సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 8
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 8 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 8 🍀
సంతాంచే సంగతీ మనోమార్గ గతీ!
ఆకళావా శ్రీపతీ యేడే పంథే!!
రామకృష్ణ వాచా భావ హా జీవాచా!
ఆత్మాజో శివాచా రామజప్!!
ఏకతత్త్వ నామ్ సాధితీ సాధన్!
ద్వైతాచే బంధన్ నబాధిజే!!
నామామృత గోడీ వైష్ణవా లాధలీ! !
యోగియా సాధలీ జీవనకళా!!
సత్వర ఉచ్ఛార్ ప్రహ్లాదీ బింబలా!
ఉద్ధవా లాధలా కృష్ణ దాతా!!
జ్ఞానదేవ మణే నామ హే సులభై!
సర్వత్ర దుర్లభ్ విరళా జాణే!!
భావము:
సంతుల సాంగత్యము చేసి మనసును వేగిరపర్చుము శ్రీపతిని పట్టుటకు ఈ నామ మార్గము చాలా సులభము.. భావముతో రామ కృష్ణ నామము నాలుకతో పఠించడము జీవుడి ధర్మము. శివుని ఆత్మ రాముడు, కావున శివుడు రామ నామ జపము చేయుచున్నాడు.
నామము ఏక తత్వము, సాధనము ఇదే, సాధ్యము కూడ ఈ నామమే, ఇలా తెలుసుకున్న వారిని ద్వైతము బంధించి బాధించదు..
నామామృతములోని మాధుర్యాన్ని వైష్ణవులు పొందినారు. యోగులు జీవించే కళలు సాధించగల్గినారు.. ప్రహ్లాదుడికి హరినామము హృదయములో నాటు కొనుటచే సత్వరమే ఉచ్చరించగల్గినాడు.
దాతయైన శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి లభించినాడు. నామము సులభ సాధనము. నామ జపము చేయువారు మాత్రము దుర్లభము. ఎక్కడనో ఒక్క భక్తుడున్నాడు. కనుగొనుమని జ్ఞానదేవులు అంటున్నారు.
🌻. నామ సుధ -8 🌻
సంతులతో సాంగత్యము చేయుము
గతి తప్పిన మనసును అరికట్టుము
వేగిరపడి శ్రీపతిని పట్టుము
ఈ పంతము ఎన్నటికీ మానకుము
రామకృష్ణ నామమునే పాడుము
ఈ నామమే జీవుడి భావము
శివుని ఆత్మ రాముడని ఎరుగుము
అందుకే జపించు శివుడా నామము
ఒక్కటే తత్వము భక్తుడి భావము
సాధనతో సాధ్యము ఆ నామము
తొలగి పోయినది బంధము
ఇక నుండి బాధించదు ద్వైతము
మధురమైన నామామృతము
సులభముగ వైష్ణవులకు లభ్యము
కష్టించితే జీవన పర్యంతము
యోగులకు జీవనకళ సాధ్యము
స్మరించెను ప్రహ్లాదుడు సత్వరము
నాటుకున్నది దైవ భావము
ఉద్దవునికి అయినాడు లభ్యము
దాతయైన శ్రీకృష్ణుడు ప్రాప్తము
జ్ఞానదేవుడన్నాడు ఆ నామము
అన్నింటిలో ఈ సాధన సులభము
సాధించే సాధకులు దుర్లభము
ఉన్నారు ఏ ఒక్కరో కనుగొనుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment