smallest discrimination from the Brahman, he is afraid of the Brahman” (discriminating self from the Brahman). Here the fear means rebirth. The point driven home is the omnipresent nature of the Brahman.

The Brahman within all living beings, be it a plant, an insect, an animal or a human is the same, irrespective of the gross form. The time, distance and religion do not modify the Brahman. But it is the ignorance that make one consider Brahman as someone different from what he perceives.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2020

No comments:

Post a Comment